Jump to content

ముద్గల్ కమిటీ

వికీపీడియా నుండి

ముద్గల్ కమిటీ, భారత క్రికెట్‌లో వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు మాజీ హైకోర్టు న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ. అప్పటి భారత అదనపు సొలిసిటర్ జనరల్ ఎల్. నాగేశ్వరరావు, సీనియర్ న్యాయవాది, మాజీ క్రికెట్ అంపైర్ నిలయ్ దత్తాతో కూడిన ఈ కమిటీ అవినీతి ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిపింది. BCCI చీఫ్ ఎన్. శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్, ఇండియా సిమెంట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టు యజమాని జైపూర్ IPS క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ లపై వచ్చిన అవినీతి ఆరోపణల పైన, అలాగే 2013 ఇండియన్ ప్రీమియర్‌లో బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్‌తో సంబంధం ఉన్న లీగ్ మ్యాచ్‌లు, అందులో ఆటగాళ్ల ప్రమేయం పైన ఆరోపణల పైన దర్యాప్తు చేసే ఆదేశాలతో ఈ కమిటీని ఏర్పాటు చేసారు.[1] [2] [3]

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బీబీ మిశ్రాతో పాటు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఈ కమిటీలో చేరినట్లు సమాచారం. [4]

కమిటీ నివేదిక

[మార్చు]

2014 ఫిబ్రవరి 9 న సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో కమిటీ ఈ క్రింది సిఫార్సులు చేసింది

గురునాథ్ మెయ్యప్పన్

[మార్చు]
  • చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అధికారిగా గురునాథ్ మెయ్యప్పన్ పాత్ర ధృవీకరించబడింది. అతనిపై బెట్టింగ్ ఆరోపణలు రుజువయ్యాయి. అయితే, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై మరింత విచారణ అవసరం.
    • మెయ్యప్పన్ విందూ దారా సింగ్ ద్వారా బెట్టింగ్‌లో పాల్గొన్నాడు. అతను విక్రమ్ అగర్వాల్ వంటి బుకీలు, పంటర్లతో నేరుగా కమ్యూనికేషన్‌లో ఉన్నాడు; అతను చెన్నై సూపర్ కింగ్స్‌కు అనుకూలంగాను, వ్యతిరేకంగానూ పందెం వేశాడని; చెన్నై సూపర్ కింగ్స్‌తో సంబంధం లేని IPL మ్యాచ్‌లపై కూడా పందెం వేశాడూ.
    • మెయ్యప్పన్ "ఆటకు చెడ్డపేరు తెచ్చినందుకు ఐపిఎల్ కార్యాచరణ నిబంధనలలోని సెక్షన్లు 2.2.1, 2.14, బెట్టింగు ద్వారా ఐపిఎల్ యాంటీ కరప్షన్ కోడ్ ఆర్టికల్ 2.2.1, 2.2.2, 2.2.3లను ఉల్లంఘించారని కమిటీ కనుగొంది. IPL ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్స్ 2.4.4 కు వ్యతిరేకంగా ఆటగాళ్లు, జట్టు కార్యాలయాలు క్రికెట్ ఆటకు చెడ్డపేరు తెచ్చాయి ." [5]
    • చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ యజమాని మెయ్యప్పన్‌ టీమ్ అధికారిగా విఫలమయ్యాడు. "బిసిసిఐ అవినీతి నిరోధక కోడ్, ఐపిఎల్ ఆపరేషనల్ రూల్స్, ఐపిఎల్ రెగ్యులేషన్స్, ఐపిఎల్ ఆపరేషనల్ రూల్స్‌లోని సెక్షన్ 4.4.1ని, ఫ్రాంచైజీల ఒప్పందంలోని క్లాజ్ 11.3నీ ఉల్లంఘించినట్లు గుర్తించారు. " [5]

రాజ్ కుంద్రా

[మార్చు]
  • జైపూర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానిగా రాజ్ కుంద్రాపై వచ్చిన బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై, రాజస్థాన్ రాయల్స్ యజమానులను మరింత విచారించాల్సిన అవసరం ఉందని కమిటీ నివేదించింది.

ఆటగాళ్లపై స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు

[మార్చు]

ఢిల్లీ పోలీసులు అందించిన సాక్ష్యాధారాల ఆధారంగా ఎస్.శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలా, అమిత్ సింగ్, సిద్ధార్థ్ త్రివేది (రాజస్థాన్ రాయల్స్) చేసిన స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై క్రిమినల్ విచారణలు జరుగుతున్నాయని, బీసీసీఐ వారిపై తగిన శిక్ష విధించిందనీ కమిటీ పేర్కొంది.

మూలాలు

[మార్చు]
  1. Supreme Court asks Mudgal committee to complete probe within two months
  2. Spot fixing: Mudgal panel examines three Indian players Archived 2014-10-26 at the Wayback Machine
  3. Justice Mukul Mudgal committee submits IPL spot-fixing scandal report to Supreme Court
  4. Sourav Ganguly joins Mukul Mudgal Committee investigations
  5. 5.0 5.1 "A REPORT ON THE ALLEGATIONS OF BETTING AND SPOT/MATCH FIXING IN THE INDIAN PREMIER LEAGUE- SEASON 6". JUSTICE MUDGAL IPL PROBE COMMITTEE. 2014. Retrieved 22 November 2022.