మహాత్మా గాంధీ విగ్రహం, జోహన్నెస్బర్గ్
కళాకారుడు | టింకా క్రిస్టోఫర్ |
---|---|
సంవత్సరం | 2003 |
విషయం | మహాత్మాగాంధీ |
ప్రదేశం | గాంధీ స్క్వేర్, జోహన్స్‌బర్గ్ |
26°12′23″S 28°02′35″E / 26.20647°S 28.04316°E |
మోహన్ దాస్ కరం చంద్ గాంధీ కాంస్య విగ్రహం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వద్ద గల గాంధీ స్క్వేర్ వద్ద నెలకొల్పబడింది. ఈ విగ్రహం భారత స్వాతంత్ర్యసమరయోధుడు మహాత్మా గాంధీ కి స్మారకంగా ఏర్పాటు చేసారు. ఈ విగ్రహం భారత స్వాతంత్ర్య ప్రచారకుడు, అహింసా శాంతి కాముకుడిగా ఉన్న యువకుని రూపంలో గాంధీ గారిని చిత్రీకరిస్తుంది.
వివరణ, చరిత్ర
[మార్చు]విగ్రహం ఆవిష్కరించడానికి ముందు ఈ ప్రాంతంలోని స్క్వేరును ప్రభుత్వ స్క్వేర్ అని పేరు పెట్టారు. గాంధీ పుట్టినరోజు అయిన 2003 అక్టోబర్ 2న దీనిని జోహన్నెస్‌బర్గ్ మేయర్ అమోస్ మసోండో ఆవిష్కరించాడు. [1]
ఈ స్క్వేరును గతంలో ప్రభుత్వ స్క్వేర్ అని పిలిచేవారు. ఈ ప్రాంతం గాంధీ న్యాయశాస్త్రాన్ని అభ్యసించే జోహన్నెస్‌బర్గ్ న్యాయస్థానాల ప్రదేశం. ప్రధాన జోహన్నెస్బర్గ్ బస్ టెర్మినస్ ఇప్పుడు న్యాయస్థానాలు ఉన్న చోట ఉంది. . [1]
ఈ విగ్రహం నిర్మించడానికి శిల్పిగా టింగా క్రిస్టోఫర్ ను జోహన్నెస్‌బర్గ్ ఆర్ట్ గ్యాలరీ సలహా కమిటీ ఎంపిక చేసింది. ఈ విగ్రహాన్ని క్రిస్టోఫర్ పూర్తి చేయడానికి మూడు నెలల కాలం పట్టింది, క్రిస్టోఫర్ ఈ విగ్రహ నిర్మాణం గురించి వివరిస్తూ "... ఆమె ప్రతిరోజూ 10 గంటల పాటు, వారానికి ఏడు రోజులు, ఈ పనిని పూర్తి చేయడానికి పని చేసినట్లు" చెప్పింది. దీని నిర్మాణంలో కృషి చేసిన ఇతర కళాకారులు నవోమి జాకబ్సన్, బెన్ ఒమర్, మౌరీన్ క్విన్. [1]
ఈ విగ్రహం 5 మీటర్ల ఎత్తైన స్తంభంపై ఉంది. ఈ విగ్రహం యొక్క స్థావరం చుట్టూ బెంచీలు ఉన్నాయి. ఈ విగ్రహం గాంధీ జోహన్నెస్‌బర్గ్‌లో తాను న్యాయవాదిగా పనిచేస్తున్న కాలంలో కనిపించినట్లుగా, ఒక యువకుడు తన న్యాయవాద వృత్తికి సంబంధించిన గౌనును తన సూట్ మీద ధరించినట్లు, గాలితో తన వస్త్రం ఎగురుతున్నట్లు ఉంది. ఈ విగ్రహంలో గాంధీ ఒక పుస్తకం పట్టుకొని ఎదురు చూస్తున్నాడు. ఈ విగ్రహంలో దొంగతనం నుండి రక్షించేందుకు దాని నుండి వచ్చే ప్రకంపనలను గుర్తించే భద్రతా సంస్థ పర్యవేక్షించే అలారం ఉంది. [1]
ఈ విగ్రహానికి జోహాన్నెస్‌బర్గ్ నగరం సగం నిధులు సమకూర్చింది, మిగిలినవి ప్రైవేట్ విరాళాల నుండి వచ్చాయి. [1]