Jump to content

మిరాసి

వికీపీడియా నుండి

Marasi
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
• India • Pakistan
భాషలు
UrduPunjabiRajasthani
మతం
IslamSikhismHinduism
సంబంధిత జాతి సమూహాలు
NaqqalShaikh

అనేక వర్గాలకు చెందిన వంశావళి సాంప్రదాయ గాయకులు, నృత్యకారులను మిరాసి (సస్సాల్డ్: مراثی)లు అంటారు. "మిరాసి" అనే పదం అరబికు పదం (ميراث) మిరాస్ నుండి ఉద్భవించింది. దీని అర్థం వారసత్వం.

చరిత్ర, పూర్వీకత

[మార్చు]

ఉత్తర భారతదేశంలో

[మార్చు]

హిందూ కుల వ్యవస్థలో కొన్ని మిరాసి సమూహాలు 'తక్కువ కులం'కి చెందినవిగా భావించబడ్డారు. వారు ముస్లిం మతానికి చెందిన వారుగా అంగీకరించబడ్డారు. 13 వ శతాబ్దంలో సూఫీ కవి అమీరు ఖుస్రో ఆధ్వర్యంలో మిరాసీలు ఇస్లాం మతంలో చేరడానికి అంగీకరించారని భావిస్తున్నారు. మిరాసి అనే పదం అరబికు పదం మిరాస్ (ميراث) నుండి వచ్చింది. దీని అర్థం వారసత్వం, సంప్రదాయ వారసత్వం.[1] ఉత్తర భారత మిరాసీలను ఐదు ప్రధాన ఉప సమూహాలుగా విభజించారు: అబ్బాలు, పోస్లా, బెటు, కట్టు, కాలేటు.[2]ఆచారాలలో వారు మరొక సమాజమైన ముస్లిం రాయభటు మాదిరిగానే ఉంటారు. మిరాసికి సంబంధించిన కింగ్హారియాలు ఒకప్పుడు సంగీతకారులు, వినోదకారులుగా పనిచేసేవారు.[3]

వారు కంజీరా వాయిద్యం వాయిస్తూ పఖ్వాజులో పాల్గొంటారు కనుక వారిని పఖ్వాజీ అని కూడా పిలుస్తారు. మిరసీలను వారి పోషకుల వంశపరంపర్యంగా పోషించారు. మిరాసీలు తరచూ వివాహాల చర్చలలో కూడా పాల్గొంటారు. వంశావళి శాస్త్రకారులుగా ఉండే మిరాసిని నాసాబు ఖ్వాను (కుటుంబ వృక్షం నిర్వాహకులు) అని కూడా పిలుస్తారు.[1] [4] ఉత్తర భారతదేశం అంతటా మిరాసీలు కనిపిస్తారు. సాంప్రదాయకంగా మిరాసీలు తరచుగా వివాహాలలో బల్లాడు గాయకులుగా పాడేవారు. వారిని వారు కాగితపు పువ్వుల తయారీతో సమాజంతో అనుసంధానం చేసుకున్నారు. మిరాసీలు పంజాబు గ్రామీణ ప్రాంతంలో ఉత్సవాలలో మిరాసీలు ప్రదర్శనలు ఇవ్వడం చూడవచ్చు. ప్రస్తుతం పట్టణాల సరిహద్దులలో పట్టణ సమాజంగా చాలా మంది మిరాసీలు కూలీ కార్మికులుగా పనిచేస్తున్నారు. కొంతమంది మిరాసీలు పంజాబు నుండి పొరుగు రాజ్యాలకు వలస వచ్చారు: రాజస్థాను, బీహారు, గుజరాతు, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశు.[3]

ఉత్తర ప్రదేశ్

[మార్చు]

పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లోని మిరాసీ సమాజంలో సమైఖ్యత ఉంది. ఇది ప్రధానంగా మీరటు, ముజఫరు నగరు, బులంద్షహరు జిల్లాల్లో కనిపిస్తుంది. చారిత్రాత్మకంగా మిరాసి రెబారి వర్గానికి చెందిన వంశావళి శాస్త్రకారులు పనిచేసేవారు. వారు రాజస్థాను నుండి రెబారీలతో ఉత్తరప్రదేస్‌కు వచ్చారు. వారికి " ముఖియా " అనే సాంప్రదాయ కుల మండలి ఉంది. సమాజ నియమాలను ఉల్లంఘించేవారిని శిక్షించడం, వివాదాలను పరిష్కరించడం, అనైతిక కార్యకలాపాలను నిరోధించడం వంటి కార్యక్రమాలను కులమండలి నిర్వహిస్తుంది. వారు సున్నీ ముస్లింలు అయినప్పటికీ సిక్కు గురువులను, హిందూ దేవుళ్ళను కూడా ఆరాధిస్తారు. మిరాసీలు ప్రామాణిక ఉర్దూ మాట్లాడేవారు అయినప్పటికీ చాలా మంది హిందీ భాష సంబంధిత వివిధ మాండలికాలను మాట్లాడగలరు. లక్నోకు చెందిన నక్వలు ప్రజలు ఉత్తర ప్రదేశు మిరాసీలను ముఖ్యమైన ఉప సమూహంగా భావిస్తున్నారు.[5]

బీహారు

[మార్చు]

16 వ శతాబ్దంలో మిరాసీలు ఉత్తర ప్రదేశు నుండి బీహారుకు వచ్చినట్లు పేర్కొనబడింది. బీహారులోని మిరాసీలలో చాలా మంది జమీందార్ల ఆస్థానంలో సంగీతకారులు ఉన్నారు. జమీందారీ వ్యవస్థను రద్దు చేయడంతో మిరాసీలు వ్యవసాయ వృత్తిని స్వీకరించారు. వివాహాలు, అంత్యక్రియలు వంటి ప్రత్యేక సందర్భాలలో పాటలు పాడటానికి కొంతమందిని ఇప్పటికీ వీరిని పిలుస్తారు. ప్రస్తుతం చాలా మంది మిరాసీలు షియా, మొహరం ఉత్సవాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వీరు ప్రధానంగా భాగల్పూరు, భోజ్పూరు, గయా, ముంగేరు, నలంద, పాట్నా జిల్లాలలో కనిపిస్తారు. మిరాసీ తమలో తాము మగధీ భాషలో సంభాషిస్తారు. అలాగే బయటి వ్యక్తులతో ఉర్దూలో సంభాషిస్తారు. ఇతర మిరాసి వర్గాల మాదిరిగా కాకుండా బీహారు మిరాసి ఎప్పుడూ వంశావళి శాస్త్రవేత్తలుగా పనిచేయలేదు. పమారియా సమాజం బీహారు మిరాసి ప్రధాన ఉపవిభాగంగా ఉన్నారు.[6]

ఢిల్లీ

[మార్చు]

ఢిల్లీలోని మిరాసి సంతతి తాము కులీనులమని (ఉత్తమ కులానికి చెందిన వారు) పేర్కొన్నారు. వీరు ఇక్కడ సీలాంపూరు, షాహదారా, బవానా, నరేలా ప్రాంతాలలో కనిపిస్తారు. వారికి ఖాను, బొబ్లా, పోస్లా, మల్లికు అనే ఇంటిపేర్లు ఉన్నాయి. ఢిల్లీ మిరాసీ గాయకులు, సంగీతకారులు, ఢిల్లీలోని మొఘలు రాజసభతో సంబంధం కలిగి ఉన్నారు. చాలా మంది మిరాసి ఖండన్లు (కుటుంబాలు) చక్రవర్తుల ఆస్థానంలో గొప్ప ఖ్యాతిని పొందారు. మరికొందరు నిజాముద్దీను వంటి వివిధ సూఫీ పుణ్యక్షేత్రాలలో భక్తి గాయకులు (కవ్వాలులు)గా ఉన్నారు. కొందరు రాగ్ని, సాంగి వంటి గాయకులుగా ఉండేవారు. స్వాతంత్ర్య పొందిన సమయంలో ఢిల్లీలోని ముస్లిం వర్గాలు చాలా మంది సభ్యులు పాకిస్తానుకు వలస వెళ్ళారు. ప్రస్తుతం చాలామంది మిరాసీలు కూరగాయలు అమ్మడం, గొడుగులను మరమ్మత్తు చేయడం వంటి చిన్న వ్యాపారాలలో పాల్గొంటున్నారు.[7]

రాజస్థాను

[మార్చు]

రాజస్థానుకు చెందిన మిరాసీలి బికానెరు, జోధ్పూరు, నాగౌరు, చిత్తోరుగడు, అజ్మీరు, హనుమానుగడు, శ్రీగంగనగరు, చురు, సికారు, జైసల్మేరు జిల్లాలలో కనిపిస్తారు. వారు 8 శతాబ్దాల క్రితం ఇస్లాం మతంలోకి మారినట్లు భావిస్తున్నారు. వాస్తవానికి వారు హిందూ ధాడీ కులానికి చెందినవారు. మిరాసీలో సిన్వాలు, మాలియా, బాగర్వా, ఫోగా, చుమాడు, ధావ్సీ, చుంకరు, బవారా అనే గోత్రాలు ఉన్నాయి. వారు పాడటం, వివాహాలలో డ్రంలు వాయించడం వంటి సాంప్రదాయ వృత్తులు కలిగి ఉన్నారు. చాలామంది ఇప్పుడు కౌలు రైతులుగా ఉన్నారు. వారు రాజస్థానీ బికనేరి మాండలికం మాట్లాడతారు.[8]

హర్యానా

[మార్చు]

హర్యానాకు చెందిన మిరాసీలను డోం అని కూడా పిలుస్తారు. కాని ఈ డోం కులానికి ముస్లింల పోస్లా (వేగ్వా)తో సంబంధం లేదు. వీరు రాజసభలో సేవలుచేసిన కారణంగా చాలా గౌరవప్రదంగా భావించబడ్డారు. కాని కొంతకాలం వారు సంగీతకారులు లేదా హిందూ కులాల డోంలుగా భావించబడ్డారు. వారు ప్రధానంగా మేవాటు, రోహ్తకు, ఫరీదాబాదు, హిస్సారు, కర్నాలు, కురుక్షేత్ర, సోనేపటు, మహేందర్గడు జిల్లాలలో కనిపిస్తారు. ఈ సమాజం హర్యన్వి భాషలో సంభాషిస్తారు. చాలామంది ఉర్దూ కూడా మాట్లాడగలరు. వారు ప్రధానంగా భూమిలేని సమాజంగా సాంప్రదాయకంగా గాయకులు, వినోదకారులుగా, అలాగే జాటు కమ్యూనిటీ వంశావళి శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది వారి సాంప్రదాయ వృత్తిని విడిచిపెట్టి కూలీ కార్మికులుగా పనిచేస్తున్నారు. వారు చాలా అట్టడుగు సమాజానికి చెందినవారుగా భావించబడుతున్నారు. ఈ సంఘం ఎండోగామసు భూస్వామ్యాన్ని ఆచరిస్తూ అనేక వంశాలను కలిగి ఉంటుంది. వీరిలో భటు, బోర్డా, సాన్పు, నింబా, పోస్లా, సియోలు ప్రధానమైనవిగా ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి సమాన స్థితి కలిగి వివాహ సంబంధాలతో అనుసంధానితమై ఉంది.[9]

పంజాబు మిరాసీలు

[మార్చు]

పంజాబులోని మిరాసీలలో ముస్లిం, హిందూ, సిక్కులు ఉన్నారు. ఈ సంఘాన్ని బాల్మికి, డోం, ముస్లిం మిరాసి అనే మూడు బృందాలుగా విభజించారు. బాల్మికి మిరాసీలలో అనేక గోత్రాలు ఉన్నాయి. స్వగోత్రంలో వివాహం నిషేధించబడింది. ముస్లిం మిరాసీలలో దగ్గరి బంధువుల మధ్య వివాహసంబంధాలు ఉంటాయి. పంజాబు మిరాసీలు ఒక పంజాబీ మాట్లాడే సంఘంగా ఉన్నప్పటికీ చాలా మంది ఉర్దూలో సంభాషించి, అర్థం చేసుకుంటారు. అందులో అనేక ఉప సమూహాలు ఉంటాయి. వాటిలో రాయి మిరాసి, మీరు మిరాసి, రబాబిసు, కామాచిసు, దాది, కుమాచి, కులావంతు, మీరు మాంగు ప్రధానమైనవిగా ఉన్నాయి. దాదీలలో రబాబీ సిక్కులు, ఇతర సమూహాలు హిందూ, ముస్లింలు. వారు చాలా మంది జానపద గాయకులను తయారు చేశారు. పశ్చిమ పంజాబులోని వారి సహచరుల మాదిరిగా కాకుండా వీరిలో ఎక్కువ మంది ఇప్పటికీ వారి సాంప్రదాయ వృత్తిలో పాలుపంచుకున్నారు.[10]

ప్రధాన ఉపసమూహాలు

[మార్చు]

రాయి మిరాసీలలోని రాయ్ భటు కులానికి చెందిన ప్రజలు వారికుల్లాన్ని మార్చుకుని వారికి వారు బ్రాహ్మణులు అని చెప్పుకుంటున్నారు. వారి మతమార్పిడి తరువాత వారు " కబిట్లను" కూర్చి పఠించడం కొనసాగించారు. ఈ సమాజానికి చెందిన సమాజం ఖచ్చితంగా కులాంతరవివాహ విధానం అనుసరిస్తారు.

లూధియానా నగరంలోని మిరాసీలు సంపన్న నివాసులుగా ఉన్నారు. కనుక వారిని మీరు మిరాసీలు అని అంటారు. వారు అనేక గ్రామాల మీద ఆధిపత్యం కలిగి ఉన్నారు. వారి ఉపవిభాగంలోని ధాదీ సిక్కులు వంశపారంపర్యంగా సిక్కు వీరులను స్తుతించడం ప్రధానవృత్తిగా ఎంచుకుంటారు.[1]

కుమాచి మిరాసి బ్రాహ్మణ సమాజంగా ఉంది. వారు బ్రాహ్మణ సంప్రదాయాలను ఆచరిస్తారు. వారు బ్రాహ్మణుల వంశావళి నిర్వాహకులుగా ఉండాలన్న షరతుతో ఇస్లాం మతంలోకి మారారు.

రబాబీ మిరాసీలు రబాబు అని పిలువబడే సంగీత వాయిద్యం వాయించారు. గురు నానకుకు తోడుగా రబాబు వాయిద్యం వాయించిన మిరాసి భాయి మర్దానాను వారి పూర్వీకుడిగా గుర్తిస్తూ వారు తమకుతాముగా మిరాసీ భాయి సంతతికి చెందినవారిగా పేర్కొన్నారు.

పోస్లా ముస్లిం మిరాసీలలో ఘోరియను, ఖారియా, మల్హారు, గుర్బలు లేదా వేగ్వా అనే నాలుగు ఉపవిభాగాలు ఉన్నాయి. సయ్యదాసు అరబికు పోస్లా వంశపారంపర్య వంశావళి నిర్వాహకులు కొనసాగుతున్నారు. వేగ్వా పోస్లాకు సంబంధించినదిగా ఉంది. పోస్లాలలో కూడా నృత్యకారిణులు ఉన్నారు. వారు వారిని బిచ్చగాళ్ళుగా విడిచిపెట్టారు. వారు అక్కడ వారి అరబికు గతవైభవాన్ని కోల్పోయి చిన్న ఉద్యోగాలను స్వీకరించారు.

లుధియానాలో ప్రధానంగా నక్వలు మిరాసీలను అనుకరించే సంఘాలు కనుగొనబడ్డాయి. వారు మొఘలు చక్రవర్తుల రాజసభతో సంబంధం కలిగి ఉన్నారు. రాజసభలలో వారు వినోదం అందించే విదూషకులుగా పనిచేశారు. ఈ సంఘంలోని ప్రజలు ఖచ్చితంగా కులాంతర్గత వివాహసంబంధ విధానాలు అనుసరిస్తున్నారు. వీరిలో దగ్గరి బంధువుల వివాహం అనుమతించబడుతుంది.

ఇతర ఉప సమూహాలలో కులావంతు, రాజపుత్రుల వంశావళి నిర్వాహకులు, మీరు మాంగు (యాచకుల సమాజంగా ఉన్నారు), నఖారా, నకిబు, మీర్జాడా అని పిలువబడే సంగీత వాయిద్యం వాయించిన నకార్చి సమూహాలు ప్రాధాన్యత వహిస్తున్నాయి.[10]

పాకిస్థానీ పంజాబు మిరాసీలు

[మార్చు]

పాకిస్థానీ మీరాసీలలో ఒక సంఘం ఆశురా కార్యకలాపాలలో నోహాల(మెర్సయ)ను పఠిస్తారు. వారు వినోదకారులుగా (విదూషకులు) ఉంటూ దేశానికి అనేక మంది గాయకులను రంగస్థల కళాకారులను అందించారు. ప్రస్తుతం చాలా మంది మిరాసీలు ద్విభాషా (ఉర్దూ, పంజాబీ)సంభషణా సామర్ధ్యం కలిగి ఉన్నారు. వీరు పంజాబు అంతటా కనిపిస్తారు. వారికి చాలా గ్రామాలలో వారు స్థావరాలు ఉన్నాయి. [11] ప్రస్తుతం ఉత్తర, మధ్య పంజాబులోని 'మిరాసీలు' తమను 'ఖాన్సు' అని పేర్కొంటారు.[12]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Taralocana Siṅgha Randhāwā (జనవరి 1996). The Last Wanderers: Nomads and Gypsies of India. Mapin Pub. p. 166. ISBN 978-0-944142-35-6.
  2. A Hasan & J C Das page 973
  3. 3.0 3.1 People of India Uttar Pradesh Volume XLII Part Two edited by A Hasan & J C Das page 973
  4. Mirasi at page 142 in The last wanderers : nomads and gypsies of India ISBN 0-944142-35-4
  5. People of India Uttar Pradesh Volume XLII Part Two edited by A Hasan & J C Das page 974
  6. People of India Bihar Volume XVI Part Two edited by S Gopal & Hetukar Jha pages 683 to 685 Seagull Books
  7. People of India Delhi Volume XX edited by T. K Ghosh & S Nath pages 475 to 477 Manohar Publications
  8. People of India Rajasthan Volume XXXVIII Part Two edited by B.K Lavania, D. K Samanta, S K Mandal & N.N Vyas pages 657 to 659 Popular Prakashan
  9. People of India Haryana Volume XXIII Part edited by M.L Sharma and A.K Bhatia page 159 to 161 Manohar
  10. 10.0 10.1 People of India Punjab Volume XXXVII edited by I.J.S Bansal and Swaran Singh pages 322 to 333 Manohar
  11. Fouzia Saeed (2002). Taboo!: The Hidden Culture of a Red Light Area. Oxford University Press. ISBN 978-0-19-579796-1.
  12. Dr M Riyasat Husain 'Caste and clan in Northern and Central Punjab and some patterns of shift: An analysis' in Journal of South Asian Study Vol 2, No 8, 1992, Lahore, pp 21-46
"https://te.wikipedia.org/w/index.php?title=మిరాసి&oldid=3069769" నుండి వెలికితీశారు