Jump to content

మీడియావికీ చర్చ:Anonnotice

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

గ్రామం పేజీలగురించి సైట్ నోటీస్ పై అభిప్రాయాలు

[మార్చు]

వాడుకరి:రహ్మానుద్దీన్ గారు ప్రవేశ పెట్టిన ప్రకటన వికీపై దురభిప్రాయం కలిగించగలదు. ఎందుకంటే సాధారణంగా వికీలో ప్రకటనలు కనబడవు. మొదటి పేజీ లో స్వాగతం లింకు ద్వారా గ్రామపు పేజీలకు సంబంధించిన వివరానికి సులభంగా చేరుకోవచ్చు. గ్రామపు వివరాలు ఎవరైనా చేర్చినా వాటికి ఆధారాలు అంత సులభంగా దొరకవు. మన భావోద్వేగాలను సంతృప్తిపరుస్తుంది తప్పితే దీనివలన అంత ఉపయోగంలేదు కావున దీనిని తొలగించాలని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 07:59, 14 అక్టోబర్ 2013 (UTC)

పురస్కార ప్రకటన

[మార్చు]

ప్రవేశించిన సభ్యులకు కనబడే ప్రకటన ను ఒక వారం పొడిగించినందున. ఇక్కడ కూడా పొడిగించుతున్నాము.--అర్జున (చర్చ) 11:07, 9 డిసెంబర్ 2013 (UTC)

మొబైల్ వాడుకరులను దృష్టిలో పెట్టుకొని సందేశాలుండాలి.

[మార్చు]

టేబ్లెట్ వాడేవారికి తెలుగు కీబోర్డు సంబంధించిన సందేశాలు ప్రత్యేకంగా వుండాలి. మీడియావికీ:Anonnotice లో CTRL+M నొక్కి తెలుగు టైపుచేయండి లాంటి సందేశాలు సరికాదు. అటువంటి వాటిని డెస్క్టాప్ వాడుకరులకి మాత్రమే పరిమితంచేయాలి.--అర్జున (చర్చ) 06:20, 2 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త ప్రతిపాదన (ఖాతా లో ప్రవేశించని వారికి)

[మార్చు]

YesY సహాయం అందించబడింది

ప్రస్తుత ప్రకటన

వికీపీడియాలో మీరు కూడా రాయొచ్చు! రాయండి!!

తెలుగులో టైపుచెయ్యడం తెలీదా? టైపింగు సహాయం చూడండి.

ప్రతిపాదిత ప్రకటన
ఎందుకు మార్చాలి?
  • ప్రస్తుత ప్రకటన ఎక్కువ స్థలం ఆక్రమిస్తున్నది. పాత కఠినమైన పద్ధతికి సంబంధించినది.
  • తెలివైన కీ బోర్డు ల గురించి తెలియచేస్తుంది.

వ్యతిరేకత ఏమైనా వుంటే, లేక ప్రతిపాదన మెరుగుచేయటానికి ఒక వారంలోగా సహకరించండి. --అర్జున (చర్చ) 22:35, 4 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

రాసిన ప్రకటన పాఠ్యం అర్థం కావట్లేదు, మార్చాలి. ముందు సందర్భం చెప్పాలి. తరువాత లింకుల గురించి సూటిగా అర్థమయ్యేలా చెప్పాలి.__చదువరి (చర్చరచనలు) 04:46, 5 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. వాక్యం ఈ క్రింద విధంగా మారిస్తే అర్ధమవుతుందా?
సులభంగా ఆంగ్లాక్షరాలు వాడి తెలుగు టైపు చెయ్యుటకు ఏ కంప్యూటర్ వ్యవస్థలోనైనా గూగుల్ క్రోమ్ విహరిణి వాడుకరులకు పద్ధతి, లేక విండోస్ లో వాడుకరుల పద్ధతి.
ఇది ప్రకటన కాబట్టి మరింతగా తెలుసుకొనటానికి వీక్షకులు లింకులు చూస్తారు, మొదటి లింకులో వీడియో కూడా చేర్చబడినది. మీరు ఇంకొంత మెరుగుచేసే ప్రయత్నం చెయ్యమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 05:41, 5 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, విండోస్ కంప్యూటరులో ఈ పద్ధతిని వాడవచ్చు. విండోస్‌తో సహా కంప్యూటరు ఏదైనా సరే, మీ క్రోమ్ బ్రౌజరులో ఈ పద్ధతిని వాడవచ్చు." అర్జున గారూ, దీన్ని పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 09:49, 5 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, బాగుంది, ఇంకొంచె మెరుగు చేశాను
"తెలుగు టైపులో తప్పులు కంప్యూటర్ తానంతటదే సరిచేసే పద్ధతి కొరకు, విండోస్ కంప్యూటరులో ఈ పద్ధతిని వాడవచ్చు. విండోస్‌తో సహా కంప్యూటరు ఏదైనా సరే, మీ క్రోమ్ బ్రౌజరులో ఈ పద్ధతిని వాడవచ్చు."
ఎలా వుందంటారు?--అర్జున (చర్చ) 04:43, 6 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
"తెలుగు టైపులో తప్పులు కంప్యూటర్ తానంతటదే సరిచేసే పద్ధతి కొరకు మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
అర్జున గారూ, "సరిచేసే పద్ధతి" అనేది సరిగ్గా లేదు. ఏదో తప్పు జరిగితే సరిచేస్తుంది అన్నట్టుగా ఉంది. దాన్ని మార్చాలి.__చదువరి (చర్చరచనలు) 04:15, 13 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారికి, నేను అర్ధం చేసుకున్నదాని బట్టి ఆ వాక్యం సరిగా వుంది. మీకు అర్ధమైనదాని ప్రకారం మెరుగైనదేదైనా ప్రతిపాదించండి. --అర్జున (చర్చ) 05:17, 13 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ, నాకు అర్థమైనది నేను చెప్పాను. మెరుగు అనుకున్నది ఈసరికే ప్రతిపాదించాను.__చదువరి (చర్చరచనలు) 05:25, 13 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు, నా చివరి సవరణ తెలుగు టైపు అంటే సాధారణంగా తప్పులు జరుగుతాయేమోనన్న అభిప్రాయం ఉండేవారికి మరింత ధైర్యమిచ్చేదిగా వుంటుందని అనుకున్నాను. సరే ఇతర సభ్యులు, నిర్వాహకులు ( వీవెన్,

రాజశేఖర్, వాడుకరి:విశ్వనాధ్.బి.కె., చంద్ర కాంత రావు, రవిచంద్ర, t.sujatha, కె.వెంకట రమణ, రహ్మానుద్దీన్, పవన్ సంతోష్, ప్రణయ్ రాజ్, స్వరలాసిక, యర్రా రామారావు) స్పందనను బట్టి చివరి నిర్ణయం చేస్తాను.--అర్జున (చర్చ) 06:23, 14 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతిపాదనలపై స్పందన

[మార్చు]

అనామిక వాడుకరులకు తెలుగు టైపు గురించి తెలుగు వికీపీడియా పేజీలో పై భాగాన కనబడే ప్రకటన ప్రతిపాదనలలో మీకు ఇష్టమైన దాని క్రింద సంతకం చేయండి. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 06:33, 14 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతిపాదన 1: "తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మద్దతు

<పైన # తో సంతకం చేర్చండి>

  1.   ఇది బావుంది. ఎందుకంటే - తప్పులు తానంతట తానే సరిజేసే - అంటే నకారాత్మకంగా ధ్వనిస్తోంది. అంతకన్నా సులువు అన్న పదం బావుంది. --పవన్ సంతోష్ (చర్చ) 02:16, 15 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  2.   ఇది బావుంది.--యర్రా రామారావు (చర్చ) 05:22, 22 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతిపాదన 2: "తెలుగు టైపులో తప్పులు కంప్యూటర్ తానంతటదే సరిచేసే పద్ధతి కొరకు మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మద్దతు

<పైన # తో సంతకం చేర్చండి>

ఇతరాలు, వ్యాఖ్యలు

<పైన # తో వ్యాఖ్య చేర్చి సంతకం చేర్చండి>

పవన్ సంతోష్, యర్రా రామారావు గార్ల స్పందనలకు ధన్యవాదాలు. ప్రతిపాదన 1 ఖరారు చేయడమైనది.--అర్జున (చర్చ) 06:44, 5 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

"తెలుగు టైపుకు గూగుల్ క్రోమ్ సౌలభ్యం" ప్రకటన తొలగింపు

[మార్చు]

గూగుల్ లిప్యంతరీకరణ పేజీకి రోజుకి సగటు వీక్షణలు 10 లోపు వుండేవి 20-25కు పెరిగినప్పటికి, వికీపీడియా:2021 సమీక్ష లోని గణాంకాల ప్రకారం తెవికీ కొత్తవాడుకరులు, క్రియాశీలసభ్యులపై ఏమాత్రం ప్రభావం పడినట్లు లేదు. తెలుగు వికీ వీక్షకుల సౌకర్యం మెరుగుపరచటానికి ఈ ప్రకటన తొలగించడమైనది. వికీపీడియా:టైపింగు సహాయం లో తొలివరుసలో ఈ సమాచారం కొనసాగుతున్నది. --అర్జున (చర్చ) 04:22, 19 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఇలాంటి ప్రకటనలను తీసెయ్యకూడదు.
  1. ఎవరో ఒకరికి పనికొచ్చినా దానికి సార్థకత చేకూరినట్టే.
  2. తెలుగులో ఎలా రాయాలో తెలియని వాళ్ళు ఇంకా ఉంటూనే ఉన్నారు.
  3. వికీలో ఏ సమాచారం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలంటే కొత్తవారికి కష్టం.ఇలాంటి ప్రకటనలు దగ్గరి దారిని చూపిస్తాయి.
  4. ఎంతమందికి పనికొచ్చిందో, పనికివస్తుందో అన్నది చెప్పలేం
కాబట్టి వీటిని ఉంచాలి. __ చదువరి (చర్చరచనలు) 04:40, 19 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, ఇక్కడ ఈ కొత్త వాడుకరి అడిగిన ప్రశ్న చూడండి. ఆ లింకు ఉంటే ఈ వాడుకరికి ప్రయోజనం కలిగి ఉండేదనేది స్పష్టం. మీరు తీసేసిన ఆ లింకు పెట్టడం గురించి కనీసం ఇప్పుడైనా పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 01:56, 21 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, ఈ విషయమై నా అభిప్రాయాలివి:
  • వికీపీడియా వీక్షకులనందరిని, అలాగే సంపాదకులందరిని ప్రభావితం చేసే అంశాలగురించిన చర్యలు అన్నికోణాలనుంచి లాభ నష్టాలను బేరీజు చేసి చెయ్యాలి, డాటా ఆధారితంగా అవసరమైన సవరింపులు చేయాలి.
  • ప్రకటనలను కొత్తవి తెలియచేయటానికి, పరిమిత కాలానికి మాత్రమే వాడాలి. ప్రకటన శాశ్వతంగా వుంటే అది ప్రకటన కాదు. దానికి విలువకూడా వుండదు.
  • వికీపీడియా వీక్షకులందరు దాదాపు మొబైల్ వీక్షకులు అనిచెప్పవచ్చు. మొబైల్ తెర విభాజకత తక్కువ కాబట్టి, ప్రకటనతో వారికి ఉపయోగపడే సమాచారం కనిపించే ప్రాంతం తగ్గుతుంది. ప్రకటన క్లుప్తంగావుండకపోతే, ఈ సమస్య మరీ తీవ్రమవుతుంది.
  • ఒకసారి చూసిన తరువాత ప్రకటన తొలగించే బటన్ సౌకర్యం వున్నా, చాలామంది కొత్తగా వికీపీడియాకు, ఇంటర్నెట్ కు పరిచయం అయ్యేవారికి, అవి ఉపయోగించటం తెలియకపోవచ్చు.
  • డాటా ద్వారా ఈ ప్రకటన వలన ఉపయోగం లేదని తెలిసింది.
  • మొబైల్ వాడుకదారులకు, తెరమీద కనబడే తెలుగు కీ బోర్డు ఉండడం వలన, ఈ ప్రకటన వలన పెద్దగా విలువలేదు.
  • కొత్తగా ఖాతా తెరిచిన వారు, స్వాగతసందేశంలో లింకులు చదవకుండా, ప్రశ్నలు అడగటం గమనించాను. వారడగిన ప్రశ్నను గూగుల్ లో వెతికితే వారికి ఉపయోగపడే లింకులు దొరుకుతాయి. కొత్త వాడుకరి అడిగిన ప్రశ్నకు గూగుల్ ఫలితాల లింకు చూడండి. అటువంటి వారికి ఓపికగా సమాధానమియ్యడమే మంచిది. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 22:38, 23 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ, మీరిక్కడ చెప్పిన లాజిక్కు మొత్తం పైన ఆ కొత్త వాడుకరి అడిగిన ప్రశ్నతో ముందే పూర్వపక్షమైపోయింది.
ఒక కొత్త వాడుకరికి తెలుసుకునే అవకాశం లేకుండా చేసేసాం. లింకులు వెతుక్కుని వెళ్ళడం, ఎవరినైనా/ఎక్కడైనా అడగడం అనేవి ఇప్పుడే వికీపీడియా చూసినవారికి అంత తేలిగ్గా తెలిసేవి కావు. ఈ వాడుకరి అడిగారు, కానీ ఎలా అడగాలో/అలా అడగాలని తెలీనివాళ్ళు ఎందరుండి ఉంటారో ఆలోచించండి. వాళ్ళకు -మనం ఆలోచించాల్సినది ఇది.
మీరు వాస్తవాన్ని పరిశీలించ దలచకపోతే ఇక మీ ఇష్టం. నేను ఈ చర్చను పొడిగించను. నమస్కారం.__ చదువరి (చర్చరచనలు) 22:50, 23 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ పాఠకులే వికీ రచయితలు ప్రకటన

[మార్చు]

మంచి ఆలోచన, మంచి ప్రయత్నం.ఇది నిరంతరం ఉంచినా పర్వాలేదు.ప్రకటన నోటీసు చూపురులకు ఆకర్షణగా, అర్థవంతగా కూడా ఉంది. --యర్రా రామారావు (చర్చ) 08:26, 27 ఫిబ్రవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]