మీర్జా రియాజ్ ఉల్ హసన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీర్జా రియాజ్ ఉల్ హసన్
ఎమ్మెల్సీ
In office
2019, మార్చి 30 - ప్రస్తుతం
వ్యక్తిగత వివరాలు
జననం (1977-07-26) 1977 జూలై 26 (వయసు 47)
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీఎఐఎంఐఎం
జీవిత భాగస్వామిషబానా అలీ
సంతానంఇద్దరు కుమార్తెలు
తల్లిదండ్రులుమీర్జా సయీదుల్ హసన్ పర్వేజ్ ఎఫెండి, ఖదీజా బేగం ఎఫెండి
నివాసంమలక్‌పేట

మీర్జా రియాజ్ ఉల్ హసన్, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఎఐఎంఐఎం తరపున తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు.[1][2] 2016లో హైదరాబాదు మహానగర పాలక సంస్థలోని డబీర్‌పురా వార్డు (నం: 30) కార్పొరేటర్ గా ఎన్నికయ్యాడు.[3][4]

జీవిత విషయాలు

[మార్చు]

హసన్ 1977, జూలై 26న మీర్జా సయీదుల్ హసన్ పర్వేజ్ ఎఫెండి, ఖదీజా బేగం ఎఫెండి దంపతులకు హైదరాబాదులో జన్మించాడు. బికాం వరకు చదువుకున్నాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

హసన్ కు షబానా అలీతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు.

రాజకీయరంగం

[మార్చు]

ఎఐఎంఐఎం పార్టీ సభ్యుడిగా ఉన్న హసన్,[5] 2009లో నూర్ ఖాన్ బజార్ డివిజన్ నుండి, 2016లో డబీర్‌పురా డివిజన్ నుండి కార్పొరేటర్ గా ఎన్నికయ్యాడు. రెండుసార్లు హైదరాబాదు మహానగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. 2019 మార్చి 30న శాసనసభ్యులచే శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[6][7]

ఇతర వివరాలు

[మార్చు]

ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా మొదలైన దేశాలలో పర్యటించాడు.

మూలాలు

[మార్చు]
  1. Telangana-Legislature, MLCs (4 August 2021). "Members Information - Telangana-Legislature". telanganalegislature.org.in. Archived from the original on 4 August 2021. Retrieved 6 August 2021.
  2. IANS (2019-03-12). "Telangana Home Minister among 5 elected to Council". Business Standard India. Retrieved 6 August 2021.
  3. Mahesh, Koride (8 April 2009). "Baldia beginning to these MLC, MP netas". The Times of India. Archived from the original on 10 May 2011.
  4. "Archived copy". Archived from the original on 23 February 2017. Retrieved 6 August 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. Janyala, Sreenivas (15 April 2009). "After 40 yrs, MIM on shaky ground". The Indian Express. Archived from the original on 10 May 2011.
  6. "Telangana MLC polls: Home Minister among 4 TRS candidates elected to state Council". The News Minute (in ఇంగ్లీష్). 2019-03-13. Retrieved 6 August 2021.
  7. "TRS, MIM candidates win MLC polls as expected". The Hindu (in Indian English). Special Correspondent. 2019-03-12. ISSN 0971-751X. Retrieved 6 August 2021.{{cite news}}: CS1 maint: others (link)