మొహమ్మద్ బిన్ సల్మాన్
మొహమ్మద్ బిన్ సల్మాన్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 21 June 2017 | |||
చక్రవర్తి | Salman | ||
---|---|---|---|
ముందు | Muhammad bin Nayef | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 23 January 2015 | |||
చక్రవర్తి | Salman | ||
ముందు | Salman bin Abdulaziz Al Saud | ||
Deputy Crown Prince of Saudi Arabia
Second Deputy Prime Minister | |||
పదవీ కాలం 29 April 2015 – 21 June 2017 | |||
ప్రధాన మంత్రి | Salman | ||
చక్రవర్తి | Salman | ||
ముందు | Muhammad bin Nayef | ||
తరువాత | Vacant | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
తల్లిదండ్రులు | King Salman bin Abdulaziz Al Saud Fahda bint Falah bin Sultan bin Hathleen al-Ajmi | ||
జీవిత భాగస్వామి | Sara bint Mashoor[1] | ||
సంతానం | 4 |
ఎంబీఎస్[1][2][3] గా ప్రసిద్ధుడైన మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సాద్ (అరబ్బీ: محمد بن سلمان بن عبدالعزيز آل سعود Muhammad bin Salmān bin ‘Abd al-‘Azīz Āl Sa‘ūd; సౌదీ అరేబియా ఉప ప్రధాని[4], రక్షణమంత్రి,[5] దేశంలోని అతిపెద్ద చమురు కంపెనీకి అధినేత. ఇతడిని విదేశీ పాత్రికేయులు మిస్టర్ ఎవ్రీథింగ్ గా పిలుచుకుంటారు.
బాల్యం-విద్యాభ్యాసం
[మార్చు]1985 ఆగస్టు 31న బిన్ సల్మాన్ పుట్టాడు.[1][6][7] రాజు మహమ్మద్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ మూడో భార్యకి తను పెద్ద కొడుకు. సల్మాన్ బాలమేధావి. చదువుల్లో ఎప్పుడూ ముందుండేవాడు. రాజధాని రియాద్‌లో న్యాయశాస్త్రంలో పట్టాపొందాడు. యూనివర్సిటీలో ఉన్నన్ని రోజులూ అనేక శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. లోకజ్ఞానం సంపాదించుకున్నాడు.
ఇతడి మేధోవికాసానికి కారణం అతడి తల్లిదండ్రులే. తండ్రి... ప్రతి వారమూ పిల్లల చేతికి ఓ పుస్తకమిచ్చి... చదవమనేవాడు. ఆతర్వాత, ఆయా పుస్తకాలకు సంబంధించి ప్రశ్నలు అడిగేవాడు. తల్లి అయితే, వారంలో ఓరోజు వివిధ రంగాల మేధావులను ఇంటికి పిలిపించి, పిల్లలతో ఇష్టాగోష్టి ఏర్పాటు చేసేది. దీంతో బిన్ సల్మాన్ వ్యక్తిత్వ నిర్మాణానికి బాల్యంలోనే బలమైన పునాదులు పడ్డాయి.
పట్టా చేతికి రాగానే, మిగతా సంపన్న కుటుంబీకుల పిల్లల్లా ఇతడు కూడా విదేశాలకు వెళ్లిపోదామని అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే తండ్రి పాలన బాధ్యతలు చేపట్టాడు. తనకు తోడుగా ఉండమన్నాడు. బిన్ సల్మాన్ ఎదుగుదల 2013 నుంచీ మొదలైంది. నాన్న యువరాజు కాగానే, ఆయన కొలువులో మంత్రిగా చేరాడు. ఆ అనుభవం బాగా పనికొచ్చింది. కొడుకు మీద తండ్రికి నమ్మకాన్నీ పెంచింది. తాను రాజు కాగానే, సల్మాన్‌ను రక్షణమంత్రిగా, దివంగతుడైన రాజు తనయుడు మహమ్మద్ బిన్ నయెఫ్‌ను ఉప యువరాజుగా ప్రకటించాడు. ఆతర్వాత, కొద్ది నెలలకే నయెఫ్‌ను యువరాజుగా నియమించాడు. బిన్ సల్మాన్‌ను ఉప యువరాజుగా, ఉప ప్రధానమంత్రిగా, కౌన్సిల్ ఆఫ్ ఎకనమిక్ అండ్ డెవలప్‌మెంట్ ఎఫైర్స్‌కు అధ్యక్షుడిగా నియమించాడు. బిన్ సల్మాన్‌ను అందలం ఎక్కించడానికి రంగం సిద్ధమైనట్టు అప్పటికే అందరికీ అర్థమైపోయింది. 2017జూన్‌లో బిన్ సల్మాన్‌ని యువరాజుగా ప్రకటించి, నయెఫ్‌ను పదవిలోంచి తొలగించాడు. గృహనిర్బంధంలో ఉంచాడు. ఓవైపు వారసత్వానికి సంబంధించి... చాపకింద నీరులా చకచకా మార్పులు జరిగిపోతుంటే, మరోవైపు బిన్ సల్మాన్. సౌదీ ఆర్థికరంగాన్నీ సామాజిక వ్యవస్థనూ ప్రక్షాళన చేసే కార్యక్రమం మొదలుపెట్టాడు.
వివాహము
[మార్చు]2008లో రాకుమారి సారా బింట్ మషూర్‌ను పెళ్లిచేసుకున్నాడు బిన్ సల్మాన్. వీరికి నలుగురు పిల్లలు. ఇల్లు, పిల్లల బాధ్యత శ్రీమతిదే, పిల్లల ఆలనా పాలనా చూసేందుకు సమయం దొరకడం లేదని చెబుతూ... తన జీవితంలో బహుభార్యత్వానికి ఆస్కారం లేదని ఓ ఇంటర్య్వూలో తేల్చిచెప్పాడు. బిన్ సల్మాన్‌లో సేవాదృక్పథమూ ఎక్కువే. ఎంఐఎస్‌కె ఫౌండేషన్‌ను స్థాపించి యువతలో నైపుణ్యాల్నీ, నాయకత్వ లక్షణాలనూ పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాడు. స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాడు.
అభివృద్ది, విమర్శలు
[మార్చు]సౌదీ అరేబియా అభివృద్దికి బిన్ సల్మాన్ విజన్ 2030 పేరిట సమగ్ర ప్రణాళికను ప్రకటించాడు. సౌదీ అంటే చమురు, చమురు అంటే సౌదీ అన్న ముద్రపడిపోయింది. దేశానికి తొంభైశాతం రాబడి చమురు నుంచే వస్తోంది. ముడి చమురు ఆదాయమనే ఆలోచన నుంచి దేశాన్నీ ప్రజల్నీ పక్కకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రారంభించాడు. మూడు ట్రిలియన్ డాలర్లతో అత్యధిక సావరీన్ వెల్త్ ఫండ్ ను నెలకొల్పే పనిలో నిమగ్నమయ్యాడు.
పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకురావడం, మహిళలు ఉద్యోగాల్లో చేరేలా ప్రోత్సహించడం, ఐటీ, వినోద రంగాలలో పెట్టుబడులు... యువరాజు ప్రణాళికలో ముఖ్యాంశాలు. సౌదీ అరేబియా ఆధునికీకరణకూ పెద్దపీట వేశాడు. 500 బిలియన్ డాలర్లతో... కొత్త నగరాన్ని నిర్మించడం, ప్రత్యేక బిజినెస్ జోన్ ఏర్పాటు చేయడం... బిన్ సల్మాన్ ప్రధాన లక్ష్యాలు. అదే సమయంలో అవినీతి నిర్మూలనకు ప్రాధాన్యం ఇచ్చాడు. యాంటీ కరప్షన్ డ్రైవ్ లో భాగంగా పదకొండు మంది రాకుమారుల్ని, నలుగురు మంత్రుల్ని, డజన్ల కొద్దీ వ్యాపారవేత్తల్ని అరెస్టు చేయించాడు. వీరిలో బ్రిటన్ యువరాజు చార్లెస్ స్నేహితుడు కూడా ఉండడం విశేషం. మహామహా కుబేరులూ ఉన్నారు. అవినీతి వ్యతిరేకత ముసుగులో... తనకు అడ్డు చెప్పే అవకాశం ఉన్నవారినంతా... ఊచల వెనక్కి తోసేస్తున్నాడన్న విమర్శా ఉంది.
ఒకవైపు మానవ హక్కుల్ని కాలరాస్తూనే... మరోవైపు స్త్రీ స్వేచ్ఛా, ఉద్యోగాలూ అని చిలకపలుకులు వల్లిస్తున్నాడని దుమ్మెత్తిపోస్తున్నవారూ లేకపోలేదు. సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఛైర్‌పర్సన్‌గా ఓ మహిళను నియమించారు. ఓ ప్రధాన బ్యాంకు పగ్గాలనూ మగువకే అందించారు. కొత్తగా ఏర్పాటు చేసిన జనరల్ ఎంటర్‌టెయిన్‌మెంట్ అథారిటీ నాయకత్వమూ నారీమణిదే.
2018 రంజాన్ మాసం తర్వాత... అంటే, 2018 జూన్ 24 అర్ధరాత్రి సమయంలో మహిళలకు అపూర్వమైన బహుమతిని అందించింది సౌదీ ప్రభుత్వం. కల్లో కూడా ఊహించని వరమది. సొంత కార్లను స్వయంగా నడిపే అవకాశం కల్పించింది
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Profile: Crown Prince Mohammed bin Salman". Al Jazeera. 21 జూన్ 2017. Archived from the original on 22 జూన్ 2017. Retrieved 2 జనవరి 2018.
- ↑ Friedman, Thomas L. (23 నవంబరు 2017). "Saudi Arabia's Arab Spring, at Last". The New York Times. Archived from the original on 24 నవంబరు 2017. Retrieved 24 నవంబరు 2017.
- ↑ "Muhammad bin Salman cracks down on his perceived opponents". The Economist. 21 సెప్టెంబరు 2017. Archived from the original on 22 సెప్టెంబరు 2017.
- ↑ "Mohammad bin Salman named new Saudi Crown Prince". TASS. Beirut. 21 జూన్ 2017. Archived from the original on 22 జూన్ 2017. Retrieved 22 జూన్ 2017.
- ↑ "Mohammed bin Nayef kingpin in new Saudi Arabia: country experts". Middle East Eye. 1 ఫిబ్రవరి 2015. Archived from the original on 3 ఫిబ్రవరి 2015. Retrieved 1 ఫిబ్రవరి 2015.
- ↑ "Ministries". Royal Embassy of Saudi Arabia - Washington, DC. 30 ఏప్రిల్ 2003. Archived from the original on 1 డిసెంబరు 2017. Retrieved 2 జనవరి 2018.
- ↑ "Who is Saudi Crown Prince Mohammed?". BBC News. 6 నవంబరు 2017. Archived from the original on 14 అక్టోబరు 2017. Retrieved 2 జనవరి 2018.