మహ్మద్ అమీన్ భట్
పదవీ కాలం 2014 – 2018 | |||
ముందు | మహ్మద్ సర్తాజ్ మద్నీ | ||
---|---|---|---|
తరువాత | పీర్జాదా ఫిరోజ్ అహమద్ | ||
నియోజకవర్గం | దేవ్‌సర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మహ్మద్ అమీన్ భట్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో దేవ్‌సర్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]మహ్మద్ అమీన్ భట్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి పార్టీలో కార్యకర్త స్థాయిలో వివిధ హోదాల్లో పని చేసి ఎమ్మెల్సీగా, రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2008లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి, 2014లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో దేవ్‌సర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పీడీపీ అభ్యర్థి సర్తాజ్ మద్నీపై 1511 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
మహ్మద్ అమీన్ భట్ 2022లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌కు "మద్దతు" అందించి కాంగ్రెస్ పార్టీని వీడాడు.[2][3] ఆయన ఆ తరువాత గులాం నబీ ఆజాద్ స్థాపించిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ)లో చేరి 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో డీపీఏపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి పీర్జాదా ఫిరోజ్ అహమద్ చేతిలో 11271 ఓట్ల తేడాతో ఓడిపోయి మూడో స్థానంలో నిలిచాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ TimelineDaily (9 September 2024). "Devsar Constituency: Four Key Players In The Fray" (in ఇంగ్లీష్). Retrieved 14 October 2024.
- ↑ "5 J&K Cong leaders quit in Azad's support, more resignations likely: Report". 26 August 2022. Retrieved 14 October 2024.
- ↑ News18 (26 August 2022). "5 J&K Cong Leaders Quit in Support of Azad, More Resignations Likely" (in ఇంగ్లీష్). Retrieved 14 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Devsar". Retrieved 14 October 2024.