మారణహోమం
మారణ హోమం 1987 లో విడుదలైన తెలుగు సినిమా. విజయ మహేష్ కంబైన్స్ బ్యానర్ పై బత్తిని సత్యనారాయణరావు నిర్మించిన ఈ సినిమాకు ఎ.కోదండరామిరెడ్ది దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, రాధిక ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1] ఈసినిమా ఒరు ఖైదియిన్ డైరీ అనే తమిళ సినిమా కి తెలుగు లో పునర్మితమైనది. విచిత్రంగా ఈ సినిమా ఖైదీ వేట అనే పేరుతో అనువాద చిత్రం గా కూడా తెలుగు ప్రేక్షకులకు అందింది.సుప్రసిద్ధ కథకుడు భాగ్యరాజా కధని అందించాడు.
కథ
[మార్చు]డేవిడ్ ఒక రాజకీయ నాయకుడికి తీవ్రమైన అభిమాని. కానీ రాజకీయ నాయకుడు ఒక మోసగాడు. అతను డేవిడ్ భార్య మేరీని చూసిన తరువాత ఒక ప్రణాళికను రూపొందిస్తాడు. అతను డేవిడ్‌ను జైలుకు పంపి ఈ సమయంలో మేరీపై అత్యాచారం చేస్తాడు. డేవిడ్ బయటకు వచ్చినప్పుడు అతను తన భార్య ఉరితీసుకోవడం చూసి షాక్ అవుతాడు. ఆమె చేతిలో ఒక లేఖ ఉంది. విషయం తెలిసిన డేవిడ్ కోపంతో రాజకీయ నాయకుని వద్దకు వెళతాడు కాని అతను రాజకీయ నాయకుడు, అతని ఇద్దరు స్నేహితులచే మోసపోతాడు. అతనికి 22 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అంతవరకు తన కుమారుడిని జనకరాజ్ కు అప్పగిస్తాడు. 22 సంవత్సరాల తరువాత అతను బయటికి వచ్చేసరికి తన కుమారుడు పోలీసు అధికారిగా మారిపోవడాన్ని చూస్తాడు. కానీ అతను తన భార్య మరణానికి కారణమైన ముగ్గురిపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటాడు. తన కొడుకుల మద్దతు లేకుండా అతను వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు అనేది క్లైమాక్స్.
తారాగణం
[మార్చు]- కృష్ణంరాజు,
- రాధిక శరత్‌కుమార్,
- నందమూరి కళ్యాణ చక్రవర్తి,
- కుష్బూ,
- కైకాల సత్యనారాయణ,
- అన్నపూర్ణ,
- కల్పనా రాయ్,
- భీమేశ్వరరావు,
- రాఘవయ్య,
- థమ్,
- రాళ్ళబండి కామేశ్వరరావు,
- బత్తిని సత్యనారాయణరావు,
- జాస్తి బాబ్జీ,
- సుందర్ రాజన్,
- గుత్తా గాంధీ,
- శ్యామ్ ప్రసాద్,
- రమేష్,
- శ్రీనివాస రాజు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎ. కోదండరామి రెడ్డి
- రన్‌టైమ్: 137 నిమిషాలు
- స్టూడియో: విజయ మహేష్ కంబైన్స్
- నిర్మాత: బాతిని సత్యనారాయణరావు;
- స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
- విడుదల తేదీ: అక్టోబర్ 9, 1987
- సమర్పించినవారు: వజ్జే సుబ్బారావు;
- సహ నిర్మాత: వజ్జే రమేష్
మూలాలు
[మార్చు]- ↑ "Marana Homam (1987)". Indiancine.ma. Retrieved 2020-09-11.