Jump to content

మోనికా సుమ్రా

వికీపీడియా నుండి
మోనికా సుమ్రా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మోనికా హరీష్ సుమ్రా
పుట్టిన తేదీ (1980-10-14) 1980 అక్టోబరు 14 (వయసు 44)
నాగపూర్, మహారాష్ట్ర, భారత దేశము
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగుకుడి చేతి వాటం, లెగ్ స్పిన్, లెగ్ బ్రేక్
పాత్రబ్యాట్స్ వుమన్; అప్పుడప్పుడు వికెట్ కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 68)2005 21 నవంబర్ - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2006 ఆగస్టు 8 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 77)2004 24 డిసెంబర్ - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2006 ఆగస్టు 25 - ఇంగ్లాండ్ తో
ఏకైక T20I (క్యాప్ 11)2006 ఆగస్టు 5 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2000/01ఝార్ఖండ్ మహిళా క్రికెట్ జట్టు
2004/05–2006/07రైల్వేస్
2007/08–2008/09ముంబై మహిళా క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ మహిళా టెస్ట్ WODI WT20I WLA
మ్యాచ్‌లు 3 14 1 41
చేసిన పరుగులు 61 304 1,133
బ్యాటింగు సగటు 10.16 27.63 35.40
100లు/50లు 0/0 0/3 2/6
అత్యుత్తమ స్కోరు 29 63* 138*
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 0/– 6/3
మూలం: CricketArchive, 2022 ఆగస్టు 29

మోనికా సుమ్రా (జననం 1980 అక్టోబరు 14) ఒక భారతీయ మాజీ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె పూర్తి పేరు మోనికా హరీష్ సుమ్రా. ఆమె 1980 అక్టోబరుఆ 14 న విదర్భలో జన్మించింది. ఆమె కుడిచేతి వాటం బ్యాటర్, అప్పుడప్పుడు వికెట్ కీపర్‌గా ఆడింది. ఆమె 2004, 2006 మధ్య భారతదేశం తరపున మూడు టెస్ట్ మ్యాచ్‌లు, 14 మహిళల ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ లు, ఒక ట్వంటీ 20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. ఆమె జార్ఖండ్, రైల్వేస్, ముంబై తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]

మోనికా 2004 డిసెంబరు 24న తన అంతర్జాతీయ మ్యాచ్ లు ఆస్ట్రేలియా జట్టుతో ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ తో ఆరంభం చేసింది. ఆమె ఆడిన పద్నాలుగు ODIల్లో, సుమ్రా బ్యాటింగ్ 27.63 సగటుతో 304 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 63*తో, ఆమె ఖాతాలో మూడు అర్ధశతకాలు ఉన్నాయి. మొత్తం మూడు టెస్టు మ్యాచ్‌ల్లో, మోనికా 10.16 సగటుతో అరవై ఒక్క పరుగులు చేసింది. టెస్టుల్లో ఆమె అత్యధిక స్కోరు 29 పరుగులు.

ఇంగ్లండ్ మహిళల జాతీయ జట్టుతో ఆడిన T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో మోనికాను ఎంపిక చేసారు. కానీ ఈ మ్యాచ్‌లో ఆమెకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.[3]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Player Profile: Monica Sumra". ESPNcricinfo. Retrieved 29 August 2022.
  2. "Player Profile: Monica Sumra". CricketArchive. Retrieved 29 August 2022.
  3. "Monica Sumra". Sports Pundit. Retrieved 23 August 2023.

బాహ్య లింకులు

[మార్చు]