మీర్ హుమాయూన్ జా బహదూర్
మీర్ హుమాయూన్ జా బహదూర్ CIE ఒక భారతీయ కులీన, రాజకీయవేత్త, తత్వవేత్త మరియు భారత స్వాతంత్ర్య కార్యకర్త, ఆయన 1866 నుండి 1892 వరకు మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క అధికారేతర సభ్యుడిగా పనిచేశాడు. అంతే కాకుండా 1893 నుండి ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క అధికారేతర సభ్యుడిగా ఉన్నారు.[1] 1880 జనవరి 1న క్వీన్స్ న్యూ ఇయర్ ఆనర్స్ జాబితాలో ఈయన కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ గా నియమించబడ్డాడు.
ఈయన కుమారుడు నవాబ్ సయ్యద్ ముహమ్మద్ బహదూర్ 1913లో కరాచీ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు.[2]
హుమాయూన్ జా బహదూర్ టిప్పు సుల్తాన్ వారసుడు. హుమయూన్ జా, టిప్పు సుల్తాన్ నాల్గవ కుమారుడైన సుల్తాన్ యాసిన్ కుమార్తె షహజాదీ షారూఖ్ బేగం కుమారుడు. ఈయన భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభదశలో ఆర్థిక, మేధోపరమైన సహాయాన్ని అందించాడు.1887 లో మూడవ భారత జాతీయ కాంగ్రెస్ సెషన్స్ జరిగినప్పుడు, హుమయూన్ బహదూర్ కాంగ్రెస్ నాయకులకు ద్రవ్య సహాయం అందించాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ K. C. Markandan (1964). Madras Legislative Council; Its constitution and working between 1861 and 1909. S. Chand & CO. pp. 148–188.
- ↑ Rafiq Zakakria, Indian National Congress, 100 glorious years: Indian National Congress, 1885-1985 (1985), p. 209
- ↑ "Nawab Syed Muhammad Bahadur". Indian National Congress. Archived from the original on 4 August 2017. Retrieved 23 July 2017.