మెస్రం మనోహర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా. మెస్రం మనోహర్
డా. మెస్రం మనోహర్
జననండా. మెస్రం మనోహర్
(1964-09-02) 1964 సెప్టెంబరు 2 (వయసు 59)
పాత ఉట్నూరు , ఉట్నూరు మండలం ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ భారతదేశం
నివాస ప్రాంతంపాత ఉట్నూరు ఆదిలాబాద్, తెలంగాణ
వృత్తిబిఎడ్ కళాశాల ప్రిన్సిపల్
ప్రసిద్ధికవి, రచయిత, సాహితీకారుడు మోటివేషనల్ స్పీకర్
భార్య / భర్తసుమన్ బాయి
తండ్రిమెస్రం చిత్రు
తల్లికిష్టాబాయి

డాక్టర్ మెస్రం మనోహర్ (జననం 1964 సెప్టెంబరు 2) తెలంగాణ రాష్ట్రంలోని పర్ధన్ అదివాసీ తెగ కు చెందిన కవి, రచయిత, సాహితీ కారుడు, మోటివేషనల్ స్పీకర్, ఆంగ్ల అనువాదకుడు, ఉట్నూరు సాహితీ వేదిక వ్యవస్థాపకుడు, ఏజెన్సీ విద్యాధికారి గా పని చేసి ప్రస్తుతం ఉట్నూరు బీఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.[1][2][3][4]

జననం,విద్య

[మార్చు]

మెస్రం మనోహర్ 1964 సెప్టెంబరు 2న మెస్రం చిత్రు, కిష్టాబాయి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, పాత ఉట్నూరులో జన్మించాడు.[5] ఉట్నూరు పట్టణంలో పదవ తరగతి, ఇంటర్ విద్య పూర్తి చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాదు సార్వత్రిక విద్య విధానం ద్వారా రాజనీతి శాస్త్రం, ఆంగ్లంల్లో ఎం.ఏ, యం.ఇ.డి పూర్తి చేశాడు. ఆ తర్వాత పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం వరంగల్ లో పర్ధన్ గిరిజనుల సంస్కృతి, సాహిత్యం అధ్యయనంలో పరిశోధన చేసి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1990లో సుమన్ బాయితో మనోహర్ వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.

ఉద్యోగం

[మార్చు]

1983 లో పదవ తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం గిరిజన యువతి, యువకుల మనుగడ కోసం 1987లో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూర్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ టీచర్ పోస్టులో ప్రభుత్వ ఉద్యోగం పొందాడు. సెకండరి గ్రేడ్ టీచర్ గా 1987నుండి 2002 వరకు పనిచేసి, ఆ తర్వాత పదోన్నతి పొంది స్కూల్ అసిస్టెంట్ గా 2003 నుండి 2007 వరకు పనిచేశాడు. ఇతని సేవాలను గుర్తించిన ఐటిడిఎ అధికారులు ఉట్నూర్ పిఇటిసిలో లెక్చరర్ గా పదోన్నతి కల్పించారు. అనంతరం 2009 నుండి 2012 వరకు గిరిజన అభివృద్ధి విద్య సంస్థలో సర్వ శిక్షా అభియాన్ ప్రాథమిక విద్య ఒక ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో భాగంగా బాలబాలికలకు నాణ్యమైన ప్రాథమిక విద్యను పరిశీలించడానికి ప్రత్యేక అధికారిగా, ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ విద్యాధికారిగా నియమించారు. అంచెలంచెలుగా పదోన్నతి పొంది 2012 నుండి సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఎ) బి.ఏడ్ కళాశాల ఉట్నూర్ ప్రిన్సిపల్ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నాడు.

సాహిత్య ప్రస్థానం

[మార్చు]

1.2002 సంవత్సరం లో గోండి సంస్కతి పుస్తకం వ్రాయడం జరిగింది. గోండి సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన విషయాలు తెల్పనైనది. 2.2003 లో తెలంగాణ రచయితల వేదిక ఆదిలాబాదు జిల్లా రచయితల మహాసభ తెలంగాణ సోయిలో "అంతరిస్తున్న గోండు సంస్కృతి కలవర పడుతున్న ఆదివాసులు వ్యాసం" 3.2005 ఆమ్ ఆద్మీ త్రైమాసిక హిందీ లో జాతీయ గిరిజన సాహిత్య సమ్మేళనం కేంద్ర సాహిత్య అకాడమి ఝార్ఖండ్ ఏ దునియా పహాలే కిస్ తరహా కి థి పాల్గోని ప్రసంగించాడు. 4.2006 రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మైసూర్ " మన ఆటలు వ్యాసం నాగోబా జాతర వ్యాసం. 5.2007 సంవత్సరం లో "ఇప్పాపూలు" అనే కథానిక వ్రాసి, అడవుల యొక్క ఆవశ్యకత ఇప్పపూలు సేకరించడానికి వెళ్ళినప్పుడు జరిగే సంఘటనలు తేల్పనైనది. 6.2012 జానపద గిరిజన విజ్ఞానం జాతీయ సదస్సు గోండు సంస్కృతి సాహిత్యం వ్యాసం" 7.2014 సంవత్సరం లో కేశ్లాపూర్ నాగోబా చరిత్ర (భీడి) మెస్రం వంశీయులు ఇలవేల్పు గురించి వ్రాశాడు[6]. 8.2015 ఆంధ్ర సారస్వత్త పరిషత్తు వారి అధ్వర్యంలో తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలు పర్ధన్ భాషా సాహిత్యాలు. 9.2016 నేటి ప్రపంచికరణలో తెలంగాణ భాష తెలుగు భాష - గిరిజన భాషలు అస్తివం - శాతవాహన విశ్వవిద్యాలయం కరీంనగర్ గోండి, కొలమి భాషల్లో విద్య భోధన సమస్యలు సవాళ్లు 10.2017 సంవత్సరములో పర్ధన్ గిరిజనులు సంస్కృతి సాహిత్యము పరిశోధన పుస్తకం గిరిజన సంక్షేమ శాఖ తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రచురితమైనది. 11.2022 సంవత్సరంలో తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాదు ఆదిలాబాదు జిల్లా సమగ్ర స్వరూపం "పర్ధ న్ కుల పంచాయతీ " "పర్ధానులు, గోండు సంస్కృతి వివిధ పరిశోధకుల అభిప్రాయాలు సారాంశం.

రచనలు

[మార్చు]

డా.మెస్రం మనోహర్ రాసిన పుస్తకాలు.

  1. గోండి సంస్కృతి (2002)
  2. ఇప్ప పూలు నవల (2007)
  3. కెస్లాపూర్ నాగోబా చరిత్ర (2014)
  4. పర్ ధాన్ గిరిజనుల సంస్కృతి సాహిత్యం(2017)

మొదలగు పుస్తకాలను గిరిజన సంక్షేమ శాఖ హైదరాబాదు వారు ప్రచురించారు.

మూలాలు

[మార్చు]
  1. "గిరిజన విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి". EENADU. Retrieved 2024-06-14.
  2. "::::  Welcome to utnoortribalbedcollege.com   ::::". www.utnoortribalbedcollege.com. Retrieved 2024-06-14. {{cite web}}: no-break space character in |title= at position 5 (help)
  3. "Gondi - English - Telugu - Hindi Dictionary (PDF) @ PDF Room". PDF Room (in ఇంగ్లీష్). Retrieved 2024-06-14.
  4. "End of an organic relationship?". The Hindu. 2015-01-07. ISSN 0971-751X. Retrieved 2024-06-14.
  5. Service, Express News (2021-02-12). "Nagoba Jatara begins on a grand note". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-06-14.
  6. Today, Telangana (2024-02-11). "Nagoba Jatara: Mesrams perform important rituals including Satheek puja". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-06-17.