Jump to content

మిమిక్ ఆక్టోపస్

వికీపీడియా నుండి

మిమిక్ ఆక్టోపస్
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Subfamily:
Genus:
Thaumoctopus

Species:
T. mimicus
Binomial name
Thaumoctopus mimicus

మికిక్ ఆక్టోపస్ అనేది పరిసరాలకు అనుగుణంగా రంగులు, ఆకారాలు మార్చుకొనే ఒక ప్రత్యేక ఆక్టోపస్. యిది సముద్రపు జీవులలో ఒక వెవిధ్యతను ప్రదర్శిస్తుంది.చాలా ఆక్టోపస్ లు వాటి పరిసరాలకు అనుగుణంగా శరీర రంగును మార్చుకొని, టెక్ట్చర్ ను వివిధరాకాలుగా మార్చి శతృవులనుండి రక్షించుకుంటాయి.ఈ రంగులను మార్చుటకు వాటిలో గల క్రోమిటోపోర్లు సహాయపడతాయి. కానీ ఈ మిమిక్ ఆక్టోపస్ కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దాని శారీరాన్ని వివిధ రకాలుగా వివిధ జీవులలాగ మార్చుకుంటుంది. మిమిక్ ఆక్టోపస్ ఆక్టోపస్ జాతులలో తెలివైనది. ఇది 15 రకాల జీవులలాగ వెను వెంటనే ఆకారాన్ని మలుచుకోగలదు. రాళ్ళలాగ, కోరల్స్ లాగ, కొన్ని జీవులలాగ యిలా వివిధరకాలుగా కనిపించి శతృవుల బారినుండి రక్షించుకుంటుంది. [1] మిమిక్ ఆక్టోపస్ సముద్రం లో గల జలచరాలలో వివిధ రకాల జంతువుల ప్రవర్తనను ప్రవర్తించే ఏకైన జలచరం. తన శతృ జంతువును బట్టి వేరొక జంతు ఆకారాన్ని యేర్పరచుకొని దానిబారినుండి రక్షించుకోగలదు. ఉదాహరణకు రెండంగుళాల పొడవు, పెన్సిలంత పొడవు గల ఏదైనా జల చరం తరిమితే ఈ ఆక్టోపస్ ఆ జలచరం శతృవైన జలచరం వేషం మారుస్తుంది. వెంటనే అది పరుగో పరుగు...[2]

దీని అవరతారాల విషయం కొస్తే లయన్ ఫిష్, ప్లాట్ ఫిష్, జెల్లీ ఫిష్,సీ స్నేక్, సాండ్ అనిమోస్,స్ట్రింగ్ రే, మాంటిన్ స్ట్ంవ్,బ్రిటన్ స్టార్స్, సీ షెల్,జెయింట్ క్రాబ్, ఫ్లౌండర్... యిలా రకరకాల జలచరాల రూపాలకు మారగలదు.

ఉనికి

[మార్చు]

ఈ ఆక్టోపస్ ను మొదట సులవేసి ,ఇండోనేషియా తీర ప్రాంతంలో కొంతమంది వైజ్ఞానికుల బృందం 1990 లలో కనుగొన్నది. ఈ జీవులు ఇండోనేషియా ద్వీపం తీరప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఇవి లిజర్డ్ ద్వీపం సమీప తీర ప్రాంతాల్లో యిసుక నేలలలో కూడా అతి తక్కువ కెరటాలు వచ్చునపుడు జూలై 4, 2012 న గుర్తించారు[1].

ఆకారము

[మార్చు]

ఈ జీవి ఆక్టోపస్ మాదిరిగానే ఉంటుంది. ఇది సుమారు 60 సెం.మీ పొడవు(సుమారు 2 అడుగులు), వాటి టెంటకిల్స్ 25 అంగుళాల పొడవు వరకు ఉంటాయి. ఈ టెంటకిల్స్ వ్యాసం సుమారు పెన్సిల్ వలె ఉంటుంది. ఈ ఆక్టోపస్ యొక్క రంగు లేత బ్రౌన్ రంగు లో ఉంటుంది. కొన్ని సందర్భాలలో యివి తెలుపు చారలు కలిగి బ్రౌన్ రంగులో కనిపిస్తాయి. యివి విషపూరితమైనవి[1].

ప్రవర్తన

[మార్చు]

ఇవి యిసుకలో ఉన్న చిన్న చేపలు,ఎండ్రకాయలు, కీటకాలు వంటి వాటిని ఆహారంగా తీసుకొంటాయి. వీటిని శోధించుటలో భాగంగా వాటి ఫన్నెల్ ద్వారా నీటిని యిసుకలోకి పంపిస్తాయి. యివి యితర జీవుల లాగ అనుకరించే నైపుణ్యం కలిగి ఉంటాయి. ఉదాహరణకు యివి స్పష్టంగా కనబడే సహచర జీవుల వద్ద ఎండ్రిలా అనుకరిస్తాయి.ఎందుకంటే వాటివల్ల ప్రమాదం సంభవిస్తుంది అనిపించేటప్పుడు వాటికి శతృవైన జీవిగా మారాలి కనుక.

Mimic octopus showing a variant pattern

మిమిక్ ఆక్టోపస్ యొక్క ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. మిమిక్రీ అనునది ప్రకృతిలో సాధారణంగా గల కళ. కొన్ని ఈగలు నలుపు, పసుపు చారలు గల తేనెటీగలుగా తన శతృవుల నుండి రక్షించుకొనుటకు మారుతాయి. కానీ ఈ మిమిక్ ఆక్టోపస్ మాత్రం 15 రకాలుగా మారగల మొదటి జీవి[3].మిమిక్ ఆక్టోపస్ అనునది తన ప్రవర్తనలను కూడా మార్చుకోగల మొదటి జీవి.యిది ఎన్ని రకాల జీవులుగా అనుకరించగలదో యింతవరకు పూర్తిగా తెలియదు. కానీ అది అనుకరణ చేసే జీవులలో చాలా జీవులు విషపూరితమైనవి. యిది తన టెంటకిల్స్ ను తగు విధంగా మార్పులు చేసి వివిధరకాలుగా శరీరాకృతిని మార్చగలుగుతుంది. ఉదాహరణకు.

  • లైన్ ఫిష్
  • సముద్ర పాము (సీ స్నేక్)
  • ప్లాట్ ఫిష్
  • జెల్లీ ఫిష్
  • శాండ్ అనిమోస్
  • స్ట్రింగ్ రే
  • మాంటిస్ ష్ట్రింవ్
  • బ్రిటిల్ స్టార్స్
  • సీ షెల్
  • జెయింట్ క్రాబ్
  • ప్లౌండర్

గమనించే ప్రవర్తన

[మార్చు]
ఆక్టోపస్ వివిధ రూపాల

ఇండోనేషియా ద్వీపం తీర ప్రాంతాలలో 13 రకాల జాతుల మిమిక్ ఆక్టోపస్ లను యితర సముద్ర జీవుల ఆకారాలలో గుర్తించారు. అవి స్థానిక అనుకరణను అనుసరించి విస్తారంగా కదులుటను గమనించారు. వీటిలో 500 భాగాలను విశ్లెషించారు. అన్ని అక్టోపస్ భాగాలు వాటి ఆకారం, ఈదే కదలికలు, వేగం, కాలం, కొన్ని సందర్భాలలో రంగులను వెదజల్లుట వంటి అనుకరణలను గుర్తించారు.వేగంగా కదిలే అనుకరణ లో అవి స్పష్టంగా ,చురుకుగా కదిలి ఒకేసారి అవి కదలిక లేకుండా స్థిరంగా ఉండిపోతాయి. కదలిక లేకుండా ఉన్న సమయంలో ఆక్టోపస్ తన శరీర ఆకృతిని వివిధ రకాలుగా సర్దుకొని చిన్న స్పాంజ్ లుగా, ట్యూబ్ వార్ం లుగా, కొలోనియన్ టునికేట్స్ గా మార్చుకుంటాయి.ఆక్టోపస్ లు తమను శతృవుల నుండి రక్షించుకొనుటకు ప్రాధమికంగా ఈ అనుకరణను ఉపయోగిస్తాయి[4].

ఆహారపు అలవాట్లు

[మార్చు]

మిమిక్ ఆక్టోపస్ ఆహారం కోసం వెదికే జీవి లేదా వేటాడే జీవి. శాస్త్రవేత్తలు ఈ ఆక్టోపస్ చిన్న సముద్ర జీవులు అయిన స్టాల్క్ ప్రె, చిన్న చేపలను వేటాడుటను గమనించారు. దీనిని బట్టి యివి వేటాడే జంతువులుగా నిర్థారిచవచ్చు. కొన్ని సందర్భాలలో ఈ ఆక్టోపస్ ఆహారాన్ని వెదికే జంతువుగా కనిపిస్తుంది. యిది నీటి జెట్ ను యిసుకలో వెదజల్లి యిసుకలో గల సముద్ర జీవి "ప్రే" ను తన టెంటికల్స్ ద్వారా శోధన చేస్తుంది. యివి కోరల్స్, యిసుకలో గల రంధ్రాలు వంటి వాటిలో గల చిన్న చిన్న జీవులను వెదికి ఆహారంగా తీదుకుంటాయి.

ఈ ఆక్టోపస్ లను మొదటిసారిగా దక్షిణ ఆసియా సముద్రాలలో గల సులవేశి లో 1998 లో కనుగొన్నారు[5]. 2010 లో వీటిని "గ్రేట్ బారియర్ రీఫ్" లో కనుగొన్నారు.

ఈ మిమిక్ ఆక్టోపస్ తన పరిస్థితులకు అనుగుణంగా తన రూపాన్ని మార్చుకుంటుంది. ఉదాహరణకు "డామ్‌సెల్ ఫిష్" నుండి రక్షించుకొనుటకు అది నలుపు,పసుపు రంగులో గల సీ స్నేక్ గా మారుతుంది. అపుడు "డామ్‌సెల్ ఫిష్" బెదిరిపోయి పారిపోతుంది[6]. ఈ మిమిక్ ఆక్టోపస్ స్థిరంగా ఉన్న తెలుపు చారలు ఉన్నందువల్ల వండెర్‌పస్ ఆక్టోపస్ తో విభేదిస్తాయి[7][8].

అలవాట్లు

[మార్చు]
Mimic octopus showing typical pattern

ఈ మిమిక్ ఆక్టోపస్ లు ఇండోనేషియా సముద్ర అఖాతాలలో ఉంటాయి. ఇవి సముద్ర ఉష్ణ జలాలలో సుమారు 15 మీటర్ల లోతులో ఉంటాయి. యివి తడిగా, బురదగా ఉన్న సముద్ర నేలలో ఉండుటకు యిష్టపడతాయి. యివి ఈ బురద లో ఉండటం వల్ల వాటి రంగును బ్రౌన్ రంగు లోకి మార్చుకొని అందులో కలిసిపోగలవు.

సూచికలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Maculay, G. (2012, January 6). Mimic Octopus Creature Feature - Diving with Mimics. Dive The World - Scuba Diving Vacations - Dive Travel - Diving Holidays - Liveaboards. Retrieved April 21, 2013, from http://www.dive-the-world.com/creatures-mimic-octopus.php
  2. Harmon, K. (2013, February 21). Mimic Octopus Makes Home on Great Barrier Reef. Scientific American. Retrieved April 20, 2013, from http://blogs.scientificamerican.com/octopus-chronicles/2013/03/21/mimic-octopus-makes-home-on-great-barrier-reef/
  3. "Mimic Octopuses, Thaumoctopus mimicus ~ MarineBio.org." MarineBio Conservation Society, 14 Jan. 2013. Web. Wednesday, May 01, 2013. <http://marinebio.org/species.asp?id=260 Archived 2017-07-18 at the Wayback Machine>.
  4. HANLON, R. T., CONROY, L.-A. and FORSYTHE, J. W. (2008), Mimicry and foraging behaviour of two tropical sand-flat octopus species off North Sulawesi, Indonesia. Biological Journal of the Linnean Society, 93: 23–38. doi: 10.1111/j.1095-8312.2007.00948.x
  5. Piper, Ross (2007), Extraordinary Animals: An Encyclopedia of Curious and Unusual Animals, Greenwood Press. ISBN 978-0313339226
  6. National Geographic: Newfound Octopus Impersonates Fish, Snakes. 9 September 2001.
  7. Hochberg, F.G., M.D. Norman & J. Finn 2006. Wunderpus photogenicus n. gen. and sp., a new octopus from the shallow waters of the Indo-Malayan Archipelago (Cephalopoda: Octopodidae). PDF (805 KiB) Molluscan Research 26(3): 128–140.
  8. Norman, Mark (2000). Cephalopods: A World Guide. Hackenheim, Germany: ConchBooks. pp. 302–304. ISBN 3-925919-32-5.

గ్రంథములు

[మార్చు]