Jump to content

ముత్యాల సునీల్ కుమార్

వికీపీడియా నుండి

1976 నిజామాబాద్ జిల్లా బాల్కొండ సావేల్ గ్రామంలో జన్మించిన ముత్యాల సునీల్ కుమార్ హెచ్ ఆర్ డి డిగ్రీ కళాశాల నుండి తన బిఎస్సి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశారు.

విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించిన సునీల్ కుమార్ ఆరెంజ్ ట్రావెల్స్ నీ ప్రారంభించి అంచలంచలుగా ఎదుగుతూ ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు సంపాదించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న సునీల్ కుమార్ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు.

2010 లో తెలంగాణ రాష్ట్ర సమితి చేరికతో ప్రత్యక్ష రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన సునీల్ 2011-12 సంవత్సరంలో జాగృతి నిజామాబాద్ అధ్యక్షుడిగా పనిచేశారు .

2013 నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎంతో కీలక నాయకుడిగా ఎదుగుతూ వచ్చిన సునీల్ ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించినప్పటికీ అది దక్కలేదు.

ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సునీల్ 2018 తెలంగాణ శాసనసభ ముందస్తు ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ తరఫున పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచారు.

తదుపరి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 2023 డిసెంబర్లో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున బాల్కొండ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీలో ముందున్నారు.

మూలాలు

[మార్చు]

[1]

  1. "సి ఇ ఓ తెలంగాణ అఫిడవిట్". Archived from the original on 2023-11-20.