Jump to content

ముఖేష్ రాజ్‌పుత్

వికీపీడియా నుండి
ముఖేష్ రాజ్‌పుత్
ముఖేష్ రాజ్‌పుత్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 మే 16
ముందు సల్మాన్ ఖుర్షీద్
నియోజకవర్గం ఫరూఖాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం (1968-08-08) 1968 ఆగస్టు 8 (age 56)
ఫరూఖాబాద్, ఉత్తరప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం ఫరూఖాబాద్, ఉత్తరప్రదేశ్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

ముఖేష్ లోధీ రాజ్‌పుత్ (జననం 8 ఆగస్టు 1968) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఫరూఖాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ముఖేష్ రాజ్‌పుత్ 1968 ఆగస్టు 8న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూఖాబాద్ నగరంలో లజ్జారామ్, చందావతి దంపతులకు జన్మించాడు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లోని కమల్‌గంజ్‌లోని ఆర్‌పి డిగ్రీ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బి.ఎస్.సి) డిగ్రీని పూర్తి చేశాడు. ముఖేష్ రాజ్‌పుత్ వివాహం సౌభాగ్యవతితో 10 జూన్ 1980న జరిగింది.

రాజకీయ జీవితం

[మార్చు]

ముఖేష్ రాజ్‌పుత్ భారతీయ జనతా పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫరూఖాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి రామేశ్వర్ సింగ్ యాదవ్‌పై 1,50,502 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి మనోజ్ అగర్వాల్‌పై 2,21,702 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

ముఖేష్ రాజ్‌పుత్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫరూఖాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి నావల్ కిషోర్ శాక్యపై 2,678 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Constituencywise-All Candidates". Eciresults.nic.in. Archived from the original on 17 May 2014. Retrieved 2014-05-17.
  2. "Aonla: BJP Nominates Dharmendra Kashyap Hoping For A Hat-Trick Win" (in ఇంగ్లీష్). TimelineDaily. 15 March 2024. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
  3. The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
  4. "Lok Sabha 2024 Election Results: Farrukhabad" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 21 February 2025. Retrieved 21 February 2025.