మురసోలి మారన్
మురసోలి మారన్ | |||
| |||
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 1989 డిసెంబరు 2 – 1990 నవంబరు 10 | |||
ప్రధాన మంత్రి | వీపీ. సింగ్ | ||
---|---|---|---|
పదవీ కాలం 1999 – 2002 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | రామకృష్ణ హెగ్డే | ||
తరువాత | అరుణ్ శౌరీ | ||
పదవీ కాలం 1996 జూన్ 1 – 1998 మార్చి 19 | |||
ప్రధాన మంత్రి | హెచ్.డి. దేవే గౌడ ఐ.కె. గుజ్రాల్ | ||
లోక్ సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1996 – 2003 | |||
ముందు | ఎర ఆన్బరాసు | ||
తరువాత | దయానిధి మారన్ | ||
నియోజకవర్గం | చెన్నై సెంట్రల్ | ||
పదవీ కాలం 1967 – 1977 | |||
ముందు | సి.ఎన్. అన్నాదురై | ||
తరువాత | రామస్వామి వెంకటరామన్ | ||
నియోజకవర్గం | చెన్నై సెంట్రల్ | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1977 – 1995 | |||
నియోజకవర్గం | తమిళనాడు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తిరుక్కువలై , మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు in తిరువరూర్ జిల్లా, తమిళనాడు), భారతదేశం) | 1934 ఆగస్టు 17||
మరణం | 2003 నవంబరు 23[1] [చెన్నై]], తమిళనాడు, భారతదేశం | (వయసు 69)||
రాజకీయ పార్టీ | ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) | ||
తల్లిదండ్రులు | తండ్రి: షణ్ముగసుందరం తల్లి : షణ్ముగసుందరి | ||
జీవిత భాగస్వామి | మల్లికా మారన్ | ||
బంధువులు | కావ్య మారన్ (మనవరాలు) | ||
సంతానం | కళానిధి మారన్ దయానిధి మారన్ ఆన్బుకరాసి | ||
నివాసం | చెన్నై, తమిళనాడు, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | పచైయప్పస్ కాలేజీ , మద్రాస్ లా కాలేజీ | ||
నవంబరు 23, 2003నాటికి |
మురసోలి మారన్ తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి. ఆయన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ సీనియర్ నాయకుడు.[2] ఆ పార్టీ వ్యవస్థాపక నేత, ఎం.కరుణానిధికి మేనల్లుడు. అయన 2003 నవంబరు 23లో ఆనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలో మరణించాడు.[3][4]
వ్యక్తిగతం
[మార్చు]మురసోలి మారన్ 1934 ఆగస్టు 17లో షణ్ముగసుందరం, షణ్ముగసుందరి దంపతులకు తమిళనాడు రాష్ట్రం, తిరుక్కువలై గ్రామంలో జన్మించాడు. తల్లి షణ్ముగ సుందరి, డిఎంకె నాయకుడు కరుణానిధికి సోదరి. మారన్‌కు తల్లిదండ్రులు పెట్టిన పేరు త్యాగరాజ సుందరం. తరువాతి కాలంలో ఈ సంస్కృత పేరును మార్చుకుని అచ్చతమిళ పేరు మారన్ అని అతడే పెట్టుకున్నాడు.[5]
స్వగ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసి, ఉన్నత చదువులకోసం మద్రాసు వెళ్ళాడు. చెన్నైలోని పచ్చయప్ప కళాశాలలో ఎంఏ (ఆర్ట్స్) పూర్తి చేశాడు.
మారన్ 1963లో మల్లికను వివాహమాడాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు - కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్, సన్ నెట్ వర్క్ సీఈఓ కళానిధి మారన్ - ఒక కూతురు అన్బుకారసి మారన్ (కార్డియాలజిస్టు) ఉన్నారు.
వృత్తిగతం
[మార్చు]పాత్రికేయుడుగా
[మార్చు]ఆయన రాజకీయాల్లోకి రాకముందు కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశాడు. కరుణానిధి స్థాపించిన "మురసోలి" పత్రికకు సంపాదకుడుగా పనిచేసాడు. అప్పుడే తన పేరుకు ముందు మురసోలి అని తగిలించుకున్నాడు.[5]
సినీ రంగం
[మార్చు]మురసోలి మారన్ తమిళ సినిమాలకు స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. 5 చిత్రాలను నిర్మించి 2 చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
సినీ రచయితగా
[మార్చు]- కుల దైవం (1956)
- అన్నైయిన్ (1958)
- అన్బు ఎంగే (1958)
- తలై కొడుతాన్ తంబీ (1959)
- సహోదరి (1959)
- నాళ్ల తీర్పు (1959)
నిర్మాతగా
[మార్చు]- పిల్లైయో పిళ్ళై (1972)
- మరక్క ముడియుమా? (1966)
దర్శకుడిగా
[మార్చు]- మరక్క ముడియుమా? (1966)
రాజకీయాలు
[మార్చు]రాజకీయాలో డిఎంకె పార్టీ తరపున మారన్ కీలకమైన బాధ్యతలు నిర్వహించాడు. ఢిల్లీలో మారన్ ఆ పార్టీకి ప్రతినిధిగా ఉంటూ, పార్టీకు రాజకీయ పొత్తులు కుదర్చడంలో కీలకమైన పాత్ర నిర్వహించాడు. 1967 ఉండి అనేక పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[5]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1967: లోక్ సభకు ఎన్నిక
- 1971: ఉప ఎన్నికల్లో లోక్ సభకు తిరిగి ఎన్నిక
- 1977–1995: రాజ్యసభ సభ్యుడు
- 1977–1995: రాజ్యసభ సభ్యుడిగా- పబ్లిక్ అండర్‌టేకింగ్స్‌పై కమిటీలో మూడు పర్యాయాలు సభ్యుడిగా చేశాడు
- 1980–1982: సభ్యుడు, సాధారణ ప్రయోజనాల కమిటీ
- 1980–1982, 1991-1995: సభ్యుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ
- 1982–1983, 1987-1988: సభ్యుడు, ఎస్సి & ఎస్టీ సంక్షేమ కమిటీ
- 1988–1989: సభ్యడు, సబార్డినేట్ లెజిస్లేషన్
- 1989-1990: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
- 1992–1993: విచారణ కమిటీ సభ్యుడు, ఉభయ సభల సెక్యూరిటీలు, బ్యాంకింగ్ లావాదేవీలలో అవకతవకలు
- 1996: లోక్ సభ సభ్యుడిగా మూడవసారి ఎన్నిక
- 1996-1998: వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ
- 1998: లోక్ సభ సభ్యుడిగా నాల్గొవసారి ఎన్నిక
- 1999:లోక్ సభ సభ్యుడిగా ఐదవసారి ఎన్నిక
- 1999-2002: వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ [6]
మూలాలు
[మార్చు]- ↑ "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 - 2003" (PDF). Rajya Sabha. Retrieved 25 March 2019.
- ↑ Parliament of India LOK SABHA. "Members : Lok Sabha". 164.100.47.194. Retrieved 3 May 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ The Financial Express (24 November 2003). "Murasoli Maran Passes Away". Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.
- ↑ Outlook India. "Outlook India Photo Gallery - Murasoli Maran". Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.
- ↑ 5.0 5.1 5.2 SUBRAMANIAN, T. S. "A man of many parts". Frontline (in ఇంగ్లీష్). Archived from the original on 2021-05-04. Retrieved 2021-05-04.
- ↑ The Economic Times (31 March 2002). "Maran launches 'Focus: Africa' programme". Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.