Jump to content

మిమిక్రీ శ్రీనివాస్ (శ్రీకాకుళం)

వికీపీడియా నుండి

ఇదే పేరుతో మిమిక్రీ శ్రీనివాస్ కూడా ఉన్నారు చూడండి.

మిమిక్రీ శ్రీనివాస్ (వేదుల ప్రభాకర శ్రీనివాస్,వి.పి.శ్రీనివాస్ ) వ్యక్తి. శ్రీకాకుళం నకు చెందిన మిమిక్రీ, వెంట్రిలాక్విజం కళాకారుడు. ఉత్తరాంధ్రలో ఈ కళలో రాణించి, సుమారు రెండు వేల ప్రదర్శనలిచ్చి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఈయన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడైనలోకనాథం నందికేశ్వరరావు శిష్యుడు.

బాల్యం-విద్యాభ్యాసం

[మార్చు]

శ్రీ వేదుల సీతారామమూర్తి,శ్రీమతి మధుకెశ్వేరమ్మ దంపతులకు నవమ గర్భముక్తాఫలం చిరంజీవి వేదుల ప్రభాకర శ్రీనివాస్,బి.ఎ పట్టబద్రుడు. ఈయన 1982 లో ముఖానికి రంగు పూసుకొని " మిమిక్రీ కళా రంగంలోకి ప్రవేశించారు.అప్పటి నుంది మిమిక్రీ కళాకారునిగా ఎదగాలని ఆయన మదిలో మెదిలింది. శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారిని స్ఫూర్తిగా తీసుకొన్న ఆయన గురువు లేని విద్య రాణించదనె సంకల్పంతో ప్రముఖ కళాకారులైన శ్రీ లోకనాథం నందికేశ్వరరావు గారి వద్ద శిష్యరికం చేసి మిమిక్రీ కళలో ఎన్నో మెళుకువలు తెలుసుకొని గురువుకు తగ్గ శిష్యునిగా రాణిస్తూ 1984 నుంది 1994 వరకు ఒక దశాబ్ద కాలం ప్రఖ్యాత బ్యాండు పార్టీ నిర్వహకుడు అయిన శ్రీ చింతలపూడి నర్శింహులు గారి వద్ద వ్యాఖ్యాతగా పనిచెసారు. ప్రముఖ నటుడు విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారకరామారావు గారు ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో 1988 లో విజయవాడలో ఆయన యెదుట వారి గొంతును అనుకరించి ప్రశంసలు పొందారు. ఇక వెంట్రిలాక్విజం (మాట్లాడే బొమ్మ) ప్రక్రియకు ప్రేరణ "ఇది కథ కాదు" చిత్రంలోని కమలహాసన్ పాత్ర. ఆ ప్రక్రియకు ఆకర్షితుడై 1992 లో ముంబయి నుండి బొమ్మ తెప్పించుకొని తన గురువు నందికేశ్వర రావు వద్ద పెదవులు కదపకుండా బొమ్మ మాట్లాడుతుందనె భ్రమ కలిగించే ఎన్నో మెళుకువలు నేర్చుకున్నారు. 1998 నాటికి 1000 ప్రదర్శనలిచ్చి సహస్ర గళార్చన పూర్తి చేసారు. 1999 లో ఎన్.టి.ఆర్ ఉన్నత పాఠశాల, తిలక్ హాలలో 12 గంటల ప్రదర్శన, 2002 మార్చి 12,13 తేదీలలో బాపూజీ కళామందిర్ శ్రీకాకుళంలో 25 గంటలు ఏకబిగిన ప్రదర్శననిచ్చి ఆబాలగోపాలం అందరి ప్రశంసలకు పాత్రులైనారు. దేశం నలు మూలల్లో వీరి ప్రదర్శనలు జరిగాయి.భారతదేశంలో ప్రముఖ పట్టణాలైన ఢిల్లీ, ముంబయి,కలకత్తా,బళ్ళారి,కొచ్చిన్,భువనేశ్వర్,కటక్,బరంపురం,పర్లాఖిముడి,సూరత్,బరోడా,అహ్మదాబాద్, ఖర్గపూర్,రాయపూర్,రాయిఘర్,సింధునూర్,బాల్కో,పూనే,నాగపూర్,వంటి ప్రదేశాలలో ప్రవాసాంధ్రుల సంఘాలలో ప్రదర్శనలిచ్చి తెలుగువారి పురస్కారాలు ఎన్నో పొంది ఉన్నారు. 2006 నవంబరు 17 న దుబాయిలో యిచ్చిన ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయికి వీరి విజయ ప్రస్థానం ప్రారంభించబడింది. 13 దేశాలలో తన ప్రదర్శనను ప్రదర్శించి తెలుగు వారి గౌరవాన్ని యినుమడింప జేసారు.యిలా వీరి విజయ ప్రస్థానంలో 30 సంవత్సరములు పూర్తి చెసుకున్న సందర్భంగా శ్రీకాకుళం గర్వించ దగ్గ కళాకారునిగా వీరిని సత్కరించటం కనీస బాధ్యతగా భావించి "చిల్డ్రన్ లాఫింగ్ క్లబ్" ఆద్వర్యంలో తే.07.10.2012 ది. న జిల్లావాసులు స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో ఘనంగా సత్కరించారు.

అవార్డులు,పురస్కారాలు,సత్కారాలు

[మార్చు]
  • 1999 అక్టోబరు 2 లో అవిశ్రాంతంగా 12 గంటల వెంట్రిలాక్విజం షో నిర్వహించి రికార్డు సాధించారు.
  • మార్చి 2002 లో శ్రీకాకుళం బాపూజీ కళామందిర్ లో 25 గంటలు అవిశ్రాంతంగా మిమిక్రీ,వెంట్రిలాక్విజం చేసి ప్రపంచ రికార్డు సాధించారు.
  • 2003 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ మంత్రి శ్రీ జె.ఆర్.పుష్పరాజ్ చే సత్కరించబడ్డారు.
  • 1998 లో 1000 ప్రదర్శనలు పూర్తి చేసిన సందర్భంగా స్థానికంగా సన్మానించబడ్డారు.'
  • 1997 లో భారత స్వాతంత్ర్య స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా విశాఖపట్నంలో ప్రముఖ మిమిక్రీ కళాకారులు పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ సమక్షంలో విద్యార్థులకు ఉచిత ప్రదర్శన లిచ్చారు.
  • 1994 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్.జనార్థనరెడ్డి చేతుల మీదుగా సత్కరించబడ్డారు.
  • 1988 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి.రామారావు చేతుల మీదుగా సత్కరించబడ్డారు.

మూలము

[మార్చు]
  • వేదుల ప్రభాకర శ్రీనివాసరావు యొక్క ఆటోబయోగ్రఫీ [1]
  • ఈనాడు దిన పత్రిక 2012 అక్టోబరు 8 శ్రీకాకుళం విభాగం
  • సాక్షి దిన పత్రిక 2012 అక్టోబరు 8 శ్రీకాకుళం విభాగం
  • ఆంధ్ర భూమి దినపత్రిక 2012 అక్టోబరు 8 శ్రీకాకుళం విభాగం
  • ఆంధ్ర జ్యోతి దినపత్రిక 2012 అక్టోబరు 8 శ్రీకాకుళం విభాగం

లింకులు

[మార్చు]