Jump to content

మాల్యాద్రి శ్రీరాం

వికీపీడియా నుండి
మాల్యాద్రి శ్రీరాం

ఎంపీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2019
నియోజకవర్గం బాపట్ల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 10 జులై 1954
పార్లపల్లె , నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు ఎస్. రాఘవయ్య, అనంతమ్మ
జీవిత భాగస్వామి రంగనాయకమ్మ
సంతానం 3
పూర్వ విద్యార్థి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ

మాల్యాద్రి శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి. ఆమె 2014లో బాపట్ల నియోజకవర్గం ఎంపీగా ఎన్నికయ్యాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

మాల్యాద్రి శ్రీరాం 1954 జులై 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, పార్లపల్లె గ్రామంలో ఎస్. రాఘవయ్య, అనంతమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి ఎం.ఏ (ఎకనామిక్స్) పూర్తి చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

మాల్యాద్రి శ్రీరాం రాజకీయాల్లోకి రాకముందు ఐ.ఆర్.ఎస్ అధికారిగా పై చేశాడు. ఆయన 2009లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి చేతిలో 69338 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2014లో తెలుగుదేశం పార్టీ తరపున బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరికూటి అమృతపాణి పై ఓట్ల మెజారిటీతో ఎంపీగా తొలిసారి పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] మాల్యాద్రి శ్రీరాం 2019లో తెలుగుదేశం పార్టీ తరపున బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందిగం సురేష్ బాబు చేతిలో 16065 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. Lok Sabha (2014). "Malyadri Sriram". loksabhaph.nic.in. Archived from the original on 5 February 2022. Retrieved 5 February 2022.
  2. Sakshi (31 March 2019). "బాపట్లలో గెలుపు ఎవరిది?". Archived from the original on 5 February 2022. Retrieved 5 February 2022.