Jump to content

మెహతాబ్ సంగ్మా

వికీపీడియా నుండి
మెహతాబ్ సంగ్మా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు సలెంగ్ ఎ. సంగ్మా
నియోజకవర్గం గంబెగ్రే

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ
జీవిత భాగస్వామి కొన్రాడ్ సంగ్మా
సంతానం 2
వృత్తి రాజకీయ నాయకురాలు

మెహతాబ్ చండీ అగిటోక్ సంగ్మా మేఘాలయ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో గంబెగ్రే శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]

మెహతాబ్ సంగ్మా మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా భార్య.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

మెహతాబ్ సంగ్మా గంబెగ్రే నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎన్‌పిపి అభ్యర్థిగా పోటీ చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన సలెంగ్ ఎ. సంగ్మా గంబెగ్రే స్థానానికి రాజీనామా చేయడంతో ఈ నియోజకవర్గానికి 2024లో నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికలో ఆమె ఎన్‌పిపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సధియారాణి ఎం. సంగ్మాపై 4,594 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4][5] ఆమె 12,678 ఓట్లను సాధించగా, సధియారాణి ఎం. సంగ్మాకు 8084 ఓట్లు వచ్చాయి.[6]

మూలాలు

[మార్చు]
  1. Deccan Herald (23 November 2024). "Meghalaya CM Conrad Sangma's wife Mehtab wins in Gambegre bypoll" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  2. India Today NE (5 July 2022). "Mehtab Chandee, Conrad Sangma's wife, explains how power dynamics function in a matrilineal household". Retrieved 25 November 2024.
  3. The Hindu (23 November 2024). "Meghalaya bypoll results 2024: CM's wife Mehtab Sangma wins Gambegre constituency" (in Indian English). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  4. The Indian Express (23 November 2024). "Gambegre (Meghalaya) Bye-Election Results 2024 Live: Mehtab Chandee Agitok Sangma of NPP wins" (in ఇంగ్లీష్). Retrieved 25 November 2024.
  5. CNBCTV18 (23 November 2024). "Bypoll Election Full Winners List 2024: Check state-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Election Commision of India (23 November 2024). "Gambegre bypoll results 2024". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.