మెర్కు తొడర్చి మలయ్ మెర్కు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మెర్కు తొడర్చి మలయ్ మెర్కు అనేది 2018 తమిళ సినిమా. విజయ్ సేతుపతి నిర్మించిన ఈ సినిమాకి లెనిన్ భారతి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ తేని ఈశ్వర్, స్వరకర్త ఇళయరాజా.[1] 2015లో ఇళయరాజా సంతకం చేసిన 1001వ చిత్రమిది.[2]

భారతదేశంలోని పశ్చిమ కనుమల పాదాల వెంబడి నివసిస్తున్న భూమిలేని కార్మికుల సమూహం యొక్క జీవితం మరియు సమయాల చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. వాణిజ్యీకరణ పరిచయం గ్రామీణుల సాధారణ జీవితాల్లో సంఘర్షణను ఎలా సృష్టిస్తుందో ఇది చిత్రీకరిస్తుంది.

తమిళ, మలయాళ రాష్ట్రాల సరిహద్దుల్లో పడమటి కనుమల్లో పర్వత పాదప ప్రాంతంలో ఒక కుగ్రామం. అక్కడి నిరుపేద ప్రజలు కొండమీద పండిన యాలకుల మూటలు గ్రామానికి మోసుకొనివచ్చే శ్రామికులుగా పొట్టపోసుకొంటూ ఉంటారు. రోజుకూలి చేసి జీవించే రంగస్వామి యాలకుల బస్తా మోసుకొని అడవిదారిలో గ్రామానికి వెళ్ళడంతో సినిమా మొదలుపెట్టి ఆ అటవీ ప్రాంత ప్రజల జీవన విధాంనాన్ని పరిచయం చేస్తాడు దర్శకుడు. అక్కడ పల్లీయుల జీవితంలో ధనం ప్రధానపాత్ర పోషించినట్లనిపించదు. ఇంకా ఏదో రూపంలో వస్తువినిమయ పద్ధతి కొనసాగుతూంటుంది. రంగస్వామి పెళ్ళిచేసుకొని వడ్డీవ్యాపారివద్ద రుణంతీసుకొని చిన్నపొలంకొని వ్యవసాయం చేస్తాడు.

చాకొ శ్రామికుల పక్షాన యాలకుల తోటల యజమానుల దోపిడీ విధానాలకు, యాంత్రికీకరణకు వ్యతిరేకంగా పోరాడుతూంటాడు. ఒక తోట యజమాని శ్రామికుల నాయకుల్లో పై నాయకుణ్ణి లోబరచుకొని శ్రామిక ఐక్యతను భంగంచేసి దోపిడీ విధానాన్ని అమలు చేస్తాడు. చాకొ అతని అనుచరులు ఆవేశంతో ఉద్యమాన్ని నాశనం చేసిన కమ్యూనిస్టు నాయకుడిమీద దాడి చేస్తారు. హత్యానేరానికి చాకొ, అతని అనుచరుడు రంగస్వామి ఏడు సంవత్సరాలు జైలుశిక్ష అనుభవిస్తారు. రంగస్వామి పొలాన్ని వడ్డీవ్యాపారి అప్పుకింద తీసేసుకొని, అతన్ని కొత్తగా కొండమీద ఏర్పాటు చేసిన పవన విద్యుత్ మిల్లు కాపలా బంట్రోతుగా నియమిస్తాడు. చివరకు సొంత పొలంలో వ్యవసాయం చేసుకోవాలన్న అతనికల కలగానే మిగిలిపోతుంది. సినిమా మెల్లగా, లోకీలో మొదలై వేగంపుంజుకొంటుంది. భూస్వామి, వడ్డీవ్యాపారి అందరూ చాలా సౌమ్యులుగా ప్రవర్తించినట్లు ఉంటారు తప్ప ఎక్కడా ఘర్షణలు, గొడవలు ఉండవు. పారిశ్రామిక అభివృద్ధిలో సామాన్యులకు పాత్ర ఏమీ ఉండదని, సొకాల్డు డెవలప్ మెంట్ పేదలకు కాదని దర్శకుడు లెనిన్ భారతి వ్యంగంగా స్పురించేట్లు చేస్తాడు. రంగస్వామి భూస్వామిని బస్తా యాలకులు తనకు అరువుగా ఇస్తే నగరంలో అమ్మి వచ్చిన లాభంతో, తనవద్ద ఉన్న డబ్బులతో పొలంకొంటానంటే భూస్వామి అతనికి పెద్ద యాలకుల మూట ఇస్తాడు. దారిలో ప్రమాదవశాత్తు మూట జారి లోయలోపడి రంగస్వామి స్వప్నం భగ్నమవుతుంది. అంత కష్టం వచ్చినా రంగస్వామి దంపతులు నిరాశ పడకుండా అప్పుచేసి చిన్న పొలంచెక్క కొంటారు.

పేదలు భూమికోసం తపించడం ఈ సినిమాలో మరొక అంశం. సినిమాలో అటవీప్రాంతం ఒక పాత్ర మాదిరి అనిపిస్తుంది. సినిమా చూస్తుంన్నంతసేపు మనుషులమీద కాకుండా దుర్మార్గపు వ్యవస్థ మీద అసహ్యం కలుగుతుంది.

మూలాలు

[మార్చు]
  1. "Isaignani for Vijay Sethupathi". The Times of India. 24 November 2017.
  2. "Vijay Sethupathy gets Ilayaraja's 1001th (sic!) movie". Indiaglitz. 5 January 2015.