మాధురీ దీక్షిత్ సినిమాల జాబితా
మాధురీ దీక్షిత్ ప్రముఖ బాలీవుడ్ నటి. 1984లో అబోధ్ సినిమాతో తెరంగేట్రం చేశారు ఆమె.[1] ఆ తరువాత ఆవారా బాప్(1985), స్వాతి(1986) వంటి సినిమాల్లో ఆమె నటించినా, వీటి వల్ల ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.[1] 1988లో ఎన్.చంద్ర దర్శకత్వంలో వచ్చిన తెజాబ్ సినిమాతో ఆమెకు మొదటి హిట్ లభించింది. ఆ సంవత్సరానికిగానూ అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచింది.[2][3] ఈ సినిమాలో ఆమె డ్యాన్స్ చేసిన "ఎక్ దో తీన్" పాట పెద్ద హిట్ అయింది. ఇప్పటికీ చాలామందికి ఈ పాట, మాధురీ డ్యాన్స్ మర్చిపోరు.[3] ఆ తరువాత ఆమె నటించిన రామ్ లఖన్(1989), త్రిదేవ్(1989), కిషన్ కన్హయ్యా(1990) వంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. 1990లో ఆమె నటించిన దిల్ సినిమాతో మొదటి ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు మాధురీ.[4] ఆ తరువాతి ఏడాది సాజన్, బేటా సినిమాల్లో నటించారు మాధురీ. బేటా సినిమాకు కూడా ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకోవడం విశేషం.[4][5]
Notes
[మార్చు]References
[మార్చు]- ↑ 1.0 1.1 "People used to say I can't make it big in B-town: Madhuri Dixit". Hindustan Times. 5 June 2013. Retrieved 8 June 2015.
- ↑ "Box Office 1988". Box Office India. Archived from the original on 11 January 2012. Retrieved 21 May 2015.
- ↑ 3.0 3.1 Verma, Sukyana (15 May 2012). "Birthday Special: Madhuri Dixit's Top 25 Dance Numbers". Rediff.com. Retrieved 21 May 2015.
- ↑ 4.0 4.1 "25 sizzling pics of Madhuri". The Times of India. Retrieved 21 May 2015.
- ↑ Gulazāra; Chaterjee, Saibal (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. p. 394. ISBN 978-81-7991-066-5.