Jump to content

మిస్టర్ నూకయ్య

వికీపీడియా నుండి
మిస్టర్ నూకయ్య
(మార్చి 8, 2012 తెలుగు సినిమా)
దర్శకత్వం అని కన్నెగంటి
నిర్మాణం డి.ఎస్‌. రావు
రచన లక్ష్మీభూపాల్‌
తారాగణం మంచు మనోజ్ కుమార్
కీర్తి కర్బంద, సనాఖాన్‌,
సంగీతం యువన్‌ శంకర్‌రాజా
విడుదల తేదీ 2012
భాష తెలుగు

మిస్టర్ నూకయ్య మార్చి 8, 2012 లో విడుదల అయింది.


సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

మిస్టర్‌ నోకియా(నూకయ్య అని పేరుమార్చినా సినిమాలో అలానే పిలుస్తారు)ను కట్టిపడేసి... ఫోన్‌ ఏదిరా? అంటూ కిడ్నాప్‌ గ్యాంగ్‌ లీడర్‌ షాజన్‌(మురళీ శర్మ) హింసింస్తుంటాడు. హీరో నోకియా... ఒక్కసారి గతలోకి వెళతాడు. తనో అనాథ. ఆవారాగా తిరుగుతూ... నోకియా ఫోన్లు దొంగతనం చేస్తాడు. నోకియా, అతని పక్కనే చార్జర్‌(వెన్నెల కిషోర్‌)లు ఇద్దరూ అనాథలే. వారిని తన దగ్గరే ఉంచుకుంటాడు కాలనీ పెద్ద నాంపల్లి (పరుచూరి వెంకటేశ్వరరావు).

తను లవ్‌ చేసిన క్లబ్‌ డాన్సర్‌ శిల్ప(సనాఖాన్‌)ను పెండ్లిచేసుకొని లైఫ్‌ సెటిల్‌ కావడానికి అనూరాధ(కీర్తి కర్బంద) దగ్గరున్న రూ. 2 కోట్లు కొట్టేస్తాడు. ఆమె తన భర్తను కిడ్నాపర్ల నుంచి తెచ్చుకునేందుకు తను పనిచేసే బ్యాంక్‌లోనే కొట్టేస్తుంది. కానీ ఆ డబ్బు లేకపోవడంతో అనురాధ ఆత్మహత్య చేసుకోతుండగా... నోకియా చూసి కాపాడతాడు. విషయం తెలుసుకుని... తను ఈమెకు ద్రోహం చేశానని పరివర్తన చెంది.. ఆమెకు సాయం చేస్తానని హామీ ఇస్తాడు.

అయితే రూ. 2 కోట్లు కొట్టేసింది నోకియానే అని తెలిసి.. అతన్నిఅసహ్యించుకుంటుంది. అదే టైమ్‌లో అనురాధను కిడ్నాపర్లు ఎత్తుకుపోతారు. అది చూసిన నోకియా ఏం చేశాడు? తర్వాత కథేంటి? అనేది సినిమా.

పాటల జాబితా .

[మార్చు]

ఓకే ఒక జీవితం, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. హారిచరన్

నో కెయ్య రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.రంజిత్

పిస్తా పిస్తా, రచన: మంచు మనోజ్ , గానం.కార్తీక్ , యువన్ శంకర్ రాజా

ప్రాణం పోయే భాద , రచన: మంచు మనోజ్, గానం . యువన్ శంకర్ రాజా

నో మనీ నో హానీ , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.కార్తీక్, ప్రేమజీ అమరెన్.

ఈ జన్మబంధమో, రచన: లక్ష్మీభూపాల్ , గానం.రంజిత్,ప్రియ హేమేశ్ .

బయటి లింకులు

[మార్చు]