Jump to content

మీర్ ఆలం మండి

వికీపీడియా నుండి
మీర్ ఆలం మండి
మీర్ ఆలం మండి
మీర్ ఆలం మండిలో కూరగాయల దుకాణం
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ
రూపకర్తనిజాం
రకంవిక్టరి కాలమ్

మీర్ ఆలం మండి, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో పాతబస్తీలో ఉన్న ఒక కూరగాయల మార్కెట్. దాదాపు ఐదెకరాల విస్తీర్ణంలో 200 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ మార్కెట్ లో 43 హోల్‌సేల్ దుకాణాలు, సుమారు 300 మంది వ్యాపారులు ఉన్నారు.[1]

చరిత్ర

[మార్చు]

హైదరాబాదును పరిపాలించిన 3వ నిజాం సికిందర్ జా వద్ద 1804 నుండి 1808 వరకు దివానుగా పనిచేసిన మీర్ ఆలం బహదూర్ పేరు మీద మీర్ ఆలం చెరువు నిర్మించబడింది. ఆ చెరువు పక్కనే కూరగాయల తోట కూడా ఉండేది. దాన్ని మీర్ ఆలం మండి అని పిలుస్తున్నారు. 200 ఏళ్ళనాటి ఈ మార్కెట్ శిథిలావస్థకు చేరుకుంది. టిన్ షీట్లు పడిపోవడంతోపాటు కాంక్రీటు ఐడిపోయింది.

ఆధునీకరణ

[మార్చు]

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని జీహెచ్‌ఎంసీ, కులీకుతుబ్‌షా పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)లు ఈ మార్కెట్ ఆధునీకరణకు శ్రీకారం చుట్టాయి. వారసత్వ సంపద దెబ్బతినకుండా 10.50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దానికి తగిన మరమ్మతులు, ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు.[2] ఇందులో భాగంగా మార్కెట్‌, పరిసర ప్రాంతాల్లో దెబ్బతిన్న క్యాచ్‌పిట్ల మరమ్మతులు, కొత్త క్యాచ్‌పిట్ల ఏర్పాటు, ఎల్‌ఈడీ దీపాలు, మెరుగైన పారిశుధ్య నిర్వహణ, రహదారుల మొదలైనవి ఏర్పాటు చేయనున్నారు.[3] జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి మార్కెట్‌ను కప్పివుంచిన టిన్‌ షీట్‌ల కొలతలు తీసుకొని పనులు ప్రారంభించారు.

మూలాలు

[మార్చు]
  1. Apr 17, TNN /; 2022; Ist, 03:37 (2022-04-17). "Design Finalised For Mir Alam Mandi | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2022-04-17. Retrieved 2022-10-21. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  2. "Mir Alam Mandi to be restored at Rs 10.50 crore in Telangana". The New Indian Express. 2022-10-04. Archived from the original on 2022-10-04. Retrieved 2022-10-21.
  3. telugu, NT News (2022-10-20). "మీరాలం మండికి పూర్వ వైభవం". Namasthe Telangana. Archived from the original on 2022-10-20. Retrieved 2022-10-21.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.