మోనో సోడియం గ్లూటామేట్
పేర్లు | |
---|---|
IUPAC నామము
Sodium 2-aminopentanedioate
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [142-47-2] |
పబ్ కెమ్ | 85314 |
EC-number | 205-538-1 |
SMILES | [Na+].O=C([O-])[C@@H](N)CCC(=O)O |
| |
ధర్మములు | |
C5H8NO4Na | |
మోలార్ ద్రవ్యరాశి | 169.111 g/mol |
స్వరూపం | White crystalline powder |
ద్రవీభవన స్థానం | 232 °C (450 °F; 505 K) |
74 g/100 mL | |
ప్రమాదాలు | |
Lethal dose or concentration (LD, LC): | |
LD50 (median dose)
|
15800 mg/kg (oral, rat) |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
మోనో సోడియం గ్లుటామెట్ అనేది రుచిని అందించే లవణం. దీనిని క్లుప్తంగా ఎంఎస్‌జీ అని వ్యవహరిస్తారు. దీని రుచిని జపాన్, చైనా వంటకాలలో ఉమామి అని ఆంటారు . ఇది 1907 లో కికూనే ఇకెడా (Kikunae Ikeda) అనే జపనీస్ ప్రొఫెసర్ తయారు చేసారు[1], దీనిని 1909లో జపాన్‌కు చెందిన అజినొమొటో కంపెనీ అధికారికంగా మార్కెట్‌లోకి విడుదల చేసింది. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదులకు తోడుగా దీన్ని ఏడో రుచిగా చెప్పుకుంటారు. ఎంఎస్‌జిని తయారు చేసిన అజినోమోటో కంపెనీ పేరుకు ‘ఎసెన్స్ ఆఫ్ టేస్ట్’ అని అర్థం.
భారతీయ వంటకాల్లో దీని వాడకం ఎక్కువే. ఆహార పదార్థాల్లో వీటిని వాడితే రుచి పెరుగుతుంది. కొన్నాళ్లు చెడిపోకుండా నిల్వ ఉంటుంది. దీనిని ప్రధానంగా చైనీస్ సంబంధిత వంటకాల్లో ఎక్కవగా వాడుతుంటారు. మోనో సోడియం గ్లుటామెట్ ను అహార పదార్దాల రుచిని పెంచటానికి వాడతారు, విపణిలో దీనిని అజినొమోటో ఆనే బ్రాండ్ పేరుతొ మార్కెట్టులో లభిస్తుంది, ఈ ఎంఎస్ జీని అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ విభాగంవారు సాధారణంగా సురక్షితమైన ఆహార పదార్థంగా పేర్కోన్నారు.[2]. ఆహార పదార్దాలలో దీని అనుమతి మీద అనేక వివాదాలు వున్నాయి . ఎఫ్.డి.యే వారు 1990 లో Federation of American Societies for Experimental Biology (FASEB) వారి చేత నిర్వహించిన పరిశోధన ఫలితాల ప్రకారం మోనో సోడియం గ్లుటామెట్ సురక్షితమైన ఆహార పదార్థం అయినప్పటికీ రోజుకు 3 గ్రాముల ఆహారం లేదా లేకుండా MSG మరింత వాడుకుంటున్న కొన్ని సున్నితమైన వ్యక్తులకు కొన్ని స్వల్పకాలిక, తలనొప్పి, తిమ్మిరి, ఫ్లషింగ్, జలదరింపు, దడ, మగతగా అస్థిరమైన, సాధారణంగా స్వల్ప లక్షణాలలు సంక్రమించవచ్చు [3] అయితే, సాధారణంగా తీసుకొనే న్యూడిల్స్ వంటి ఆహారంలో మోనో సోడియం గ్లుటామెట్ అ 0.5 గ్రాముల కంటే తక్కువ కలిగి ఉంటుంది.
ఇన్‌స్టెంట్ నూడిల్స్ రుచికరంగా ఉండటానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి కొన్ని రసాయన పదార్థాలు వాడతారు. ముఖ్యంగా మోనో సోడియం గ్లుటామేట్, సీసం (లెడ్) ఉపయోగిస్తారు. మోనో పొటాషియం గ్లుటామేట్, ఆటోలైజ్డ్ ఈస్ట్, అజినోమోటో, సోడియం కేసినైట్ అని పిలిచే ఎంఎస్‌జి సాంద్రత నిజానికి 0.01 పిపిఎం ఉండాలి. మనదేశంలో ఈ మధ్య మార్కెట్లో లభ్యమైన మ్యాగీ నూడిల్స్‌లో ఈ పరిమితి ఆరురెట్లు అధికంగా ఉందన్నది భారత ఆహార నాణ్యత, ప్రమాణాల సంస్థ అధికారిక ఆరోపణ 13 శాంపిళ్లను పరీక్షించిస్తే వాటిలో పది శాంపిళ్లలో అనుమతించిన దానికంటే అత్యధిక మోతాదులో సీసం, ఎంఎస్�జీ ఉన్నట్లు తేలింది. కేంద్రీయ భండార్ సహా ఢిల్లీ ప్రభుత్వ దుకాణాలు అన్నింటిలోనూ మ్యాగీ అమ్మకాలను నిషేధించారు. అనుమతించిన దానికంటే అత్యధిక మొత్తంలో సీసం, మోనోసోడియం గ్లూటామేట్ ఉన్నట్లు తేలడంతో రంగంలోకి దిగిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అమ్మకానికి సిద్ధంగా ఉన్న మ్యాగీని ఉపసంహరించుకోవాలని తెలిపింది. అలాగే అరక్షిత ఉత్పత్తులను మిస్ బ్రాండింగ్ చేసినందుకు జరిమానా వేస్తామని ప్రకటించింది. అది నిజం కాదని, తమ పరిశోధనల్లో అంతా సవ్యంగానే ఉందని చెబుతున్న మ్యాగీ నూడిల్స్ ఉత్పత్తిదారు నెస్ట్లే యాజమాన్యం వినియోగదారుడి మనసు నొప్పించకుండా ఉండేందుకు ఆ స్టాక్‌ను వెనక్కి రప్పించుకుంది.
మూలాలు
[మార్చు]- ↑ http://www.s.u-tokyo.ac.jp/en/research/alumni/ikeda/[permanent dead link]
- ↑ http://www.fda.gov/Food/IngredientsPackagingLabeling/FoodAdditivesIngredients/ucm328728.htm
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2015-02-19. Retrieved 2015-06-18.
ఇతర లింకులు
[మార్చు]- Monosodium glutamate: Is it harmful? (Mayo Clinic)
- International Glutamate Information Service (IGIS)
- The Facts on Monosodium Glutamate (EUFIC)