Jump to content

మాలతి జోషి

వికీపీడియా నుండి
రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ శ్రీమతి మాలతి జోషి కి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేశారు. 2018 మార్చి 20న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన పౌర అలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి మాలతీ జోషి

మాలతి జోషి (1934 జూన్ 4-2024 మే 15) ప్రధానంగా హిందీ మరాఠీ భాష రచయిత, భారతీయ వ్యాసకర్త రచయిత. మాలతి జోషికి 2018లో భారతదేశ నాల్గవ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ అవార్డును అందుకుంది.[1][2]

బాల్యం విద్యాభ్యాసం

[మార్చు]

మాలతి జోషి 1934 జూన్ 4న బ్రిటిష్ ఇండియా లోని హైదరాబాద్ రాష్ట్రం ఔరంగాబాద్ పట్టణంలో జన్మించారు, మాలతి జోషి మధ్యప్రదేశ్ లో చదువుకున్నారు, మాలతి జోషి ఇండోర్ డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ పరిధిలోని హోల్కర్ కళాశాల నుండి పట్టా పొందింది . మాలతి జోషి మాతృభాష మరాఠీ కుటుంబ సభ్యులు కూడా మరాఠీనే మాట్లాడేవారు మాలతి జోషి మాతృ భాషలో కాకుండా హిందీలో తన విద్యను కొనసాగించింది. మాలతి జోషి అండర్ గ్రాడ్యుయేట్ విద్య తరువాత, 1956 లో హిందీ సాహిత్యంలో కళలలో మాస్టర్స్ డిగ్రీని పొందింది.[3]

రచయిత

[మార్చు]

మాలతి జోషి చిన్న వయసులోనే కథలు రాయడం కవితలు రాయడం నేర్చుకుంది, మాలతి జోషి రచనలు హిందీ పత్రికలలో వచ్చేవి. 1971లో, మాలతి జోషి హిందీ సాహిత్య పత్రిక ధర్మయుగ్ లో ఒక చిన్న కథను రాసి ప్రచురించింది, ఈ రచనను టైమ్స్ పత్రిక ప్రశంసించింది. హిందీలో ప్రముఖ వార్తాపత్రికలైన సప్తహిక్ హిందూస్తాన్, మనోరమా, కదంబిని, సారిక హిందీ పత్రికలు మాలతి జోషి రచించిన రచనలను ప్రచురించేవి. మాలతి జోషి ఆధ్యాత్మిక అంశాలపై కూడా రచనలను రాసింది. ఆమె కథలు అనేక సంపుటాల ద్వారా సేకరించి హిందీ పత్రికలలో ప్రచురించబడ్డాయి, మాలతి జోషి రెండు నవలలను 50 పుస్తకాలను రచించింది.[3][4]

మాలతి జోషి రచించిన రచనలు ఉర్దూ, బెంగాలీ, తమిళం, తెలుగు, పంజాబీ, మలయాళం కన్నడ భాషల్లోకి అనువాదం అయ్యాయి.[5] మాలతి జోషి రచించిన రచనలు ఇంగ్లీష్, రష్యన్ జపనీస్ భాషల్లోకి అనువదించబడ్డాయి.[3] మాలతి జోషి హిందీ భాషలో కథలను రచించేది ప్రధానంగా, మాలతి జోషి మరాఠీలో పదకొండు పుస్తకాలను రచించింది.[1][4]

మాలతి జోషి రచనలను భారత ప్రభుత్వ ప్రసార వార్త సంస్థ దూరదర్శన్ టెలివిజన్ కోసం స్వీకరించింది.[1] ప్రముఖ నటి జయ బచ్చన్ నిర్మించిన టెలివిజన్ కార్యక్రమం 'సాత్ ఫేరే' (సెవెన్ టర్న్స్), ప్రముఖ దర్శకుడు నిర్మాత గుల్జార్ నిర్మించిన 'కిరదార్' (పాత్ర) లలో మాలతి జోషి నటించారు .[5]

హిందీ భాషా వార్తా ఛానల్ ఆజ్ తక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలతి జోషి మాట్లాడుతూ, భారతదేశంలోని మధ్యతరగతి కుటుంబాల అనుభవాన్ని ప్రజలకు వివరించడానికి తన రచనలు తోడ్పడుతాయని మాలతి జోషి అన్నారు, మాలతి జోషి రచనలు మధ్యతరగతి కుటుంబ అంశాల మీద ఎక్కువగా రచనలు చేసినట్టు మాలతి జోషి ఆ ఇంటర్వ్యూ లో చెప్పారు , పి. ఎల్. దేశ్పాండే శరద్ జోషి తనకిష్టమైన రచయితలని మాలతి జోషి ఆ ఇంటర్వ్యూలో అంది .[5]

మరణం

[మార్చు]

మాలతి జోషి తన 90వ పుట్టినరోజుకు 20 రోజుల ముందు, 2024 మే 15న, 89 సంవత్సరాల వయసులో న్యూఢిల్లీలో మరణించింది.[6]

అవార్డులు

[మార్చు]
సంవత్సరం. అవార్డు అవార్డు అందించినవారు మూలం
1999 భవభూతి అలంకారన్ మధ్యప్రదేశ్ సాహిత్య సమ్మేళనం [3]
2006 శిఖర్ సమ్మన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం [3]
2011 దుష్యంత్ కుమార్ సాహిత్య సమ్మన్ [3]
2011 ఓజస్విని సమ్మన్ [3]
2013-14 రాష్ట్రీయ మైథలిషరన్ గుప్త్ సమ్మాన్ రాజస్థాన్ ప్రభుత్వం [3]
2013 వనమాలి కథా సమ్మన్ ది ఫౌండేషన్ ఫర్ వనమాలి జగన్నాథ్ ప్రసాద్ చౌబే [3]
2016 కమలేశ్వర్ స్మృతి పురస్కార్ కథాబింబ్ (సాహిత్య పత్రిక) [3]
2018 సాహిత్యం, విద్యకు చేసిన కృషికి పద్మశ్రీ భారత రాష్ట్రపతి [1]
2018 హిందీ సేవి సమ్మన్ మహాత్మా గాంధీ అంతర్జాతీయ హిందీ విశ్వవిద్యాలయం [4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "PADMA AWARDEES – 2018" (PDF). Ministry of Home Affairs, Government of India.
  2. "Full list of Padma awardees 2018". The Hindu (in Indian English). 2018-01-25. ISSN 0971-751X. Retrieved 2020-11-18.
  3. 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 "Padma Awards: Profiles" (PDF). President of India.
  4. 4.0 4.1 4.2 "Author Profile :Vani Prakashan". www.vaniprakashan.in. Retrieved 2020-11-18.[permanent dead link]
  5. 5.0 5.1 5.2 "जन्मदिन विशेषः बातचीत- मालती जोशी; कहानियां- कहानियां- कहानियां". Aaj Tak (in హిందీ). 4 June 2019. Retrieved 2020-11-18.
  6. Author, storyteller Malti Joshi passes away: Family sources