మహాత్మా గాంధీ సేతువు
మహాత్మా గాంధీ సేతువు | |
---|---|
నిర్దేశాంకాలు | 25°37′19.0″N 85°12′25.7″E / 25.621944°N 85.207139°E |
OS grid reference | [2] |
దీనిపై వెళ్ళే వాహనాలు | జాతీయ రహదారి 22, జాతీయ రహదారి 31[1] |
దేనిపై ఉంది | గంగానది |
స్థలం | పాట్నా - హజీపూర్ |
అధికారిక పేరు | మహాత్మాగాంధీ సేతు |
ఇతర పేర్లు | గంగా సేతు |
ఎవరి పేరిట | మహాత్మాగాంధీ |
నిర్వహణ | నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా |
లక్షణాలు | |
డిజైను | గిడ్డార్ బ్రిడ్జ్ |
వాడిన వస్తువులు | కాంక్రీటు, స్టీలు |
మొత్తం పొడవు | 5.75 కి.మీ. (3.57 మై.) |
వెడల్పు | 25 మీ. (82 అ.) |
స్పాన్‌ల సంఖ్య | 45 |
చరిత్ర | |
డిజైనరు | గామన్ ఇండియా |
నిర్మించినవారు | గామన్ ఇండియా లిమిటెడ్ |
నిర్మాణం ప్రారంభం | 1972 |
నిర్మాణం పూర్తి | 1982 |
ప్రారంభం | మే 1982 |
గణాంకాలు | |
సుంకం | లేదు (తొలగించబడింది)[2] |
ప్రదేశం | |
మహాత్మా గాంధీ సేతువు (గాంధీ సెతువు లేదా గంగా సేతువు) గంగానదిపై నిర్మించిన వంతెన. ఇది దక్షిణాన బీహార్ లోని పాట్నా, ఉత్తరాన హజీపూర్ లను కలుపుతుంది.[3] దీని పొడవు 5,750 మీటర్లు (18,860 అడుగులు).[4] ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద వంతెన.[5][6] దీనిని 1982 మేన అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించింది. ఈ వంతెనకు హజిపూర్ వైపు గల ఉత్తర చివరన ప్రారంభోత్సవం చేసారు. దీనిని వేలాది మంది ప్రజలు సందర్శించారు.
ప్రణాళిక, ప్రాముఖ్యత
[మార్చు]ఈ వంతెన నిర్మాణానికి 1969 లో కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దీనిని 1972 నుండి 1982 వరకు 10 సంవత్సరాల పాటు గామన్ ఇండియా లిమిటెడ్ సంస్థ నిర్మించింది. ఈ వంతెన నిర్మాణ వ్యయం అప్పటికి రూ.87.22 కోట్లు. ఈ వంతెనను ఉత్తర బీహార్, మిగిలిన బీహార్ ప్రాంతాలను అనుసంధానించడానికి నిర్మించారు. ఇది జాతీయ రహదారి 19లో భాగంగా ఉంది. ఈ వంతెన నిర్మాణానికి పూర్వం "రాజేంద్ర సేతువు"ను 1959లో ప్రారంభించబడింది. ఇది ఉత్తర బీహారుకు ఒకే ఒక మార్గం. అప్పటి నుండి "విక్రమశీల సేతువు"ను గంగానదిపై నిర్మించారు. రైలు-రోడ్డు వంతెనలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఇది దిగ్దా, సోనేపూర్, ముంజెర్ లను కలుపుతుంది.[7][8]
భారతీయ తపాలా వ్యవస్థ ఒక పోస్టల్ స్టాంపును ఈ బ్రిడ్జి చిత్రంతో విడుదల చేసింది. ఈ తపాలా బిళ్లను 2007 ఆగస్టు 17 న 0500 పైసలు విలువతో విడుదల చేసారు.[9]
మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 27 May 2017.
- ↑ Madhuri Kumar (26 సెప్టెంబరు 2012). "Traffic eases on Gandhi Setu as Centre drops toll collection". Patna: The Times of India. Archived from the original on 30 ఏప్రిల్ 2016. Retrieved 27 మే 2017.
- ↑ "Destinations :: Patna". Archived from the original on 2014-09-18. Retrieved 2018-05-25.
- ↑ [1]
- ↑ "Gandhi Setu: An engineering marvel". Archived from the original on 2012-08-17. Retrieved 2018-05-25.
- ↑ longest river bridge to be rebuilt Archived 29 అక్టోబరు 2015 at the Wayback Machine business-standard.com
- ↑ "Digha Sonepur Rail Road Bridge to be operational by 2017". Archived from the original on 6 జూలై 2013. Retrieved 25 మే 2018.
- ↑ Ganga Rail-Road Bridge
- ↑ "Welcome to the Indiapost Web Site". Archived from the original on 12 ఏప్రిల్ 2011. Retrieved 25 మే 2018.