Jump to content

మాళవులు

వికీపీడియా నుండి
Malavas

4th century BCE–7th century CE
Malavas/Malwas (in the north-west) and their contemporaries around 375 CE
Malavas/Malwas (in the north-west) and their contemporaries around 375 CE
చరిత్ర 
• స్థాపన
4th century BCE
• పతనం
7th century CE
Preceded by
Succeeded by
Avanti (Ancient India)
Aulikaras
Chalukyas
Maitraka dynasty
Today part ofIndia

మాళవాలు లేదా మాళ్వాలు ఒక పురాతన భారతీయ తెగ. క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దంలో అలెగ్జాండరు దాడి సమయంలో పంజాబు ప్రాంతంలో స్థిరపడిన మల్లోయీలుగా ఆధునిక పరిశోధకులు వారిని గుర్తించారు. తరువాత మాళవులు దక్షిణ దిశగా నేటి రాజస్థానుకు, చివరికి మధ్యప్రదేశు, గుజరాతులకు వలస వెళ్ళారు. పాశ్చాత్య సాత్రపీలు (కామను ఎరా 2 వ శతాబ్దం), గుప్తచక్రవర్తి సముద్రాగుప్తుడు (4 వ శతాబ్దం), చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి (7 వ శతాబ్దం) వద్ద పరాజయాల ఫలితంగా వారి శక్తి క్రమంగా క్షీణించింది.

మధ్య భారతదేశంలోని మాళ్వా ప్రాంతానికి వారి పేరు పెట్టారు. మాళవ శకం తరువాత విక్రం సంవతు అని పిలువబడింది. బహుశా వారు తరువాత దీనిని ఆక్రమించి ఉంటారు.

కామను ఎరా పూర్వం

[మార్చు]

మాళవాలు మహాభారతం, మహాభాష్యంతో సహా అనేక ప్రాచీన భారతీయ గ్రంథాలలో ప్రస్తావించబడ్డారు.[1] మహాభారతం ఆధారంగా మద్రరాజు అశ్వపతి వంద మంది కుమారులు, సావిత్రి తండ్రిని మాలావి (వారి తల్లి మాలావి పేరు) అని పేర్కొన్నారు.[2] మాళవాలు వాస్తవానికి పాణిని చేత ప్రస్తావించబడనప్పటికీ ఆయన సూత్రం V.3.117 లో అనేక తెగలను ప్రస్తావించారు. ఆయుధజీవి సంఘాలు (ఆయుధ వృత్తి ద్వారా జీవించేవారు), కాషిక ఈ సమూహంలో మాళావులు, క్షుద్రకాల పేర్లు తెగలు ఉన్నాయి. పతంజలి మహాభాష్య (IV.1.68) లో మాళావులు ప్రస్తావించబడ్డారు.[3]

మాళవాల అసలు మాతృభూమి స్థానం కచ్చితంగా తెలియదు. కాని ఆధునిక పరిశోధకులు సాధారణంగా వారిని పురాతన గ్రీకు వృత్తాంతాలలో పేర్కొన్న "మల్లి" లేదా "మల్లోయి"గా భావిస్తారు. ఇది అలెగ్జాండరు వారి మీద చేసిన యుద్ధాన్ని వివరిస్తుంది.[4][5] క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దంలో అలెగ్జాండరు దండయాత్ర సమయంలో మల్లోయి ప్రజలు ప్రస్తుత పంజాబు ప్రాంతంలో రవి, చీనాబు నదుల సంగమం ఉత్తరాన ఉన్న ప్రాంతంలో నివసించారు. [4]

దక్షిణ వైపుగా వలససు

[మార్చు]

తరువాత మాళవులు (లేదా వారిలో కనీసం అధిక జనాభా) ప్రస్తుత రాజస్థానుకు వలస వచ్చారు. బహుశా ఇండో-గ్రీకు పంజాబు ఆక్రమణ ఫలితంగా ఉండవచ్చు.[4] బహుశా వారి ప్రధాన కార్యాలయం మాళవనగర (నేటి నగర ఫోర్టు) వద్ద ఏర్పరచుకుని ఉన్నారు. ఇక్కడ అనేక వేల నాణేలు కనుగొనబడ్డాయి.[6] ఈ నాణేలు పురాణ మాళవనం జయా ("మాళావుల విజయం") ను కలిగి ఉంటాయి. ఇవి క్రీ.పూ 250 - సా.శ. 250 మధ్య కాలం నాటివి.[1]మాళవశకం నాటి అనేక శాసనాలు రాజస్థాను లోని వివిధ ప్రాంతాలలో కనుగొనబడ్డాయి. ఇది మాళవ ప్రభావం రాజస్థానులో విస్తృత భాగానికి విస్తరించిందని సూచిస్తుంది.[6]

మాళావులు చివరికి మధ్య భారతదేశంలోని మాల్వా ప్రాంతానికి వలస వచ్చారు: ఈ ప్రాంతానికి సా.శ. 2 వ శతాబ్దం తరువాత కొంతకాలం వారి పేరు పెట్టారు.[7]

పశ్చిమ సాత్రపీలతో సంఘర్షణలు

[మార్చు]
Gangadhar Stone Inscription of Viśvavarman, king of the Aulikaras, a branch of the Malavas, and contemporary of Kumaragupta, 423 CE.[8]

సా.శ. 120 లో మాళవులు దక్షిణాన ఉత్తమభద్ర రాజును ముట్టడి చేసినట్లు పేర్కొనబడింది. కాని చివరకు ఉత్తమాభద్రను పశ్చిమ సాత్రపాలు రక్షించారు. మాల్వాలు నలిగిపోయారు.[9] నహపన రాజప్రతినిధి ఉషవదత చేత తయారు చేయబడిన నాసికు గుహలలోని ఒక శాసనంలో ఈ వివరణ కనిపిస్తుంది:

… స్వామి ఆదేశానుసారం నేను వర్షాకాలంలో మలేయులచే ముట్టడి చేయబడిన ఉత్తమాభద్రుల అధిపతిని విడుదల చేయడానికి వెళ్ళాను. ఆ మళయాయులు కేవలం గర్జన (నేను సమీపించే)తో వారు అందరూ ఉత్తమభద్ర యోధుల ఖైదీలను చేసిన ప్రాంతాన్ని విడిచి ఉన్నవారు ఉన్నట్లుగా పారిపోయారు

—నాసికు గుహల గుహ నెం .10 లో వివరణ.[10]

గుప్తులతో సంఘర్షణలు

[మార్చు]

కామను ఎరా 4 వ శతాబ్దంలో గుప్తచక్రవర్తి సముద్రగుప్తుడి పాలనలో మాళవులు ఎక్కువగా రాజస్థాను, పశ్చిమ మాళ్వాలో నివసించారు. [5] సముద్రాగుప్తుడి అలహాబాదు స్తంభం శాసనం ఆయనకు లొంగిపోయిన తెగలలో మాళవాలు ఒకరిని పేర్కొంది.[11] మాళ్వ ప్రాంతంలో పాలించిన ఔలికారాలు మాళవ వంశంగా ఉండవచ్చు. బహుశా అందువలన ఈ ప్రాంతానికి "మాళ్వా" అనే పేరు వర్తించబడవచ్చు.[7]

గుప్తకాలం తరువాత

[మార్చు]

గుప్తకాలం తరువాత వ్రాతపూర్వక ఆధారాలు ప్రస్తుత మధ్యప్రదేశు, గుజరాతు వంటి పలు ప్రాంతాలలో మాళవాల ఉనికిని తెలియజేస్తున్నాయి. [12]

ప్రస్తుత గుజరాతు

[మార్చు]

జువాన్జాంగు (7 వ శతాబ్దం కూడా) ప్రస్తుత గుజరాతులో మాళవాను ("మో-లా-పో"గా లిప్యంతరీకరించారు). ఖేత (ఖేడా), ఆనందపుర (వాడ్నగరు) ను మాళవా దేశంలోని భాగాలుగా అభివర్ణిస్తుంది.[13] ఈ మాళవదేశం మైత్రాకరాజ్యంలో ఒక భాగమని జువాన్జాంగు సూచిస్తున్నారు.[14] బాణభట్టు వలె ఆయన ఉజ్జయిని ("వు-షీ-యెన్-నా") ను ఒక ప్రత్యేకమైన భూభాగంగా వర్ణించాడు. కాని బాణభట్టు వలె కాకుండా ఆయన ఉజ్జయినికి పశ్చిమాన మాళవ ఉన్నట్లు గుర్తించాడు. మాలావాసులను ఓడించిన చాళుక్య రాజు రెండవ పులకేషిశి 7 వ శతాబ్దపు ఐహోలు శాసనం వారు ప్రస్తుత గుజరాతులో ఉన్నట్లు పేర్కొన్నది.[13] 9 వ శతాబ్దపు రాష్ట్రకూట వ్రాతపూర్వ ఆధారాలు వారి చక్రవర్తి మూడవ గోవింద రాజప్రతినిధి కక్కాను లతా దేశంలో (దక్షిణ గుజరాతు) నిలబెట్టినట్లు గుర్జారా-ప్రతిహారాలు మాళవాలోకి ప్రవేశించడాన్ని వివరించాయి. [14]

ప్రస్తుత కాలం

[మార్చు]

చివరికి మాళ్వా అని పిలువబడే ప్రాంతంలో ఉజ్జయిని ఉన్నప్పటికీ, గుప్తుల అనంతర వ్రాతపూర్వక ఆధారాలు మాళవ భూభాగం ఉజ్జయిని చుట్టుపక్కల ప్రాంతాల మధ్య తేడాను గుర్తించాయి. బాణభట్ట కాదంబరి (7 వ శతాబ్దం) నేటి తూర్పు మాళ్వాలోని విధిషాను మాళవాల రాజధానిగా ప్రస్తుత పశ్చిమ మాళ్వాలోని ఉజ్జయిని (ఉజ్జయిని) ప్రత్యేకమైన అవంతి రాజ్యానికి రాజధానిగా వర్ణించింది.[6] ఈ మాళవా రాజును సా.శ.605 లో పుష్యభూతి రాజు రాజవర్ధన ఓడించాడు. బాణభట్టు హర్షచరిత, పుష్యభూతి శిలాశాసనాలు దీనిని ధ్రువీకరించాయి.[14] ఈ మాళవా, ఉజ్జయిని ప్రాంతాల మధ్య వ్యత్యాసం 9 వ శతాబ్దపు ముస్లిం చరిత్రకారుడు అల్-బలధూరి రచనలలో కూడా ప్రస్తావించబడింది. సింధు అరబు రాజప్రతినిధి జునాయదు ఉజైను (ఉజ్జయిని), అల్-మాలిబా (మాళవా) మీద సా.శ. 725 లో దాడి చేసినట్లు పేర్కొన్నాడు.[15]

10 వ శతాబ్దం నుండి చారిత్రక ఆధారాలు "మాళవాలు" అనే పదాన్ని ప్రస్తుత మాళ్వా ప్రాంతాన్ని పాలించిన పరమరాలను సూచించడానికి ఉపయోగించాయి. పరమారలు పురాతన మాళవుల నుండి వచ్చినవారే కాదు. పురాతన మాలావాసుల పేరిట ఉన్న మాళ్వా ప్రాంతాన్ని పరిపాలించడం ప్రారంభించిన తరువాత వారు "మాళవాలు" అని పిలువబడ్డారు.[15] యాదవ-ప్రకాశం రచించిన విజయంతి (మ .11 వ శతాబ్దం) లో అవంతి (ఉజ్జయిని పరిసర ప్రాంతం), మాళవ ఒకేలా ఉన్నట్లు పేర్కొనబడింది. అందువలన మాల్వా ప్రస్తుత నిర్వచనం 10 వ శతాబ్దం చివరి భాగంలో ప్రాచుర్యం పొందింది.[16]

మాళవ యుగం

[మార్చు]

మాళవయుగం తరువాత మాళవులతో సంబంధం కలిగి ఉన్న విక్రమా సంవతు అని పిలువబడింది. ప్రారంభంలో దీనిని కృతయుగం అని, తరువాత మాళవా శకం అని పేర్కొన్నారు. చాహమాన పాలకుడు చంద్రమహాసేన ధోల్పూరు రాతి శాసనంలో ఈ యుగాన్ని మొదటిసారి విక్రమయుగం అని ప్రస్తావించబడింది.[2]

పాలకులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Tej Ram Sharma 1978, p. 148.
  2. 2.0 2.1 Bela Lahiri 1974, pp. 262–278.
  3. B. C. Law 1973, pp. 60–65.
  4. 4.0 4.1 4.2 D. C. Sircar 1971, p. 205.
  5. 5.0 5.1 Tej Ram Sharma 1978, p. 147.
  6. 6.0 6.1 6.2 D. C. Sircar 1971, p. 206.
  7. 7.0 7.1 P. K. Bhattacharyya 1977, p. 147.
  8. 8.0 8.1 8.2 Corpus Inscriptionum Indicarum Vol 3 p.72
  9. Parmanand Gupta 1989, p. 33.
  10. Epigraphia Indica Vol.8 p.78-79
  11. Ashvini Agrawal 1989, p. 119.
  12. D. C. Sircar 1971, pp. 207–208.
  13. 13.0 13.1 D. C. Sircar 1971, pp. 206–207.
  14. 14.0 14.1 14.2 D. C. Sircar 1971, p. 208.
  15. 15.0 15.1 D. C. Sircar 1971, p. 209.
  16. D. C. Sircar 1971, p. 210.

గ్రంధసూచిక

[మార్చు]
  • Ashvini Agrawal (1989). Rise and Fall of the Imperial Guptas. Motilal Banarsidass. ISBN 978-81-208-0592-7.
  • B. C. Law (1973). Tribes in Ancient India. Bhandarkar Oriental Research Institute.
  • Bela Lahiri (1974). Indigenous states of northern India, circa 200 B.C. to 320 A.D. University of Calcutta.
  • D. C. Sircar (1971). Studies in the Geography of Ancient and Medieval India. Motilal Banarsidass. ISBN 978-81-208-0690-0.
  • P. K. Bhattacharyya (1977). Historical Geography of Madhya Pradesh from Early Records. Motilal Banarsidass. ISBN 978-81-208-3394-4.
  • Parmanand Gupta (1989). Geography from Ancient Indian Coins & Seals. Concept. ISBN 978-81-7022-248-4.
  • Tej Ram Sharma (1978). Personal and Geographical Names in the Gupta Inscriptions. Concept. OCLC 249004782.
"https://te.wikipedia.org/w/index.php?title=మాళవులు&oldid=3908998" నుండి వెలికితీశారు