Jump to content

మీనాక్షి వాధ్వా

వికీపీడియా నుండి
మీనాక్షి వాధ్వా
జననం1968
రంగములుగ్రహ శాస్త్రం
వృత్తిసంస్థలుArizona State University
The Field Museum
University of Chicago
University of Illinois at Chicago
University of California at San Diego
చదువుకున్న సంస్థలుWashington University, St. Louis
Panjab University

మీనాక్షి వాధ్వా (Meenakshi Wadhwa) జియో కెమిస్ట్రీ పరిశోధకురాలు. ఉల్కల ఔత్సాహిక పరిశోధకురాలు. ఈమె చికాగో లోని ఫీల్డ్ మ్యూజియంలో పరిశోధకురాలుగా ఉన్నారు.

జీవిత విశేషాలు

[మార్చు]

బాల్యం-విద్యాభ్యాసం

[మార్చు]

మీనాక్షి వాధ్వా 1968 లో జన్మించింది. తండ్రి భారత వైమానిక దళ అధికారి. ఉద్యోగరీత్యా రెండేళ్ళకోసారి ఊరు మారేవారు. 15 వ యేటనే తల్లి మరణించడంతో చిన్నారి చెల్లిని, తండ్రిని తానే చూసుకొనే పెద్ద బాధ్యతను మోసారు. విద్యార్థి దశ నుంచి విజ్ఞాన శాస్త్రం సబ్జక్టుల మీద బాగా ఆసక్తి చూపేవారు. ఉన్నత పాఠశాల చదువు పూర్తయ్యే నాటికి చాలా వరకు విజ్ఞాన శాస్త్రం ఏమంత ఆశ్చర్యం కలిగించేదేమీ కాదని భావించారు. అంతా రోజువారీ జీవితంలో మనం చూసేదే - కాకపోతే ఎంతో ఓపికతో, పద్ధతి ప్రకారం పనిచేసుకుంటూ ముందుకు వెళుతుంటే పెద్ద పెద్ద విషయాలు అనుభవంలోనికి వస్తాయని గ్రహించారు. అంత చిన్న వయస్సులోనే ఎంతో అనుభవం గడించిన తరహాలో ఆలోచించడం ప్రారంభించారు. మీనాక్షి చదువులో కూడా అత్యంత శ్రద్ధ కనబరచేవారు.

ఉన్నత పాఠశాల చదువు అయిన తర్వాత ఏ చదువు చదవాలో నిర్ణయం తీసుకొనుటకు తర్జన భర్జన పడుతున్న సమయంలో ఆమె అయాన్ ర్యాండ్ రాసిన "ది ఫౌంటెన్ హెడ్" ను చదివారు. దానితో స్ఫూర్తి చెంది ఆర్కిటెక్చర్ మీద అపరిమితమైన అభిమానం పెంచుకున్నారు. అన్ని ఆలోచనలు వెనక్కు నెట్టి, అన్ని విషయాలూ మరచిపోయి ఆర్చిటెక్ట్ అయి తీరాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. వాస్తవానికి, ఆ వృత్తి గురించి, అందులోని సాధక బాధకాల గురించి ఈమెకేమాత్రం తెలియదు. కేవలం ఊహాజనితమైన ఆరాధన.

ఆర్కిటెక్చర్ కోర్స్ అధ్యయనానికి ప్రయత్నాలు చేస్తే ప్రవేశం లభించలేదు. ఆ సమయంలో ఆమె చండీఘర్ లో ఉండేవారు. హిమాలయ పర్వతాల చెంత ఉండటంతో ఆ పర్వతాలనూ చూస్తూ ఆమె మైమరచి పోయేవారు. భావుకత్వం తగు మోతాదులో ఉండేది. ఆ పర్వతాలు తనకు ఏదో స్ఫూర్తినిస్తున్నాయని, వాటిలో కొన్నింటి గురించైనా అర్థం చేసుకోగలిగితే బావుండునని ఈమెకు అనిపించింది. అంతే, ముందుగా భూభౌతిక శాస్త్రం(జియాలజీ) చదివితే ఎలా ఉంటుందోనన్న ఆలోచన మొదటిసారిగా ఈమె మనసులో మెదిలింది. పంజాబ్ యూనివర్శిటీలో చేరారు. తరగతిలో ఈమెతో పాటు మరొక అమ్మాయి మాత్రమే సహవిధ్యార్థిగా ఉన్నారు. అధికశాతం ఫీల్డ్ వర్క్ ఉండే ఈ కోర్స్ లో అమ్మాయిలేం చేస్తారని చాలా మంది భావించేవారు. ఈ ఒక్క సందర్భంలోనే ఈమె స్త్రీగా కొంతమేరకు విచక్షణను ఎదుర్కోవలసి వచ్చింది. అంతేకాదు, చదువు పరంగా ఎంతో శారీరక, మానసిక ఒత్తిడులకు కూడా లొంగిపోవలసి వచ్చింది. అయినప్పటికీ ధైర్యసాహసాలను ఒడిసి పట్టుకొని ముందడుగు వేశారు.

ఫీల్డ్ కెరియర్ లో ఒంటరిగా వెళ్లడం ప్రారంభించారు. రాళ్ళను శోధిస్తూ హిమాలయ పర్వతాల స్కెచ్ ల కోసం పడరాని పాట్లు పడేవారు. పలు అవస్థలు అనుభవించారు. అత్యున్నత పర్వత సానువుల దృశ్యాలు ఒకే ఒక్క అడుగు అటూ ఇటూ అయినా పూర్తిగా స్వరూపం మారిపోయేవి. ఈమె వద్ద ఒక కెమేరా కూడా లేదు. అప్పుడనిపించింది... ఈ పాట్లు పడకుండా అమెరికా వెళ్ళి చదువుకుంటేనే బాగుంటుందని. అక్కడైతే, తనతో పాటు క్లాస్ రూం లో బోలెడంతమంది అమ్మాయిలుండే అవకాశముందని ఆలోచించారు. ఇక, వెంటనే అమెరికా ప్రయాణం తలపెట్టారు.

అమెరికాలో విద్యాభ్యాసం

[మార్చు]

వాషింగ్టన్ విశ్వవిద్యాలయం (సెయింట్ లూయీస్) లో సీటు సంపాదించగలిగారు. అయితే విచిత్రమేమిటంటే ఆమె తరగతి గదిలో ఈమె ఒక్కరే అమ్మాయి. విశ్వవిద్యాలయానికి కనుచూపుమేరలో కూడా పర్వతాలు ఏవీ లేవు. ఏదో కాస్త బాధనిపించినా పట్టించుకోలేదు. విశ్వవిద్యాలయంలో కోర్సు ప్రారంభమైన తర్వాత ఆలస్యంగా చేరవలసి రావడంతో క్లాస్ రూమ్‌ పాఠాలను అందుకోలేక పోయారు. క్లాస్ మేట్స్ స్థాయికి చేరుకోడానికి నెలల తరబడి రాత్రింబవళ్ళూ చదువుమీదనే దృష్టి పెట్టారు. ఒకరోజున ఉపాధ్యాయ బృందంలో ఒకరు ఈమెతో అంగారక గ్రహానికి సంబంధించిన విషయమేదైనా చూడాలని ఆసక్తి ఉందా? అని అడిగారు. ఈమె అస్సలు నమ్మలేక పోయారు. అప్పుడీమె వయసు 21 సంవత్సరాలు. చంద్రమండలం మీదికి మనిషి వెళ్ళొచ్చాడని మాత్రమే తెలుసు. ఆ తర్వాత ఖగోళ శాస్త్ర రంగం ఎంత ప్రగతి సాధించిందీ ఈమెకు తెలియదు. కుతూహలం రేపే ఈ ప్రశ్న ఎదురవడంతో ఆనందంతో ఎగిరి గంతేసేటంత పనిచేశారు. ఉపాధ్యాయ బృందంలోని ఒకామె ఈమెతో సన్నిహితంగా ఉండే వారు. ఆమె అంగారక గ్రహం మీద జరిగిన అనూహ్య పరిణామాల వల్ల అంతరిక్షం లోకి ఎగిరిన కొన్ని శిలల ముక్కలు కొంత వ్యవధిలో భూమి పైన పడ్డాయని వివరించారు. ఆ తర్వాత ఆ ముక్కలలో ఒక దానిని చూపారు. ఈమె చూసిన ఆ అంగారక గ్రహశకలం ఎంత చిన్నదంటే అది 30 మైక్రాన్ల మందంతో ఉన్నది. మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించారు. ఈ ఘటన అనంతరం మీనాక్షి ఇక వెనుతిరిగి చూడలేదు.

పరిశోధనా రంగంలో కృషి

[మార్చు]

యూనివర్శిటీ గ్రాడ్యుయేషన్ పట్టాఅ అందించిన తర్వాత పరిశోధనా రంగంలోకి చొరబడ్డారు. కేవలం భూమి గురించి తెలుసుకొని ఫుల్ స్టాప్ పెట్టడమంటే మనసు సుతరామూ అంగీకరించలేదు. గ్రహాలన్నింటి గురింఛి తెలుగుకోవాలని నిశ్చయించుకున్నారు. ఉల్కల గురించి అధ్యయనం చేయటానికి, ఎర్త్ సైన్సు చదవడానికి సంబంధం లేని విషయమని చాలామంచి భావించడం తెలిసినా ఖాతరు చేయలేదు. సౌర కుటుంబంలో ఇవన్నీ పరస్పరానుబంధం ఉన్న అంశాలే గదా, ఉల్కల గురించి తెలుసుకుంటేనే మన భూమి పూర్వాపరాలు అనేకం తెలిసి వస్తాయని భావించారు.

జియోకెమిస్ట్రీలో భాగంగా శిలలను గాఢ అధ్యయనం చేయటం ద్వారా భూగ్రహం రూపుదిద్దుకోవడానికి ఎంత సమయం పట్టిందో తెలుస్తుంది. ఏ ఏ పదార్థాలతో ఏ విధంగా రూపొందిందో తెలియవస్తుంది. ఈ వివరాలు తెలిసినప్పుడు సౌర వ్యవస్థ అనుపానులు తెలుసుకొనే అవకాశం వస్తుంది. ఏనాటికైనా అంగార గ్రహం నుంచి రాలిపడిన రాళ్ళను తెచ్చి, స్వయంగా తన ప్రయోగశాలలో పరిశీలించాలని మీనాక్షి గారు కలలు కనడం ప్రారంభించారు.కొలంబియా స్పేస్ షటిల్ లో ప్రమాదానికి గురైన కల్పనా చావ్లా ఈమెకు పదకుండేళ్ళ వయసు నుంచీ పరిచయం. ఆమె ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్నపుడు కూడా మీనాక్షిని ఒకసారి కలుసుకున్నారు.

2003 మార్చి లో ఒకసారి చికాగో పరిసరాల్లో ఉల్కాపాతం సంభవించింది. ఆ విషయం తెలిసిన వెంటనే మీనాక్షి హడావుడిగా అక్కడికి చేరుకున్నారు. అక్కడ 15,20 శిలల ముక్కలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆమె చూసిన తాజా ఉల్కలు ఇవే! ప్రజలు వాటిని గ్రాము పాతిక డాలర్లకు అమ్మడం మొదలుపెట్టారు. వాటి గురించి విచిత్రమైన కథలు చెప్పుకొనేవారు. మీనాక్షి అసహాయ స్థితికి జారిపోయారు. ఈమెలాంటి శాస్త్రవేత్తకు అవి ఎంతో అమూల్యమైనవో ప్రధానమైనవో ఆ ప్రజలకు వివరించలేకపోయారు. ఆ ఉల్కలను కొనుగోలు చేయడానికే నిశ్చయించుకున్న మీనాక్షి ఆ ఉల్క సంబంధిత శిలలను మూడు కిలోల వరకు సేకరించగలిగారు.

కెరీర్

[మార్చు]

As director of the Center for Meteorite Studies at Arizona State University, Wadhwa oversees the curation of one of the largest university-based meteorite collections,and a variety of research and educational activities. During her career, she served as a science team member on a number of NASA planetary science missions including Genesis, Mars Science Laboratory, OSIRIS-REx, and Sample Collection for Investigation of Mars (SCIM).

అవార్డులు, గౌరవాలు

[మార్చు]

కాలక్రమంలో ఉల్కల మీద గాఢాధ్యయనం చేసి, నిశిత పరిశీలనలు జరిపి, పరిశోధనలు నిర్వహించిన మీనాక్షి గారికి పలు అవార్డులు వివార్డులు అందాయి. ఉల్కల శిలలు సేకరించిన మరుసటి సంవత్సరమే (2004) పరిశోధనా పత్రం సమర్పించిన అనంతరం పి.హెచ్.డి అందుకున్నారు. చికాగో ఫీల్డ్ మ్యూజియం లో క్యూరేటర్ ఆఫ్ మితియోరైట్ గా తనకు బాగా నచ్చిన పదవిలో చేరారు. 1999 లో ఒక ఆస్టరాయిడ్ కు ఈమె పేరు (వాధ్వా) అని నామకరణం చేసారు.ఆమె 2007 లో వింగ్స్ వరల్డ్ క్వెస్ట్ యొక్క ఫెలోగా ఎంపికయ్యారు. ఆమె 2006 లో ఉల్కల సొసైటీ కి కూడా ఫెలోగా అయ్యారు. 1989 లో ఆమె పేరు తో ఉల్కకు 8356 వాధ్వా అని అంతర్జాతీయ ఖగోళ సంస్థ (IAU).[1] నామకరణం చేసింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1993 లో ఈమె పరిశోధనా నిమిత్తం హవాయి యూనివర్శిటీ లో కొన్ని రోజులు ఉండవలసి వచ్చింది. అక్కడ విధ్యార్థిగా ఉన్న మార్క్ వరిచయం, తర్వాత ప్రేమగా మారి వివాహానికి దారితీసింది.

మూలాలు

[మార్చు]
  1. "JPL Small-Body Database Browser: 8356 Wadhwa".

ఇతర లింకులు

[మార్చు]