మాలు
Jump to navigation
Jump to search
మాలు (Mortar - మోర్టార్) అనగా రాళ్ళు, ఇటుకలు, కాంక్రీట్ ఇటుకదిమ్మల వంటి నిర్మాణ అచ్చులను ఒకటిగా కలుపుతూ కట్టడం కట్టుటకు ఉపయోగింపదగిన ఇసుక, సిమెంట్ల యొక్క అడుసు. ఈ మాలును కట్టడాల యొక్క క్రమరహిత అంతరాలను పూడ్చడానికి ఉపయోగిస్తారు. కొన్ని ప్రత్యేక ఇటుక గోడల నిర్మాణాల సమయంలో మాలు అలంకరణగా కనిపించుటకు మాలులో రంగులు కలుపుతారు. మాలును తాపీపని యొక్క అనేక నమూనాల తయారీలో ఉపయోగిస్తారు.
మాలు అనేది సాధారణంగా ఇసుక, బంధకం, నీరు యొక్క మిశ్రమముల ద్వారా తయారు చేయబడుతుంది. 20 వ శతాబ్దం నుంచి అత్యంత సాధారణ బంధకం పోర్ట్లాండ్ సిమెంట్, కానీ పురాతన బంధకం సున్నపు మాలు, ఈ మాలును ఇప్పటికీ కొన్ని కొత్త నిర్మాణములలో ఉపయోగిస్తున్నారు. సిమెంట్ మాలు బలంగా చాలా ఎక్కువ కాలం ఉండుటకు కట్టడం పని పూర్తయిన తరువాత రోజు నుంచి కొన్ని రోజుల పాటు (30 రోజులు) నీటితో తడుపుతారు.