Jump to content

మహేంద్రనాథ్ గుప్తా

వికీపీడియా నుండి
మహేంద్రనాథ్ గుప్తా
జననం(1854-07-14)1854 జూలై 14
కోల్‌కత్, పశ్చిమ బెంగాల్, భారతదేశం
మరణం1932 జూన్ 4(1932-06-04) (వయసు 77)
కోల్‌కత్, పశ్చిమ బెంగాల్, భారతదేశం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
శ్రీరామకృష్ణ కథామృతం రచయిత, పరమహంస యోగానందకు ఆధ్యాత్మిక మార్గదర్శి
కోల్‌కత లోని బారానగర్ మఠంలో 1887 జనవరి 30న తీసిన బృంద చిత్రం.
నిలుచున్న వారు: (ఎడమ–కుడి) ) స్వామి శివానంద, స్వామి రామకృష్ణానంద, స్వామి వివేకానంద, రంధుని, దేవేంద్రనాథ్ మజుందార్, మహేంద్రనాథ్ గుప్తా (M), స్వామి త్రిగుణాతీతానంద, హెచ్. ముస్తాఫి
కూర్చున్నవారు: (ఎడమ–కుడి) స్వామి నిరంజనానంద, స్వామి శారదానంద, హట్కో గోపాల్, స్వామి అభేదానంద

మహేంద్రనాథ్ గుప్తా (1854 జులై 14 - 1932 జూన్ 4) రామకృష్ణ పరమహంస గృహస్థాశ్రమ శిష్యుల్లో ఒకరు. ఈయననే మాస్టర్ మహాశయులు లేదా క్లుప్తంగా M అని కూడా పిలుస్తారు. ఈయన శ్రీరామకృష్ణ కథామృతం అనే పుస్తక రచయిత. ఇది బెంగాలీ భాషలో పేరొందిన పుస్తకం. ఇది ఆంగ్లంలో ది గోస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణగా అనువదించబడింది. ఈయన పరమహంస యోగానందకు చిన్నతనంలో ఆధ్యాత్మిక బోధకుడిగా వ్యవహరించాడు.

జీవితం

[మార్చు]

మహేంద్రనాథ్ గుప్తా 1854, జులై 14 న కోల్‌కతలో మదుసూదన్ గుప్తా, స్వర్ణమయి దేవి దంపతులకు జన్మించాడు. కలకత్తాలోని హేర్ స్కూల్ లో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత ఆయన ప్రెసిడెన్సీ కళాశాల నుంచి 1874లో బి. ఎ పట్టా పుచ్చుకున్నాడు. ఆయన చదువులో ప్రతిభావంతుడైన విద్యార్థి.[1] 1874 లో ఆయనకు నికుంజా దేవితో వివాహం అయింది. ఈమె బ్రహ్మ సమాజం నాయకుడైన కేశవ చంద్ర సేన్ కు బంధువైన ఠాకూర్ చరణ్ సేన్ కుమార్తె. చదువు పూర్తయిన తర్వాత ఈయన కొద్ది రోజులు ప్రభుత్వోద్యోగం, కొద్ది రోజులు ఒక వ్యాపార సంస్థలో పని చేసాడు. తర్వాత వివిధ కళాశలలో ఆంగ్లం, తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రం బోధించాడు. కొంతకాలానికి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ స్థాపించిన పాఠశాలలో ప్రధానాచార్య పదవిని అలంకరించాడు. ఇక్కడే ఆయనను మాస్టర్ మహాశయులు అని పిలవడం ప్రారంభించారు. తర్వాత రామకృష్ణ పరమహంస శిష్యగణంలో కొద్ది మంది, ఇంకా పరమహంస యోగానంద కూడా తన ఆత్మకథ పుస్తకంలో ఈ పేరును వాడారు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Sen 2001, p. 36
  2. "M. (Mahendra Nath Gupta)". Sri Ramakrishna Sri Ma Prakashan Trust. Archived from the original on 17 ఫిబ్రవరి 2008. Retrieved 17 March 2008.
  3. Sen 2001, p. 37

ఆధార గ్రంథాలు

[మార్చు]