మోడరన్ టైమ్స్ (1936 సినిమా)
Jump to navigation
Jump to search
మోడరన్ టైమ్స్ | |
---|---|
దర్శకత్వం | చార్లీ చాప్లిన్ |
రచన | చార్లీ చాప్లిన్ |
నిర్మాత | చార్లీ చాప్లిన్ |
తారాగణం | చార్లీ చాప్లిన్, పైలెట్ట గొడ్దార్డ్, హెన్రీ బెర్గ్మాన్, టినీ శాండ్ఫోర్డ్, చెస్టర్ కాంక్లిన్ |
ఛాయాగ్రహణం | ఇరా హెచ్. మోర్గాన్, రోలాండ్ టోటెరోహ్ |
కూర్పు | విల్లార్డ్ నికో |
సంగీతం | చార్లీ చాప్లిన్ |
పంపిణీదార్లు | యునైటెడ్ ఆర్టిస్ట్స్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 5, 1936 |
సినిమా నిడివి | 87 నిముషాలు |
భాష | ఇంగ్లీష్ |
బడ్జెట్ | $1.5 మిలియన్[1] |
బాక్సాఫీసు | $1.4 మిలియన్ (దేశీయ)[1] |
మోడరన్ టైమ్స్ 1936, ఫిబ్రవరి 5న విడుదలైన అమెరికా హాస్య చలనచిత్రం. చార్లీ చాప్లిన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ సినీచరిత్రలో మూకీచిత్రాలకు వీడ్కోలు పలికిన చిత్రంగా నిలిచింది. ఇందులో చార్లీ చాప్లిన్, పైలెట్ట గొడ్దార్డ్, హెన్రీ బెర్గ్మాన్, టినీ శాండ్ఫోర్డ్, చెస్టర్ కాంక్లిన్ తదితరులు నటించారు.[2]
కథా నేపథ్యం
[మార్చు]కర్మాగారాల్లో కార్మికులను ఎలా పనిచేయించుకుంటారో చూయించిన చిత్రం ఇది. మనిషి జీవితంలో ఆహారం, డబ్బు, ప్రేమ చాలా ముఖ్యమని, వాటికోసం ఆ మనిషి పడే తపనను సినిమాలో వ్యంగ్యంగా చూపించబడింది. యాంత్రిక జీవనంలో మనిషి పిచ్చివాడిలా మారే పరిస్థితి వస్తుంది. జీవితాన్ని ప్రామాణికం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి, మనుషులను మరలుగా మార్చడానికి జరుగుతున్న పద్ధతుల గురించి తనకు తోచినవిధంగా చార్లీ చాప్లిన్ చెప్పాడు.[3]
నటవర్గం
[మార్చు]- చార్లీ చాప్లిన్
- పైలెట్ట గొడ్దార్డ్
- హెన్రీ బెర్గ్మాన్
- టినీ శాండ్ఫోర్డ్
- చెస్టర్ కాంక్లిన్
- అల్ ఎర్నెస్ట్ గార్సియా
- స్టాన్లీ బ్లిస్టోన్
- రిచర్డ్ అలెగ్జాండర్
- సెసిల్ రేనాల్డ్స్
- మీరా మెకిన్నీ
- ముర్డోక్ మాక్క్వారీ
- విల్ఫ్రెడ్ లుకాస్
- ఎడ్వర్డ్ లేసైన్ట్
- ఫ్రెడ్ మాలటేస్టా
- సమ్మీ స్టెయిన్
- హాంక్ మాన్
- లూయిస్ నతియాక్స్
- గ్లోరియా డేహవెన్
- జునా సుట్టన్
- టెడ్ ఒలివర్
- బాబీ బార్బర్
- హ్యారీ విల్సన్
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, నిర్మాత, సంగీతం, దర్శకత్వం: చార్లీ చాప్లిన్
- ఛాయాగ్రహణం: ఇరా హెచ్. మోర్గాన్, రోలాండ్ టోటెరోహ్
- కూర్పు: విల్లార్డ్ నికో
- పంపిణీదారు: యునైటెడ్ ఆర్టిస్ట్స్
చిత్ర విశేషాలు
[మార్చు]- ఈ చిత్రంకోసం చార్లీ సంవత్సరంపాటు స్క్రిప్టును తయారుచేసుకొని, 11 నెలలపాటు చిత్రీకరించాడు.[4]
- సినిమాలో సంభాషణలు పెట్టాలనుకున్న చార్లీ అందుకోసం స్క్రీన్ ప్లే, మాటలను కూడా రాసుకున్నాడు. కానీ, చివరకు మూకీచిత్రంగానే రూపొందించాడు.[2]
- 1934, అక్టోబర్ 11న చిత్రీకరణ ప్రారంభమై, 1935, ఆగష్టు 30న ముగిసింది.[5]
- 1935-36లో బ్రిటీష్ బాక్సాఫీస్ వద్ద అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది.[6]
- 2003లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది.[7]
- అమెరికన్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ వారిచే 1998లో అమెరికన్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ వారి 100 సంవత్సరాలు...100 చిత్రాలు విభాగంలో 81వ చిత్రంగా,[8] 2000లో అమెరికన్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ వారి 100 సంవత్సరాలు... 100 హాస్య భరితమైన సినిమాలు సినిమాలు విభాగంలో 33వ చిత్రంగా,[9] 2007లో అమెరికన్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ వారి 100 సంవత్సరాలు...100 సినిమాలు (10వ వార్షికోత్సవ సంచిక) విభాగంలో 78వ చిత్రంగా[10] గుర్తించబడింది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Balio, Tino (2009). United Artists : The Company Built by the Stars. University of Wisconsin Press. ISBN 978-0-299-23004-3. p131
- ↑ 2.0 2.1 పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 37.
- ↑ పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 36.
- ↑ పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 38.
- ↑ As said in Chaplin Today: Modern Times, a 2003 French documentary.
- ↑ "The Film Business in the United States and Britain during the 1930s" by John Sedgwick and Michael Pokorny, The Economic History Review New Series, Vol. 58, No. 1 (Feb., 2005), p. 97
- ↑ "Festival de Cannes: Modern Times". festival-cannes.com. Archived from the original on 7 ఫిబ్రవరి 2015. Retrieved 20 February 2019.
- ↑ "AFI's 100 Years ... 100 Movies" (PDF). American Film Institute. Retrieved 20 February 2019.
- ↑ "AFI's 100 Years ... 100 Laughs" (PDF). American Film Institute. Archived from the original (PDF) on 24 జూన్ 2016. Retrieved 20 February 2019.
- ↑ "AFI's 100 Years ... 100 Movies (10th Anniversary Edition)" (PDF). American Film Institute. Retrieved 20 February 2019.
ఇతర లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Modern Times (film)కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- మోడరన్ టైమ్స్ యూట్యూబ్‌లో
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మోడరన్ టైమ్స్
- Filmsite మోడరన్ టైమ్స్ పేజీ
- Movie stills and bibliography
- Tour of Modern Times filming locations
ఆధార గ్రంథాలు
[మార్చు]- పాలకోడేటి సత్యనారాయణరావు (2007), హాలివుడ్ క్లాసిక్స్ (మొదటి సంపుటి), హైదరాబాద్: శ్రీ అనుపమ సాహితి ప్రచురణ, retrieved 20 February 2019[permanent dead link]