Jump to content

ముఖేష్

వికీపీడియా నుండి
ముఖేష్
కేరళ శాసనసభ్యుడు
Assumed office
2016 జూన్ 2
అంతకు ముందు వారుగురు దర్శన్
నియోజకవర్గంకొల్లం శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1957
కొల్లం కేరళ భారతదేశం
రాజకీయ పార్టీకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
జీవిత భాగస్వామి
సంతానం2
వృత్తినటుడు నిర్మాత రాజకీయ నాయకుడు

ముఖేష్ (జననం 5 మార్చి 1957), ఒక భారతీయ నటుడు, చలనచిత్ర నిర్మాత, టెలివిజన్ ప్రెజెంటర్ రాజకీయ నాయకుడు, ప్రధానంగా మలయాళ సినిమాల్లో నటిస్తున్నాడు. , అంతేకాకుండా అప్పుడప్పుడు తమిళ సినిమాలలో నటిస్తూ ఉంటాడు. [1] నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో ఆయన 275కి పైగా మలయాళ చిత్రాల్లో నటించారు. [2] 1996లో ముఖేశ్ నటించిన కానక్కినావు జాతీయ ఉత్తమ చలనచిత్రంగా నర్గీస్ దత్ అవార్డును గెలుచుకుంది. [3]

అతను 1982 చిత్రం బెలూన్‌ సినిమాలో చిన్న పాత్ర పోషించడం ద్వారా సినీ రంగంలోకి అడిగి పెట్టాడు . [4] ముఖేష్ మొదట్లో సినిమాలలో చిన్న పాత్రలు పోషించేవాడు. కామెడీ థ్రిల్లర్ చిత్రం రామ్‌జీ రావ్ స్పీకింగ ప్రధాన పాత్ర పోషించిన తర్వాత ముఖేష్ స్టార్‌డమ్‌కి ఎదిగాడు. [5] 1990 సంవత్సరం ప్రారంభంలో ముఖేష్ ఎక్కువగా హాస్య పాత్రలు పోషించేవాడు. మలయాళ సినిమా ప్రముఖ నటుల్లో ముఖేశ్ ఒకడు. కేరళ సంగీత నాటక అకాడమీకి ఛైర్మన్‌గా పనిచేశాడు. ముఖేష్ కేరళ రాష్ట్రంలోని కొల్లం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

బాల్యం

[మార్చు]

ముఖేష్ 5 మార్చి 1957న భారతదేశంలోని కేరళలోని కొల్లంలో నటులు O. మాధవన్ విజయకుమారి దంపతులకు జన్మించారు [6] ముఖేష్ కు సంధ్యా రాజేంద్రన్ జయశ్రీ అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ముఖేష్ తంగస్సేరిలోని ఇన్‌ఫాంట్ జీసస్ స్కూల్‌లో చదివాడు కొల్లాంలోని శ్రీ నారాయణ కళాశాల నుండి సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని (B.Sc.) అభ్యసించాడు. ముఖేష్ కేరళ లా అకాడమీ లా కాలేజీ, తిరువనంతపురం నుండి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నాడు. ముఖేష్ రంగంలోకి రాకముందు స్టేజ్ మీద నాటకాలు వేసేవాడు.

ముఖేష్ 1988లో సినీ నటి సరితను వివాహం చేసుకున్నాడు ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. 2011లో ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. [7] [8] ముఖేష్ పెద్ద కుమారుడు శ్రవణ్ 2018 కళ్యాణం చిత్రంతో తొలిసారిగా నటించాడు. ముకేశ్ 24 అక్టోబర్ 2013న నాట్యకారిని మెథిల్ దేవికను వివాహం చేసుకున్నారు. ఈ జంట 2021లో విడాకుల కోసం కోర్టులో దావా వేశారు. [9] [10] ముఖేష్ 2016 ఎన్నికలలో కొల్లం నియోజకవర్గం నుండి కేరళ శాసనసభకు ఎన్నికయ్యాడు. [11]

సినీ జీవితం

[మార్చు]

1982–1989

[మార్చు]

ముఖేష్ 1982లో వచ్చిన బెలూన్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. [12] అదే సంవత్సరం తమిళ సినిమాలో కూడా నటించాడు. 80వ దశకం మధ్యలో, ముఖేష్ ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లో నటించాడు. ముఖేష్ హీరోగా నటించిన మొదటి చిత్రం 1985లో ముత్తారంకున్ను తో వచ్చింది, బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించింది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన 1985 చిత్రం బోయింగ్ బోయింగ్‌తో ముఖేష్ కు మొదటి పెద్ద హిట్ వచ్చింది. ఈ చిత్రంలో ముఖేష్ మోహన్‌లాల్‌కి సహాయ నటుడిగా నటించాడు. మోహన్‌లాల్‌తో ముఖేష్ కు ఆ సినిమాతోనే పరిచయం ఏర్పడింది. వారు 1980ల చివరలో అనేక చిత్రాలలో మోహన్లాల్ తో నటించాడు ముఖేష్. నిన్నిష్టం ఎన్నిష్టం (1986) , అడివేరుకలు (1986), హలో మై డియర్ రాంగ్ నంబర్ (1986) మజా పెయ్యున్ను మద్దలం కొట్టున్ను (1986). సినిమాలలో ముఖేష్ మోహన్లాల్ ఇద్దరు కలిసి నటించారు. ముఖేష్ తనియావర్థనం (1987), 1921 (1988) సంఘం (1988) వచ్చిన సినిమాలలో మమ్ముట్టికి సహాయ నటుడిగా నటించాడు.

ముఖేష్ ఏ, 1989లో, రామ్‌జీ రావు స్పీకింగ్‌లో నటించాడు, ఈ సినిమా థియేటర్లలో 200 రోజులు ఆడిన సినిమా. బ్లాక్‌బస్టర్ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. [13] ఈ సినిమా ముఖేష్‌కి పెద్ద బ్రేక్ ఇచ్చింది. [14] రామ్‌జీ రావు స్పీకింగ్‌ సినిమా ద్వారా ముఖేష్ స్టార్ డమ్ కి ఎదిగాడు. ముఖేష్ నటించిన మరో సినిమా"కంబిలిపోతప్పు" పరా జయం పాలయింది ముఖేష్ వందనం (1989)లో మోహన్‌లాల్‌తో కలిసి నటించాడు, . [15]

1990–1999

[మార్చు]

1990 ప్రారంభంలో, ముఖేష్ పతనప్రవేశం (1989)కి ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన అక్కరె అక్కరె అక్కరేలో సినిమాలో అతిథి పాత్రను పోషించాడు. రామ్‌జీరావు స్పీకింగ్ సినిమా విజయం తర్వాత ముఖేష్ కు చాలా అవకాశాలు వచ్చాయి. 1991లోచేర్య లోకవుం వలియ మనుష్యరుమ్ చిత్రం ఆ తర్వాత విడుదలైంది, ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించింది.[ citation needed ] చేర్య లోకవుం వలియ మనుష్యరుమ్ సినిమా విజయం తరువాత ముఖేష్ ఇన్ హరిహర్ నగర్ సినిమాలో నటించాడు. ఈ సినిమా థియేటర్లలో 200 రోజులు ఆడింది. ఈ సినిమా ముఖేష్‌ను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా నిలబెట్టింది. ఈ సినిమా ద్వారా ముఖేష్ కు అభిమానులు పెరిగారు. ఇన్ హరిహర్ నగర్ విజయం తర్వాత, ముఖేష్ తక్కువ ఖర్చుతో సినిమాలు తీసేవాడు. 1990లో ముఖేష్ తూవలస్పర్శం, మారుపురం మలయోగం వంటి విజయవంతమైన సినిమాలలో నటించాడు. మరో వ నటుడు జయరామ్‌తో కలిసి నటించడం మొదలు పెట్టాడు. ముఖేష్ అదే సంవత్సరంలో గజకేసరియోగం, ఒట్టెయల్ పట్టాలం ఛాంపియన్ థామస్ వంటి సినిమాలలో హీరోగా నటించాడు. [16] కౌతుగల్ వార్తాకల్‌లో సీరియల్లో ముఖేష్ నటించాడు. ముఖేష్ అదే సంవత్సరం మనైవి ఒరు మాణికంలో సినిమా ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. [17]

, 1991లో సిద్ధిక్-లాల్ దర్శకత్వం వహించిన క్లాసిక్ కామెడీ చిత్రం గాడ్‌ఫాదర్‌లో ముఖేష్ నటించాడు, ఈ సినిమా 400 రోజులాడింది. మలయాళ చిత్ర పరిశ్రమలో ఆడిన చిత్రంగా గాడ్ ఫాదర్ నిలిచింది. [18]

మూలాలు

[మార్చు]
  1. "താരങ്ങളുടെ കിടപ്പറയില്‍ ഒളിഞ്ഞു നോക്കുന്നവരുണ്ട്‌". mangalam.com. 2013-06-03. Archived from the original on 8 June 2013. Retrieved 2014-03-19.
  2. "എന്നെ ഒതുക്കാന്‍ നോക്കേണ്ടാ.., Interview". Mathrubhumi.com. 2012-08-28. Archived from the original on 29 August 2012. Retrieved 2014-03-19.
  3. Ray, Bibekananda; Joshi, Naveen (2005). Conscience of the race : India's offbeat cinema. New Delhi: Publications Division, Ministry of Information and Broadcasting, Government of India. ISBN 81-230-1298-5. OCLC 70208425.
  4. "Balloon (1982)". www.malayalachalachithram.com. Retrieved 2022-10-08.
  5. ജ്യോതിഷ്, വി.ആര്‍. (21 October 2016). "ഫാസിൽ മനുഷ്യനെ പറ്റിക്കാൻ ഇറങ്ങിയിരിക്കുകയാണ്...റാംജിറാവുവിനൊപ്പം കഥകളും ഇറങ്ങി; സിദ്ദിഖ്–ലാൽ". Vanitha. Retrieved 21 October 2016.
  6. "KLA Title M. Mukesh" (PDF). Fourteenth Kerala Legislative Assembly. Retrieved 12 July 2018.
  7. "Mukesh - Malayalam actors who have married more than once". The Times of India. 18 March 2018. Retrieved 9 July 2018.
  8. mangalam. "Mangalam - Varika 3-Feb-2014". Mangalamvarika.com. Archived from the original on 9 February 2014. Retrieved 2014-03-19.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  9. "ഇത് ഞങ്ങള്‍ കാത്തിരുന്ന വിവാഹം - articles, infocus_interview". Mathrubhumi.com. Archived from the original on 18 March 2014. Retrieved 2014-03-19.
  10. Radhika C. Pillai (9 November 2013). "My marriage with Mukesh is an arranged one: Methil Devika". The Times of India. Archived from the original on 14 November 2013. Retrieved 25 January 2014.
  11. "Kerala Assembly polls: Actors in the fray". The Hindu (in Indian English). 19 May 2016. ISSN 0971-751X. Archived from the original on 17 May 2021. Retrieved 10 July 2018.
  12. "Balloon (1982)". www.malayalachalachithram.com. Retrieved 2022-10-20.
  13. George, Vijay (2013-11-07). "Three of a kind". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-10-20.
  14. "ഫാസിൽ മനുഷ്യനെ പറ്റിക്കാൻ ഇറങ്ങിയിരിക്കുകയാണ്... റാംജിറാവുവിനൊപ്പം കഥകളും ഇറങ്ങി; സിദ്ദിഖ്–ലാൽ". 2016-10-25. Archived from the original on 25 October 2016. Retrieved 2022-10-20.
  15. "From Drishyam to Oppam, why Mohanlal's films are remade in other languages often". Firstpost. 26 December 2016.
  16. BR, Rohith (April 20, 2018). "Jharkhand mahouts to get Kannada lessons, jumbos to learn Hindi". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-10-22.
  17. தினத்தந்தி (2021-07-28). "நடிகர் முகேஷ் விவாகரத்து". www.dailythanthi.com (in తమిళము). Retrieved 2022-10-22.
  18. "Mukesh got ISC Award". Archived from the original on 29 January 2012. Retrieved 27 October 2011.
"https://te.wikipedia.org/w/index.php?title=ముఖేష్&oldid=4366853" నుండి వెలికితీశారు