Jump to content

మాగాపు శరభకవి

వికీపీడియా నుండి

మాగాపు శరభకవి 17 వ శతాబ్దానికి చెందిన విద్వత్కవి, తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి మండలానికి చెందిన వాడు

చరిత్రలొ శరభ కవి

[మార్చు]

పెద్దాపురం సంస్థానం మహారాజు వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజు ఒక నాడు మంత్రి దండనాదాగ్రణులతోనూ, అస్థాన కవివరేణ్యులతోనూ సామంత ప్రభువులతోను కొలువుదీర్చియుండ ద్వారపాలకుడు వచ్చి "మహాప్రభో ! ఏలినవారి దర్శనమునకు మాగాపు శరభకవిగారను ఒక బ్రాహ్మణుడువచ్చి తాను వచ్చితినని దేవరవారితోనే మనవి చేయమన్నారు. ఏమిశెలవని విన్నవించెనట. అందులకు రాజును ఆస్థానకవీశ్వరులలో ఒకరిని పంపి, సగౌరవంగా ఆయనను తీసుకొని రమ్మనిరట ఈకవి గారు వెళ్లి ద్వారము దగ్గిరున్న శరభకవి గారి వేషమును చూసి ఆయన అవునా కాదాయని సందేహించి చివరకు ఆయనే అని తెలుసుకుని రాజాజ్న అయినదని విన్నవింప ఆకవివతంసుడు లోనికి వచ్చెరట మహారాజ దర్శనమునకు వచ్చిన ఈ కవిగా రొక అంగవస్త్రమును కట్టుకుని చేతనొక చెంబు భుజము మీద ఒక గామంచా, చంకనొక తాటియాకు పుస్తకములకట్ట మాత్రము కలిగి యుండి, బీద బ్రాహ్మణ వేషముతో నుండిరట మహారాజు ఆయనను చూసి "ఇతడా శరభకవి ? అన్నారట . అమాట రాజు గారి నోటినుండి వచ్చీరాక మునుపే "ఇతడా" అని తక్కువగౌరవము తెలిపే శబ్ధంతో సంబొదించిరనే స్వాభిమానమున, మహారాజు దయ సంపాదించవచ్చితిని కదా అను అవేశంతో ఈ క్రింది పద్యము చదివెనట

ఇతడా రంగదభంగ సంగర చమూహేతిచ్ఛటాపాలకో
ద్ధ్తకీలాశలభాయమానరిపురాడ్ధారాశ్రు ధారానవీ
న తరంగిణ్యబలాఅమాగమసమా నందత్పయోధిస్తుతా
యతశౌర్యోజ్వలుడైన వత్సవయ తిమ్మక్షావరుం డీతడా

యెందు కీలా చెప్పవలసి వచ్చిందో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయినా కొంచెం వివరిస్తాను. తనకు నేను నౌకరునుగాను. ఇండిపెండెంటు తరగతిలో వాణ్ణి. యెప్పడూతన దర్శనానికి వెళ్లలేదు కాని, ఈయనా? అని అనక, నిస్సాకారంగా నన్ను ఇతడా? అని అంటాండా? సరే! ఆయన నన్ను వొక్క సారి - ఇతడా అన్నాడు కనక ఆయన్ని నేను 60 సార్లు “యితఁడా?" అంటే సరిపోతుంది అని శరభకవిగారు. ఆ విధంగా తన సామార్థ్యాన్ని ప్రకటించారని చెప్పకుంటారు

మూలాలు

[మార్చు]
  • పెద్దాపురం సంస్థాన చరిత్ర పుట సంఖ్య 83
  • కథలు గాథలు చేళ్లపిళ్ల వేంకటశాస్త్రి పుట సంఖ్య 254