మాధవి. ఒ
స్వరూపం
ఒ. మాధవి | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2000-ప్రస్తుతం |
తల్లిదండ్రులు | సత్తయ్య, అంజలి |
వోడ్నాల మాధవి తెలుగు రంగస్థల నటి. 2000వ సంవత్సరంలో నాటకరంగంలోకి ప్రవేశించిన మాధవి, అనేక నాటికల్లో ప్రధాన పాత్రలు పోషించింది.[1]
జననం
[మార్చు]మాధవి 1983, ఆగస్టు 30న సత్తయ్య,అంజలి దంపతులకు కరీంనగర్ లో జన్మించింది.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]2000 సంవత్సరంలో నాటకరంగ ప్రవేశం చేసిన మాధవి... మంచర్ల గోపి, గూండా మల్లయ్య శిష్యరికంలో నటనలో మెళకువలు నేర్చుకున్నది. దాదాపు 100 ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లో గాయనిగా పాల్గొన్నది.
నటించిన నాటకాలు
[మార్చు]- క్షత్రగాత్రులు
- క్లిక్
- తిమిరం
- రెండో భర్త
- ఎవరో ఒకరు
- ఒకటి కొంటే ఒకటి ఫ్రీ
- అంతా భ్రాంతియే
- పడమటిగాలి
- బాపు చెప్పిన మాట[2]
బహుమతులు
[మార్చు]- ఉత్తమ క్యారెక్టర్ నటి - అంతా భ్రాంతియే (పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2011, పల్లెకోన, గుంటూరు జిల్లా)[3]
మూలాలు
[మార్చు]- ↑ మాధవి. ఒ, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 71.
- ↑ డైలీహంట్, ఈనాడు (కరీంనగర్). "తెలంగాణ మాండలికమే.. నిలబెట్టింది!". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 21 January 2020.[permanent dead link]
- ↑ పరుచూరి రఘుబాబు నాటకోత్సవాలు, స్వాతి వార పత్రిక, 27 మే 2011, పుట. 60