Jump to content

మాదిరాజు రామకోటీశ్వరరావు

వికీపీడియా నుండి
మాదిరాజు రామకోటీశ్వరరావు
స్వీయచరిత్ర ముఖచిత్రంపై మాదిరాజు రామకోటీశ్వరరావు
జననంమాదిరాజు రామకోటీశ్వరరావు
(1885-11-24)1885 నవంబరు 24
కృష్ణా జిల్లా, జుజ్జూరు గ్రామం
మరణం1960 జూలై 5
హనుమకొండ
వృత్తిన్యాయవాది
ప్రసిద్ధిప్రముఖ న్యాయవాది, గ్రంథాలయోద్యమకారుడు, ఆంధ్రోద్యమకారుడు
Notable work(s)అభ్యుదయ తెలంగాణ చరిత్రాంశములు (స్వీయచరిత్ర)
మతంహిందూ
భార్య / భర్తఅనంతలక్ష్మి
పిల్లలుమాదిరాజు వెంకటసుబ్బారావు,
మాదిరాజు లక్ష్మీకాంతరావు,
వరలక్ష్మి,
రుక్మిణి
బంధువులుఅయ్యదేవర కాళేశ్వరరావు
తండ్రిమాదిరాజు సీతారామరావు
తల్లిరంగమ్మ

మాదిరాజు రామకోటీశ్వరరావు న్యాయవాది, నిజాము రాష్ట్ర ఆంధ్రోద్యమంలో పాల్గొన్న వ్యక్తి. ఇతడు అభ్యుదయ తెలంగాణ చరిత్రాంశములు అనే పేరుతో తన స్వీయచరిత్రను రచించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు 1885, నవంబర్ 24వ తేదీకి సరియైన పార్థివ నామ సంవత్సరం కార్తీక బహుళ తదియనాడు జుజ్జూరు గ్రామంలో తన మాతామహుల ఇంటిలో మాదిరాజు సీతారామరావు, రంగమ్మ దంపతులకు జన్మించాడు.[1] ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం జుజ్జూరు, పరిటాల, నందిగామలలో నడిచింది. ఇతడు పారసీ, ఉర్దూ మాధ్యమంలో విద్యను అభ్యసించాడు. తరువాత హైదరాబాదులో ఉర్దూ మాధ్యమంలో వకాలత్ (న్యాయశాస్త్రం) చదువుకున్నాడు. వరంగల్లులో ప్రాక్టీసు ప్రారంభించాడు.

ఇతడు గ్రంథాలయాల స్థాపన, అభివృద్ధి, సంస్కృత కళాశాల, ఆయుర్వేద కళాశాల స్థాపనలలో కృషి చేశాడు. శ్రీరాజరాజ నరేంద్రాంధ్ర భాషానిలయం స్థాపించడంలో ఇతని పాత్రకూడా ఉంది. ఆ సంస్థకు ఇతడు కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా, అధ్యక్షునిగా అనేక సంవత్సరాలు సేవను అందించాడు. నిజాం ఆంధ్రోద్యమంలో పాల్గొన్నాడు. వరంగల్లు సమీపంలోని ధర్మవరం గ్రామంలో జరిగిన 9వ ఆంధ్రమహాసభకు ఇతడు అధ్యక్షుడిగా వ్యవహరించాడు. మద్యపాన నిషేధానికి కృషి చేశాడు. దేవాదాయ ధర్మాదాయ సలహా సంఘానికి సలహాదారుగా పనిచేశాడు.[1]

ఇతడు తన జీవిత చరిత్రను "అభ్యుదయ తెలంగాణ చరిత్రాంశములు" అనే పేరుతో రచించాడు. ఈ స్వీయచరిత్రలో ఆనాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు వివరించాడు. ఆ రోజులలో రజాకార్ల వలన తెలంగాణా ప్రజలు పడిన బాధలు, తెలంగాణా విమోచనం కోసం ఆ నాటి ఉద్యమనాయకులు ఎదుర్కొన్న కష్టాలు, చేసిన పోరాటాలు ఈ స్వీయ చరిత్రలో విపులంగా ప్రస్తావించాడు[1].

మాదిరాజు రామకోటీశ్వరరావు తన 74వ యేట 1960, జూలై 6వ తేదీకి సరియైన శార్వరి నామ సంవత్సరం ఆషాఢ శుద్ధ ద్వాదశి మంగళవారం నాడు హనుమకొండలో మరణించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 మాదిరాజు రామకోటీశ్వరరావు (1 December 2017). స్వీయచరిత్రము - అభ్యుదయ తేలంగాణ చరిత్రాంశములు (PDF) (2 ed.). హైదరాబాదు: తెలంగాణ సాహిత్య అకాడమీ. p. 446. Retrieved 8 April 2024.[permanent dead link]