Jump to content

మహ్మద్ నవాజ్ బాషా

వికీపీడియా నుండి
మహ్మద్ నవాజ్ బాషా
మహ్మద్ నవాజ్ బాషా


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం మదనపల్లె నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 02 అక్టోబర్ 1973
మదనపల్లె, చిత్తూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు మహ్మద్ అక్బర్ సాహెబ్, రమీజా బీ
జీవిత భాగస్వామి ఎం.ఫర్మీనా యాస్మీన్‌
బంధువులు షాజహాన్ బాషా, మదనపల్లె ఎమ్మెల్యే (అన్న)
నివాసం మదనపల్లె

మహ్మద్ నవాజ్ బాషా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మదనపల్లె నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

మహ్మద్ నవాజ్ బాషా 02 అక్టోబర్ 1973లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చిత్తూరు జిల్లా , మదనపల్లె లో మహ్మద్ అక్బర్ సాహెబ్, రమీజా బీ దంపతులకు జన్మించాడు. ఆయన ఆరోగ్యవరం యుఎమ్‌టిఎస్ నుండి పదవ తరగతి పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

మహ్మద్ నవాజ్ బాషా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. అతని అన్న షాజహాన్ బాషా మదనపల్లె నుండి 2009 నుండి 2014 వరకు ఎమ్మెల్యేగా పని చేశాడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. నవాజ్ బాషా 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి దుమ్మలపాటి రమేశ్‌ పై 29,648 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3]


మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "Madanapalle Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.
  2. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
  3. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.