Jump to content

మిల్లెట్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా

వికీపీడియా నుండి
మిల్లెట్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా
సంకేతాక్షరంmini
అవతరణ2007 అక్టోబరు
స్థాపకులుsడెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ
సభ్యులు5000
అధికార భాషsతెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ, తమిళం, ఇంగ్లీషు
Parent organisationడెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ
నెట్‌వర్క్ ప్రతినిధి నారి శక్తి పురస్కారాన్ని స్వీకరిస్తూ..

మిల్లెట్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా (ఆంగ్లం: Millet Network of India) చిరుధాన్యాల రైతులకు ప్రోత్సాహం అందిస్తుంది. సాంప్రదాయిక పంట లక్షణాలను గ్రహించిన వంద మంది మహిళలు దీనిని సృష్టించారు. వరి వంటి పోటీ పంటలను ప్రోత్సహించే ప్రభుత్వ రాయితీల అన్యాయాన్ని ఎత్తిచూపుతూ, తక్కువ నీటి వినియోగం, సేంద్రీయ ఎరువులతో చిరుధాన్యాల పెంపకానికి గ్రామ రైతులకు ఈ బృందం సహాయపడింది. ఇది నారి శక్తి పురస్కార్, ఈక్వేటర్ ప్రైజ్ రెండింటినీ అందుకుంది.[1]

స్థాపన

[మార్చు]

మిల్లెట్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియాను, తెలంగాణ, జహీరాబాదుకు చెందిన డెక్కన్ డెవెలప్‌మెంట్ సొసైటీ స్థాపించింది.[2] ఈ సొసైటీ స్థాపకుడైన పి.వి.సతీష్, ఈ నెట్‌వర్క్ స్థాపనలో కూడా చొరవ తీసుకున్నాడు.[3] ఇది 2007 అక్టోబరులో, 120 మంది సభ్యులతో మొదలైంది. ఈ సభ్యుల్లో భారతదేశం లోని 15 రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు, పాత్రికేయులు, పౌర సంఘాలు, 50 రైతు సంఘాలు ఉన్నాయి.[2]

నేపథ్యం

[మార్చు]
refer to caption
మిల్లెట్ నెట్‌వర్కు సభ్యులు

చిరుధాన్యాలు భారతదేశంలో ఒక సాంప్రదాయిక ధాన్యం. ఈ పంట ఇతర పంటల కంటే తక్కువ నీటితో పెరుగుతుంది కాబట్టి, మిల్లెట్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా దీనిని ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో సబ్సిడీని పొందుతున్న బియ్యంతో పోల్చినప్పుడు దీని ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంది. చిరుధాన్యాలు పేలవమైన నేలపై పెరుగుతాయి, పైగా వ్యాధులు అంత తొందరగా సోకవు, పండించిన పంటను ఎక్కువ కాలం నిలవ ఉంచవచ్చు.[4] చిరుధాన్యాలకు సహజ ఎరువులు వాడవచ్చు. కానీ చాలా మంది రైతులు ఇప్పటికీ దానిని పండించరు. డిమాండు తక్కువగా ఉన్నందున దీనిపై ఆసక్తి చూపించరు. తెల్ల బియ్యం బాగా ప్రాచుర్యం పొందింది, వరి సాగుకు ప్రభుత్వ రాయితీ లభిస్తుంది.[4]

చిరుధాన్యాలను గుర్తించని చట్టాలచే దాన్ని గుర్తింపజేయాలని ఈ నెట్‌వర్క్ 2016 లో ప్రచారం చేసి, ప్రభుత్వంపై లాబీయింగ్ చేసింది. పేదలకు అందుబాటులో ఉండే సబ్సిడీ ఆహారంలో చిరుధాన్యాలను చేర్చేలా జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని సవరించాలని వారు కోరారు. నెల రోజుల పాటు సాగిన ఈ ప్రచారం ప్రపంచ ఆహార దినోత్సవం నాడు ముగిసింది.[5]

2018 నాటికి, ఈ నెట్‌వర్క్ లో 5,000 మంది సభ్యులు ఉన్నారు. 2018 లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెట్‌వర్కుకు నారీ శక్తి పురస్కారం లభించింది. నెట్‌వర్కు తరపున మొఘులమ్మ ఈ పురస్కారాన్ని అందుకుంది.[6][7] మహిళా సాధికారతకు చేసిన అద్భుతమైన కృషికి గాను ఇచ్చే ఈ పురస్కారం, మహిళలకు ఇచ్చే అత్యున్నత పౌర గౌరవం. 2018 మార్చి 8న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసాడు. భారతదేశం నలుమూలల నుండి ఎంపికైన 39 మంది గ్రహీతలలో ఈ నెట్‌వర్క్ ఒకటి.[8]

ఈ పురస్కారాన్ని అందుకున్న మొఘులమ్మ 36 సంవత్సరాల వయస్సులో తన భర్త, అతని తల్లి మరణించిన తరువాత పూర్తి సమయం రైతుగా మారింది. ఆమె అత్తగారు ఆమెను మిల్లెట్ నెట్‌వర్క్‌లో ప్రవేశపెట్టింది. సేంద్రీయంగా చిరుధాన్యాలను పండించడంలో ఆమె సాధించిన విజయంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నెట్‌వర్క్ తెగులు నియంత్రణ, వెర్మికంపోస్ట్, ఎరువు, పంచగవ్య సేంద్రీయ వినియోగంపై సలహాలను అందిస్తుంది. 2019లో యునెస్కో నుండి ఈక్వేటర్ అవార్డును అందుకోవడానికి ఆమె న్యూయార్క్ వెళ్ళింది.[9]

మూలాలు

[మార్చు]
  1. "Millet Network of India's success story - The Hindu". web.archive.org. 2024-06-22. Archived from the original on 2024-06-22. Retrieved 2024-06-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 "Top 5 Millet-Specific Organizations in India". krishijagran.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-01-30. Retrieved 2024-06-22.
  3. "ఇడ్లీ దోసె బర్గర్‌ పిజ్జా... అన్నీ చిరుధాన్యాలతోనే". ఈనాడు. Archived from the original on 2024-02-03. Retrieved 2024-06-22.
  4. 4.0 4.1 Nagaland, Anne Pinto-Rodrigues in (2020-02-25). "Against the grain: why millet is making a comeback in rural India". the Guardian (in ఇంగ్లీష్). Retrieved 2021-02-21.
  5. Kurmanath, K. V. (16 September 2016). "Millet Network launches national campaign to include grain in PDS". @businessline (in ఇంగ్లీష్). Retrieved 2021-02-21.
  6. PIB India (8 March 2018). "Nari Shatki Puraskar citation". PIB India via Twitter. Retrieved 21 February 2021.
  7. "Millet Network of India's success story". The Hindu (in Indian English). 2018-03-10. ISSN 0971-751X. Retrieved 2021-02-21.
  8. "International Women's Day: President Kovind honours 39 achievers with 'Nari Shakti Puraskar'". The New Indian Express. 2018-03-09. Retrieved 2018-04-04.
  9. Roy, Subir (14 November 2019). "How millet farming empowers women". @businessline (in ఇంగ్లీష్). Retrieved 2021-02-21.