మితేష్ రమేష్ భాయ్ పటేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మితేష్ రమేష్ భాయ్ పటేల్
మితేష్ రమేష్ భాయ్ పటేల్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019
ముందు దిలీప్ పటేల్
నియోజకవర్గం ఆనంద్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు రమేష్ భాయ్ షానాభాయ్ పటేల్, తారాబెన్ రమేష్ భాయ్ పటేల్
జీవిత భాగస్వామి దిపాలిబెన్ మితేష్ పటేల్
సంతానం 2
నివాసం గురుకృపా, మిలన్‌కుంజ్ సొసైటీ హై స్కూల్ రోడ్, వసాద్ ఆనంద్, గుజరాత్
మూలం [1]

మితేష్ రమేష్ భాయ్ పటేల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన ఆనంద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

మితేష్‌భాయ్ పటేల్ 1965 ఆగస్టు 27న ఆనంద్ జిల్లాలోని సర్సా గ్రామంలో రమేష్ భాయ్ షానాభాయ్ పటేల్, తారాబెన్ దంపతులకు జన్మించాడు. ఆయన కర్ణాటకలోని బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుండి టెలికాం ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్ & టీసీ)లో పట్టభద్రుడయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

మితేష్ పటేల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆనంద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి భరత్‌భాయ్ మాధవ్‌సింగ్ సోలంకిపై 1,97,718 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 13 సెప్టెంబర్ 2019 నుండి 4 జూన్ 2024 వరకు పార్లమెంట్‌లో ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు & ప్రజా పంపిణీపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, 13 సెప్టెంబర్ 2019 నుండి 4 జూన్ 2024 వరకు పెట్రోలియం మరియు సహజ వాయువుపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.[3]

మితేష్ పటేల్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆనంద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అమిత్ చావ్డాపై 89,939 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "Miteshbhai Patel" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  2. TV9 Bharatvarsh (5 June 2024). "'बकाभाई' के नाम से जाने जाते हैं आणंद सीट पर जीतने वाले मितेशभाई, जानें कौन हैं ये". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. DNA India. "Anand Lok Sabha Election Result 2019: BJP's Patel Mitesh Rameshbhai defeats Congress's Bharatbhai Madhavsinh Solanki" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  4. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Anand". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  5. The Economic Times (6 June 2024). "Bullish Wins & Bearish Losses: Here are the key contests and results of 2024 Lok Sabha polls". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.