మాడ్రిడ్
మాడ్రిడ్ స్పెయిన్ రాజధాని. యూరోపియన్ యూనియన్‌లో మూడవ అతిపెద్ద నగరం (మొదటి రెండు లండన్, బెర్లిన్), ప్రపంచంలో 27 వ అతిపెద్ద నగరం. మాడ్రిడ్ దేశంలో ఒక ముఖ్యమైన ఆర్థికంగ, వాణిజ్య కేంద్రం.[1] ప్రపంచంలోని అనేక పెద్ద, ముఖ్యమైన సంస్థల (కంపెనీలు) కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. రాజధాని నగరం కావడం వల్ల స్పెయిన్ ప్రభుత్వం, దాని మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు, జనరల్ కోర్టులు (కాంగ్రెస్, సెనేట్), సుప్రీంకోర్టు, రాజ్యాంగ న్యాయస్థానం మొదలైనవి ఇక్కడే ఉన్నాయి. ఇది స్పెయిన్ రాజులకు, ప్రధానమంత్రికి అధికారిక నివాసం కూడా. ఆర్థికంగా లండన్, పారిస్, మాస్కో తరువాత ఐరోపాలో ఇది నాల్గవ ధనిక నగరం. ఈ నగరం యొక్క మొత్తం వైశాల్యం 604.3 చదరపు కిలోమీటర్లు. జనాభా సుమారు 33 లక్షలు. మెట్రోపాలిటన్ ప్రాంతం, పొరుగు ప్రాంతాలతో సహా 65 లక్షలు. మాడ్రిడ్ నగరం మాడ్రిడ్ ప్రావిన్స్‌లోని మన్సనారే నది ఒడ్డున ఉంది. ఈ ప్రావిన్సుల సరిహద్దులుగాకాసాటిల్ లియోన్, కాసుటిల్లా మాన్సా యొక్క స్వయంప్రతిపత్త ప్రావిన్సులు ఉన్నాయి. మోనోకిల్ మ్యాగజైన్ ప్రకారం, 2017 సూచికలో, మాడ్రిడ్ ప్రపంచంలోనే జీవించడానికి అత్యంత అనువైన నగరాల్లో 10 వ స్థానంలో ఉంది.[2] మాడ్రిడ్ 21 జిల్లాలుగా విభజించబడింది.[3]
పేరు వెనుక చరిత్ర
[మార్చు]మాడ్రిడ్ పేరు వెనక అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం, ఈ నగరాన్ని టుస్కానీ, మాంటోవా రాజు టైర్హేనియస్ కుమారుడు ఓక్నో బియానోర్ స్థాపించాడు. దీనిని "మెట్రాగిర్టా" లేదా "మాంటువా కార్పెటన" అని పిలుస్తారు. చుట్టుపక్కల అడవులలో చాలా ఎలుగుబంట్లు ఉన్నందున నగరం యొక్క అసలు పేరు "ఉర్సారియా" (లాటిన్ : "ల్యాండ్ ఆఫ్ ది బేర్స్") అని ఇతర పరిశోధకులు పేర్కొన్నారు. ఈ పేరు క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దం నాటిది, రోమన్లు మంజానారెస్ నదిపై ఒక స్థావరాన్ని స్థాపించారు. ఈ మొదటి గ్రామం పేరు "మాట్రిస్". సియెర్రా డి గ్వాడరామాకు దగ్గరగా ఉన్న ఐబీరియన్ ద్వీపకల్పంలోని సెంట్రల్ మైదానంలో అరబ్బులు ఈ ప్రాంతాన్ని మాగరిట్ అంటే నీటితో సమృద్ధిగా ఉన్న భూమి గా పిలిచారు. ఇక్కడ స్పెయిన్ రాజు ఫిలిప్ II తరువాత రాజ ప్రాంగణాన్ని స్థాపించాడు. తరువాత, ఇది పెద్ద నగరంగా అభివృద్ధి చెందింది.[4]
జనాభా
[మార్చు]16 వ శతాబ్దం మధ్యలో మాడ్రిడ్ స్పెయిన్ రాజధానిగా ప్రకటించబడినప్పటి నుండి, దాని జనాభా పెరగడం ప్రారంభమైంది. ఇది 1970 లలో 30 లక్షలకు చేరుకుంది. 1990 ల మధ్య ఆర్థిక మాంద్యం కారణంగా, జనాభా గణనీయంగా తగ్గడం ప్రారంభమైంది. 21 వ శతాబ్దంలో గరిష్ట స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా, 2001, 2005 మధ్య జనాభా 271,856కు పెరిగింది. ఇందులో ఇతర దేశాల నుండి పెద్ద సంఖ్యలో వలస వచ్చినవారు కూడా ఉన్నారు. అందువలన నుండి ఇక్కడ వలస వచ్చిన జనాభాలో లాటిన్ అమెరికా, ఆసియా, యూరప్, ఆఫ్రికా లో మొత్తం మాడ్రిడ్ జనాభాలో 16.2% శాతం వరకూ ఉంటారు.
మూలాలు
[మార్చు]- ↑ http://www.demographia.com/db-worldua.pdf
- ↑ "The world's top 25 most liveable cities - 2009 - Monocle Magazine / Issue 25". web.archive.org. 2013-08-28. Archived from the original on 2013-08-28. Retrieved 2021-01-26.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "21 Destinations in Madrid". Turismo Madrid (in ఇంగ్లీష్). Retrieved 2021-01-26.
- ↑ "History of Madrid". Madrid Tourisme (in ఇంగ్లీష్). Retrieved 2021-01-26.