మానికొండ సత్యనారాయణశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మానికొండ సత్యనారాయణశాస్త్రి (1895-1985) స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయనాయకులు, రచయిత, పత్రికా సంపాదకులు.

వీరు కృష్ణా జిల్లా, గుడివాడ తాలూకా ఉరుటూరు గ్రామంలో 7 జూలై 1895 తేదీన లక్ష్మీనరసింహం దంపతులకు జన్మించారు.

వీరు సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి భారత స్వాతంత్ర్య ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు.

1939 లో న్యాయశాస్త్ర పరీక్షకు హాజరై బి.ఎల్. పట్టా పొందారు. అయినా ప్రజాసేవ లోనే జీవితాన్ని గడిపారు.

వీరు సత్యాగ్రహి, గ్రామ స్వరాజ్య వారపత్రికలను సంపాదకులుగా పనిచేసారు.

వీరు తెలుగులోను, ఆంగ్లంలోను ఎన్నో గ్రంథాలను రచించారు. ఆంగ్లంలో బసు పండితుడు రచించిన చారిత్రక గ్రంథాన్ని బ్రిటిష్ మహాయుగము అనే పేరుతో తెలుగులోకి అనువదించారు.

వీరు 90 ఏళ్ల వయసులో 1985 లో పరమపదించారు

రచనలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • సత్యనారాయణశాస్త్రి, మానికొండ, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీలు: 908-9.