Jump to content

మైహర్

అక్షాంశ రేఖాంశాలు: 24°15′43″N 80°45′40″E / 24.262°N 80.761°E / 24.262; 80.761
వికీపీడియా నుండి
మైహర్
మైహర్ is located in Madhya Pradesh
మైహర్
మైహర్
Coordinates: 24°15′43″N 80°45′40″E / 24.262°N 80.761°E / 24.262; 80.761
దేశం భారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
ప్రాంతంబుందేల్‌ఖండ్
జిల్లాసత్నా
Elevation
367 మీ (1,204 అ.)
జనాభా
 (2001)
 • Total40,192
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+05:30 (IST)
పిన్‌కోడ్
485771
టెలిఫోన్ కోడ్07674
Vehicle registrationMP-19-XXXX

మైహర్ మధ్య ప్రదేశ్ రాష్ట్రం, సాత్నా జిల్లా లోని పట్టణం. [1] మైహర్, శారదా మాత ఆలయానికి ప్రసిద్ధి చెందింది [2]

భౌగోళికం

[మార్చు]

మైహర్ 24°16′N 80°45′E / 24.27°N 80.75°E / 24.27; 80.75 వద్ద, [3] సముద్ర మట్టం నుండి 367మీటర్ల ఎత్తులో ఉంది. జూలై, ఆగస్టు నెలల్లో మితమైన వర్షపాతం ఉంటుంది.

జనాభా

[మార్చు]

2001 భారత జనగణ ప్రకారం మైహర్ జనాభా 34,347. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48%. పట్టణంలో అక్షరాస్యత 64% ఉంది. పురుషుల అక్షరాస్యత 72% ఉండగా, స్త్రీల అక్షరాస్యత 56% ఉంది. జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వారు ఉన్నారు.[4]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

ఈ ప్రాంతంలో సున్నపురాయి లభ్యత కారణంగా మైహర్ పారిశ్రామిక పట్టణంగా అభివృద్ధి చెందుతోంది. మైహర్ (మైహర్ సిమెంట్ ఫ్యాక్టరీ [5] ) సమీపంలో 3.1 మిలియన్ టన్నుల సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. మైహర్-విజయరాఘవ్‌గఢ్ రోడ్డులో మైహర్ పట్టణం నుండి 8 కి.మీ. దూరంలో ఈ కర్మాగారం ఉంది. రేవా రోడ్‌లోని ప్రధాన సిమెంట్ పరిశ్రమలో కెజెఎస్ సిమెంట్ కూడా ఒకటి. రిలయన్స్ తన మొట్టమొదటి సిమెంట్ ప్లాంట్‌ను మైహర్ సమీపంలో 2014 లో ప్రారంభించింది,ఆ తరువాత, ఎంపి బిర్లా గ్రూప్ దీనిని 2016 లో కొనేసింది. మైహర్ జనాభాలో ఎక్కువ భాగం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. చాలామంది తమ ప్రాధమిక ఆదాయ వనరుగా వ్యవసాయంపై ఆధారపడతారు.

దేవాలయాలు

[మార్చు]

మా శారదా దేవి ఆలయం

[మార్చు]

శారదా దేవిని సరస్వతి అని కూడా అంటారు. ఆమె విద్యా దేవత. ఆమె మేధస్సు, మనస్సు, జ్ఞానం, తర్కాన్ని అందిస్తుంది. ఆమె తన జ్ఞాన శక్తి ద్వారా జీవితంలో కోరికలను నెరవేర్చుకోవడానికి సహాయం చేస్తుంది.

మైహర్ లోని సా.శ. 502 నాటి మా శారదా దేవి ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రసిద్ది చెందింది. ఈ ఆలయం నేల మట్టం నుండి 600 అడుగుల ఎత్తులో, త్రికూట పర్వతంపై ఉంది. ఇది మైహర్ రైల్వే స్టేషన్ నుండి సుమారు 5కి.మీ. దూరంలో ఉంది. కొండపైకి చేరుకోవడానికి 1,063 మెట్లు ఉన్నాయి. మెట్లతో పాటు, యాత్రికుల సౌలభ్యం కోసం రోప్‌వే ఉంది.

ఈ ప్రదేశం రోడ్డు, రైలు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. సాత్నా జిల్లా హెడ్ క్వార్టర్ నుండి సుమారు 40 కి.మీ. దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని మా శారదా ప్రబంధ సమితి నిర్వహిస్తోంది. దేశం నలుమూలల నుండి ఆలయాన్ని సందర్శించే యాత్రికులు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ పర్వేక్షణలో గణనీయమైన కృషి చేసింది. పర్వతం మీద రహదారి మార్గం నిర్మించబడింది, తద్వారా వాహనం కొండపైకి తీసుకెళ్లబడుతుంది.[6]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Amid Crisis, Kamal Nath Okays Formation Of 3 Districts, Cabinet Minister Status To 7 Leaders". NDTV. Press Trust of India. 19 March 2020.
  2. "About Maihar Temple by Maihartemple.com". Maihar temple. Archived from the original on 2018-08-13.
  3. Falling Rain Genomics, Inc – Maihar
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  5. "Maihar Cement, a BK Birla Group of Companies". Archived from the original on 2021-01-07. Retrieved 2021-01-07.
  6. "Ma Sharda Mata, Maihar | District Satna, Government of Madhya Pradesh | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-14.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మైహర్&oldid=3953664" నుండి వెలికితీశారు