Jump to content

మిచెల్ డానినో

వికీపీడియా నుండి
మిచెల్ డానినో

మిచెల్ డానినో (జననం 1956 జూన్ 4) ఫ్రెంచ్ మూలానికి చెందిన భారతీయ రచయిత. [1] అతను ఐఐటి గాంధీనగర్ [2] లో అతిథి ప్రొఫెసర్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ లో సభ్యుడు. సాహిత్యం, విద్య రంగాల్లో అతడు చేసిన కృషికి గాను 2017 లో భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. [3]

డానినో తమిళనాడులోని ఆరోవిల్లెలో కొన్ని సంవత్సరాలు గడిపి, ఆ తరువాత నీలగిరి పర్వతాలకు తరలి వెళ్ళాడు. అక్కడ అతను రెండు దశాబ్దాల పాటు నివసించాడు. 2003 లో, అతను కోయంబత్తూరు సమీపంలో స్థిరపడ్డాడు. భారత పౌరసత్వాన్ని స్వీకరించాడు. [1]

డానినో చేసిన కృషి, దానికి లభించిన ఆదరణ

[మార్చు]

డానినో ది లాస్ట్ రివర్:ఆన్ ది ట్రైల్ ఆఫ్ ది సరస్వతి అనే పుస్తకం రచించాడు. ఋగ్వేదంలో ప్రస్తావించిన పౌరాణిక సరస్వతీ నది అంటే ప్రస్తుత ఘగ్గర్-హక్రా నదేనని చెప్పవచ్చని అతడు ఆ పుస్తకంలో రాసాడు. [4] వి రాజమణి కరెంట్ సైన్స్ పత్రికలో దీనిని సనుకూలంగా సమీక్షించాడు. డానినో చేసిన ఖచ్చితమైన పరిశోధనను అతడు ప్రశంసించాడు. [5]

పీటర్ హీహ్, శ్రీ అరబిందో అండ్ ఇండియన్ సివిలైజేషన్ అనే తన రచనలో భాషా పరిజ్ఞానం లేకపోవడం, వలసరాజ్యాల ప్రాచ్యవాదులపై దాడులు, జాతీయవాద ప్రాచ్యవాదుల అరకొర జ్ఞానం ద్వారా రూపొందించబడింది అని చెప్పాడు. [6] ఇండో-ఆర్యన్ వలసలకు వ్యతిరేకంగా తాను చేసే ప్రచారంలో డానినో, శ్రీ అరబిందోను వాడుకున్నందుకు, అరబిందో యొక్క ఊహాజనిత అభిప్రాయాలను వక్రీకరించినందుకూ కూడా హిహ్స్ దానినోను విమర్శించాడు. [7] డానినో అరబిందో రాసిన చిత్తుప్రతుల నుండి తనకు అవసరమైన కొన్ని వ్యాఖ్యలను ఎంచుకుని, అతని ఇతర రచనలను విస్మరించాడు. [8] చారిత్రక నిరాకరణవాదం ఆధారంగా మతతత్వ హిందూత్వ ఆధారిత స్కాలర్‌షిప్‌ను డానినో అనుసరిస్తున్నాడని ఇతరులు ఆరోపించారు. [9][10][11]

సింధు లోయ నాగరికత పై, దక్షిణ ఆసియా చరిత్ర, పురావస్తు శాస్త్రంపై విలే-బ్లాక్‌వెల్ తయారు చేసిన విజ్ఞానసర్వస్వానికి డానినో సహకారి. [12]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

 

  1. 1.0 1.1 Pande Daniel, Vaihayasi. "The Sarasvati was more sacred than Ganga". Rediff.com. Retrieved 8 August 2011. Technically, I am not a 'foreigner': I adopted Indian citizenship some years ago.
  2. "Michel Danino - IIT Gandhinagar". www.iitgn.ac.in. Archived from the original on 2017-01-04. Retrieved 2021-09-30.
  3. "PadmaAwards-2017" (PDF). Archived from the original (PDF) on 2017-01-29.
  4. "TOI Crest: Quick review". The Times of India. 29 May 2010. Retrieved 17 February 2020.
  5. Rajamani, V. (2010). "Review of The Lost River – On the Trail of the Sarasvati". Current Science. 99 (12): 1842–1843. ISSN 0011-3891. JSTOR 24073512.
  6. Heehs, Peter (2003). "Shades of Orientalism: Paradoxes and Problems in Indian Historiography". History and Theory. 42 (2): 169–195. doi:10.1111/1468-2303.00238. ISSN 0018-2656. JSTOR 3590880.
  7. Heehs, Peter (2003). "Shades of Orientalism: Paradoxes and Problems in Indian Historiography". History and Theory. 42 (2): 169–195. doi:10.1111/1468-2303.00238. ISSN 0018-2656. JSTOR 3590880.
  8. Heehs, Peter (2003). "Shades of Orientalism: Paradoxes and Problems in Indian Historiography". History and Theory. 42 (2): 169–195. doi:10.1111/1468-2303.00238. ISSN 0018-2656. JSTOR 3590880.
  9. Guha, Sudeshna (2005). "Negotiating Evidence: History, Archaeology and the Indus Civilisation". Modern Asian Studies. 39 (2): 399–426. doi:10.1017/S0026749X04001611. ISSN 0026-749X. JSTOR 3876625.
  10. Chadha, Ashish (2011-02-01). "Conjuring a river, imagining civilisation: Saraswati, archaeology and science in India". Contributions to Indian Sociology (in ఇంగ్లీష్). 45 (1): 55–83. doi:10.1177/006996671004500103. ISSN 0069-9667.
  11. Bhatt, Chetan (2000-01-01). "Dharmo rakshati rakshitah : Hindutva movements in the UK". Ethnic and Racial Studies. 23 (3): 559–593. doi:10.1080/014198700328999. ISSN 0141-9870.
  12. Schug, Gwen Robbins; Walimbe, Subhash R., eds. (2016-06-08). A Companion to South Asia in the Past (in ఇంగ్లీష్). doi:10.1002/9781119055280. ISBN 9781119055280.