మిదాక్ ఆలి స్పానిష్ భాషాచిత్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మిదాక్ ఆలి స్పానిష్ భాషాచిత్రం (Midaq Alley 1995). మిదాక్ ఆలి బీభత్సరస ప్రధానమయిన, విషాదాంత చిత్రం, దర్శకుడు జార్జి ఫోన్స్ (Jorge Fons)ఈజిప్టు దేశీయుడు Naguib Mahfouz రచించిన నవలను సినిమాగా తీశాడు, కానీ కైరోలో జరిగిన కథని మెక్సికో సిటీలోని Callejon de los-Milogrous మురికివాడలో, డౌన్ టౌన్లో జరిగినట్లు మార్పుచేశాడు. పాత్రలన్నిటిని ఆనగర వాసులుగా మార్చాడు. మెక్సికో సిటీలోని నిరుపేదల,మధ్యతరగతిలో క్రింది తరగతి వారి జీవితాలను, అథోజగత్- 'నీదర్ వరల్డ్' జనాల స్వప్నాలను, ఆశయాలను, ఊహాలను నియో రియలిజం ధోరణి సినిమాగా తీశాడు. సినిమా నాలుగు భాగాలు. 1.బార్ యజమాని ఋతిలో, 2. అల్మా(కథానాయిక),3.సుశాంతిక(ఇంటి యజమానురాలు) 4. ది రిటర్న్. (యు.ఎస్.వెళ్ళిన ఇద్దరు యువకుల తిరిగి రాక) మొదటి మూడు భాగాలు ఆయా పాత్రల దృక్పథం నుంచి చిత్రించబడింది. గే, లెస్బియన్ టాపిక్స్ కూడా ప్రస్తావనకు వస్తాయి సినిమాలో. సినిమా విమర్శకుల అభినందనలకు పాత్రమయినది.

Don Ru స్థానిక పబ్ యజమాని, Eusebia అతని భార్య, Chava కుమారుడు, Abel చావా మిత్రుడు. కథానాయిక Alama, ఆమె వంటి మరో యువతి ప్రధాన పాత్రలు. మూడు ప్రధాన పాత్రల కోణం నుంచి కథ సాగుతుంది. అన్ని పాత్రల కథలను కలుపుతూ ముగిస్తాడు సినిమాను. మురికివాడలోని మిదాక్ ఆలి అనే సన్న ఇరుకైన సందులో కాపురాలుండే ప్రజలు, వారి జీవితాలు. ఒక నడివయసు స్త్రీ Susantika సోదె, ప్రశ్నలు చెప్పడం, భవిష్యత్తు చెప్పడం వృత్తి(charlton)కొనసాగిస్తూ, తన ఇంట్లో కొన్ని గదులు అద్దెకిచ్చి బతుకుతూ వుంటుంది. ఆమె కూతురు Alma అనే యువతి జీవితం గురించి కలల్లో తేలిపోతూ ఉంటుంది. బార్ నడుపుకొనే పెద్దాయన కూడా ఆమె ఇంట్లో ఒక గదిలో అద్దెకుంటాడు. సుశాంతిక తన అప్పు తీర్చలేదు కనుక, బార్ యజమాని ఆమె కూతురు ఆల్మాను తనకిచ్పి పెళ్ళి చేయమని వత్తిడిపెడుతూ ఉంటాడు. అతనికి పాతికేళ్ళ కుమారుడు ఉంటాడు. బార్ యజమాని బార్లో పనిచేసే యువకునితో శరీరసంబద్ధం పెట్టుకోడం కుమారుడికి అసహ్యం కలుగుతుంది. బార్.కు రోజూ వచ్చేవారిలో ఒక కవి, వెండినగలు అమ్ముకొనే చిల్లర వర్తకుడు, కొందరు దొంగలు, మంగలిషాపు యజమాని, క్షురకుడు అందరూ 45 ఏళ్లు పయిబడినవారే ఉంటారు.

మంగలిషాపులో పనిచేసే యువకుడు Aibal కథానాయకుడు. ఆ వీధి, ఆ మనుషులు, పేదరికం ఎక్కడా నిరాశ తప్ప ఆశ కనిపించదు. సినిమాలోని ముగ్గురు యువకులలో ఇద్దరు ఎలాగయినా అమెరికాకు వెళ్లాలనే ప్రయత్నం చేస్తూంటారు. వీళ్ళల్లో ఒకడు అమెరికాలో ప్రవేశించలేక, అక్కడక్కడా తిరిగి, ఒక యువతిని పెళ్లిచేసుకొని, బిడ్డతో వెనక్కి వస్తాడు. ఆల్మితా ప్రియుడు Aibal మాత్రం అమెరికాలో గొడ్డు చాకిరీచేసి, నానా కష్టాలుపడి, ఎలాగయితేనేం డాలర్లు సంపాదించుకొని తిరిగివస్తాడు.

ఆల్మితా యవ్వనోద్రేకంలో కోరికలను చంపుకోలేక ఒక కోటీశ్వరుడి ప్రియురాలుగా మారి, క్రమంగా అతని ఉంపుడుగత్తెలలో ఒకటవుతుంది. డాలర్లు బాగా సంపాదించి వెనక్కి వచ్చిన ఆమె ప్రియుడు ఏబెల్ నిరాశతో ఆమె ఎదుటనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణంయించుకొకొని, ఆ ప్రయత్నంలో ఉండగా, ఆల్మితాను ఉంచుకొన్న ధనికుడు అతణ్ణి హత్యచేస్తాడు. Aibal తన ప్రియురాలు ఆల్మితా ఒడిలో చివరిశ్వాస విడుస్తాడు.

మూడో యువకుడు తనకంటే రెండితల వయసున్న సుశాంతికను పెళ్ళాడి బ్రతుకు బండి సాగిస్తాడుగానీ ఈ వివాహబంధం కూడా నిలవదు. పాత్రల కథలు పడుగు పేకల్లా అల్లుకొని పోతాయి. ఈ సినిమాలో కథానాయిక ఆల్మా పాత్ర ధరించిన Salama Hayek గొప్ప హాలీవుడ్ నటిగా ప్రఖ్యాతి పొందింది.

లాటిన్ అమెరికాలో మురికివాడల పేదల జీవితాలకు అద్దంపట్టిన సినిమా. పాత్రలు ఒకదాని నీడలగా మరొకటి అనిపిస్తుంది. అందరి కథలు ఏదో రకంగా విషాదాంతంగా ముగుస్తాయి. దర్శకుడు లంపన్ వర్గాల జీవితాలను సానుభూతితో, వివరంగా చిత్రించాడు. ఏపాత్రకూ ఆశావహమయిన ముగింపు లేనట్లనిపిస్తుంది. ఆల్మిత స్నేహితురాలు చివరకు కాల్ గర్ల్ గా మారినట్లు సూచనగా తెలుస్తుంది.

మూలాలు: 1.The most awarded film in Mexican history,Midaq Alley, produced in 1995, Director: jORGE fONS.2.This film received the reputed Ariel film Award§.