ముకేశ్ మల్హోత్రా
ముకేశ్ మల్హోత్రా | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 నవంబర్ 23 | |||
ముందు | రామ్‌నివాస్ రావత్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | విజయ్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ముకేశ్ మల్హోత్రా మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో విజయ్‌పూర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ముకేశ్ మల్హోత్రా స్వతంత్ర అభ్యర్థిగా వచ్చి 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ భారతీయ జనతా పార్టీలో చేరి 2016 నుండి 2017 వరకు సహరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన 2023లో బీజేపీ నుంచి టిక్కెట్టు ఆశించగా టిక్కెట్టు రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి 44,128 ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచాడు.[2]
ముకేశ్ మల్హోత్రా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరాడు. ఆయన ఆ తరువాత సిల్పురి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పని చేసి, 2024లో విజయ్‌పూర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రామ్‌నివాస్ రావత్‌పై 7364 ఓట్ల మెజారితో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (23 November 2024). "Vijaypur Assembly Constituency By Poll Result 2024". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
- ↑ The Times of India (2023). "Vijaypur Constituency Election Results 2023: Vijaypur Assembly Seat Details, MLA Candidates & Winner" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
- ↑ The Times of India (23 November 2024). "Vijaypur bypolls election 2024: Congress' Mukesh Malhotra defeats BJP's Ramniwas Rawat by over 7000 votes". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
- ↑ Nai Dunia (23 November 2024). "Mukesh Malhotra: विजयपुर से उपचुनाव जीते मुकेश मल्होत्रा जमीन से जुड़े हैं, लोकसभा चुनाव में शामिल हुए थे कांग्रेस में". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.