Jump to content

మేమూ మనుషులమే

వికీపీడియా నుండి
మేమూ మనుషులమే
(1973 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.బాపయ్య
తారాగణం కృష్ణంరాజు,
జమున
నిర్మాణ సంస్థ శ్రీ కల్పనాలయ
భాష తెలుగు

మేమూ మనుషులమే శ్రీ కల్పనాలయ బ్యానర్‌పై కె.బాపయ్య దర్శకత్వంలో వాసంతి శ్రీనివాసన్ నిర్మించిన తెలుగు సినిమా. 1973, నవంబర్ 16న విడుదలైన ఈ సినిమాలో కృష్ణంరాజు, జమున జంటగా నటించారు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పూసలమ్మే గుంపు నాయకుడు కోటాయ్ తోటివాడు చౌడయ్య ఎత్తిపొడుపు మాటలవల్ల తన భార్య కుప్పి తప్పు చెయ్యలేదని తాను నమ్మినా గుంపు నుండి వెలివేస్తాడు. కొడుకు రాజా గుంపులో ఉండక పారిపోయి ఆత్మహత్య చేసుకోబోతున్న కుప్పిని కలుసుకుంటాడు. దయానిధి, శాంతల కొడుకు వాసును పాముకాటు నుండి రక్షిస్తుంది కుప్పి. కృతజ్ఞతగా రాజును చదివిస్తానంటాడు దయానిధి. రాజు, వాసు చదివి పెద్దవారౌతారు. టీ కొట్టు పెట్టి ఎం.ఎల్.ఎ.గా ఎన్నికైన సర్వం జగన్నాథం, అతని అనుచరుడు కొండల్రావు లంచగొండులుగా తయారై అవినీతికి పాల్పడుతూ ఉంటారు. జగన్నాథం కూతురు రాధ రాజును ప్రేమిస్తుంది. కొత్తగా ఎన్నికలలో గెలిచిన రాజుకు జగన్నాథం తన కూతురు రాధను ఇచ్చి పెళ్ళి చేస్తానంటాడు. రాజు పూసలమ్ముకునే కులంలో పుట్టాడని తెలిసిన పిదప తాను ఆ గుంపులోనే కలిసిపోయి వివాహమాడడానికి సిద్ధపడుతుంది ప్రమీల.[2]

పాటలు

[మార్చు]

ఈ సినిమాలోని పాటలకు ఆత్రేయ, రాజశ్రీ సాహిత్యాన్ని సమకూర్చగా, ఎం.ఎస్.విశ్వనాథం బాణీలు కట్టాడు.

పాటల వివరాలు[3]
క్ర.సం. పాట రచయిత గాయకులు
1 ఏ మంటున్నది ఈ గాలి ఎగిరే పైటను అడగాలి ఆత్రేయ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
2 గుమాలంగడి గుమాలంగడి గుమాలంగడి ఈ గొప్పోళ్ళ సంగతేంటో సూద్దామా డింగిరీ ఆత్రేయ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి
3 నేను ఎవ్వరో నువ్వు ఎవ్వరో ఎవరికి తెలుసు నేను నువ్వనీ నువ్వు నేననీ మనకే తెలుసు రాజశ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
4 గుమాలంగడి గుమాలంగడి పూసలగుమ్మా యీ గుంపులో నువ్వేనే పైడిబొమ్మా ఆత్రేయ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
5 సిగ్గోలే సిగ్గు సిగ్గు సెప్పుకుంటే సెడ్డ సిగ్గు ఆత్రేయ ఎల్.ఆర్.ఈశ్వరి

స్పందన

[మార్చు]
  • పాతకాలం కులం కట్టుబాట్లను, అంతస్తుల భేదాలను నిర్మూలించాలని ప్రబోధించే ఉత్తమ చిత్రాన్ని కొత్త తరహాలో ప్రభోదాత్మకంగా నిర్మించిన శ్రీమతి వాసంతి, దర్శకుడు కె.బాపయ్య అభినందనీయులు - ఆంధ్రప్రభ దినపత్రిక[2]

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Memu Manushulame (K. Bapaiah) 1973". ఇండియన్ సినిమా. Archived from the original on 10 జనవరి 2023. Retrieved 10 January 2023.
  2. 2.0 2.1 యం.ఎస్.ఎం. (23 November 1973). "చిత్ర సమీక్ష: మేమూ మనుషులమే" (PDF). ఆంధ్రప్రభ దినపత్రిక. Archived (PDF) from the original on 10 జనవరి 2023. Retrieved 10 January 2023.
  3. ఈశ్వర్ (16 November 1973). Memu Manushulame (1973)-Song_Booklet (1 ed.). p. 12. Archived from the original on 10 జనవరి 2023. Retrieved 10 January 2023.

బయటి లింకులు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మేమూ మనుషులమే