ముద్దుల మొగుడు (1983 సినిమా)
ముద్దుల మొగుడు (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్.ప్రకాశరావు |
---|---|
నిర్మాణం | చెరుకూరి ప్రకాశరావు |
చిత్రానువాదం | కె.ఎస్. ప్రకాశరావు |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , శ్రీదేవి |
సంగీతం | ఎస్. రాజేశ్వరరావు |
నృత్యాలు | సలీం |
సంభాషణలు | ఆచార్య ఆత్రేయ |
ఛాయాగ్రహణం | ఎస్. నవకాంత్ |
కళ | మోహన |
కూర్పు | వేమూరి రవి |
నిర్మాణ సంస్థ | మహీజా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ముద్దుల మొగుడు 1983 లోవచ్చిన సినిమా. దీనిని మహీజా ఫిల్మ్స్ [1] బ్యానర్‌లో చెరుకూరి ప్రకాశరావు నిర్మించాడు. కెఎస్ ప్రకాశరావు దర్శకత్వం వహించాడు.[2] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించారు[3] ఎస్. రాజేశ్వర రావు సంగీతం అందించాడు.[4]
కథ
[మార్చు]ఈ చిత్రం ప్రముఖ రంగస్థల కళాకారుడు, రచయిత ప్రసాద్ (అక్కినేని నాగేశ్వరరావు) పై ప్రారంభమవుతుంది. దుర్గ (శ్రీదేవి) అతి విశ్వాసం, అహంకారం ఉన్న స్త్రీ. కోటీశ్వరుడు గోపాలరావు (సత్యనారాయణ) కుమార్తె. ప్రసాద్ ను అభిమానించి ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. ప్రసాద్ ఆదాయం కొంచెం తక్కువ కబట్టి, ఎడాపెడా ఖర్చు పెట్టే దుర్గను భరించలేకపోయాడు. కాబట్టి, ప్రసాద్ అప్పుల్లో పడతాడు. అతని ఆరోగ్యమూ పాడౌతుంది. ఆ దుస్థితి సమయంలో, దుర్గ తన తల్లిదండ్రులపై ఆధారపడుతుంది, ఇది ప్రసాద్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఈ జంట మధ్య విభేదాలు తలెత్తుతాయి. దుర్గ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. చివరికి, దుర్గా తన తప్పును గ్రహించి, ప్రసాద్ మంచితనాన్ని అర్థం చేసుకుని, క్షమించమని వేడుకుంటుంది. చివరగా, ఈ జంట తిరిగి కలుసుకోవడంతో సినిమా సంతోషకరంగా ముగుస్తుంది.
నటవర్గం
[మార్చు]- ప్రసాద్ పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు
- దుర్గగా శ్రీదేవి
- గోపాల రావుగా సత్యనారాయణ
- మధు పాత్రలో శరత్ బాబు
- సింహామ్గా నాగేష్
- రంగమార్తాండ మాధవయ్యగా ధూళిపాళ
- మిక్కిలినేని
- ఎస్.వరలక్ష్మి
- సరలగా సుహాసిని
సాంకేతిక వర్గం
[మార్చు]- కళ: మోహనా
- నృత్యాలు: సలీం
- స్టిల్స్: ఎస్.చంద్రు
- సంభాషణలు - సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
- సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
- కూర్పు: వీమూరి రవి
- ఛాయాగ్రహణం: ఎస్.నవకాంత్
- నిర్మాత: చెరుకూరి ప్రకాష్ రావు
- చిత్రానువాదం - దర్శకుడు: కె.ఎస్.ప్రకాష్ రావు
- బ్యానర్: మహీజా ఫిల్మ్స్
- విడుదల తేదీ: 1983 జనవరి 27
పాటలు
[మార్చు]సం | పాట | గాయకులు | నిడివి |
---|---|---|---|
1 | "హే హే హే నవ్వించి కవ్వించు" | ఎస్పీ బాలు, పి.సుశీల | 4:21 |
2 | "తొలి నే చేసిన పూజా ఫలము" | ఎస్పీ బాలు, పి.సుశీల | 3:54 |
3 | "మల్లె తెల్లనా మంచు చల్లనా" | ఎస్పీ బాలు, పి.సుశీల | 4:11 |
4 | "ఎందరికి తెలుసును ప్రేమంటే" | ఎస్పీ బాలు, పి.సుశీల | 5:20 |
5 | "ఎంత వింత ప్రేమా" | ఎస్పీ బాలు | 3:35 |
6 | "ఆహా ఆహా నవ్వండి" | ఎస్పీ బాలు | 3:02 |
7 | "రండి రారండి" | ఎస్పీ బాలు | 3:03 |
మూలాలు
[మార్చు]- ↑ "Muddula Mogadu (Banner)". Archived from the original on 2021-04-14. Retrieved 2020-08-22.
- ↑ "Muddula Mogadu (Direction)".
- ↑ "Muddula Mogadu (Cast & Crew)". Archived from the original on 2018-10-08. Retrieved 2020-08-22.
- ↑ "Muddula Mogadu (Review)". Archived from the original on 2021-04-14. Retrieved 2020-08-22.