Jump to content

మహల్లో కోకిల

వికీపీడియా నుండి
మహల్లో కోకిల
ముఖచిత్రం
మహల్లో కోకిల పుస్తక ముఖచిత్రం
కృతికర్త: వంశీ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: పేరడీ
విభాగం (కళా ప్రక్రియ): పుస్తకం
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
విడుదల:

మహల్లో కోకిల వంశీ రాసిన తెలుగు నవల. చతుర పత్రిక నవలల పోటీలో బహుమతి పొందింది. పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ బ్యానర్లో నవలా రచయిత వంశీ సితార సినిమాగా తీశారు.

విశేషాలు

[మార్చు]

గండశిలని చేద్దామనుకుంటుంది తన హృదయాన్ని. కానీ, ప్రతిక్షణం, ప్రతిసంఘటన ఆమెని స్పందింప చేస్తూనే వుంటాయి. ఆమెకి జీవితం మీద ఏమాత్రం ఆశా, తాపత్రయాలు లేవు. ఊహల ఉయ్యాలలతో వెన్నెలపల్లకి నిర్మించాలనే కోరిక ఆమెకు లేదు. కానీ, దేన్ని కాదంటుందో, ఏది చెయ్యకూడదనుకుంటుందో అదే చెయ్యాల్సిన పరిస్థితి ఆమెది.[1]

సినిమా

[మార్చు]

దర్శకుడు వంశీ తను రాసిన ‘మహల్లో కోకిల’ నవల ఆధారంగా సితార సినిమాను రూపొందించాడు. ఇది భానుప్రియకు తెలుగులో మొదటి సినిమా. నవలలో తన హీరోయిన్‌ చాలా అందంగా ఉంటుందని రాసుకొన్నారు వంశీ. భానుప్రియ కొంచెం నల్లగా ఉండటంతో ఆయన మొదట నీరసపడ్డాడు. అయితే ఆమె విశాలనేత్రాలు ఆయన్ని కట్టిపడేశాయి. ఫొటో సెషన్‌ చేసిన తర్వాత భానుప్రియ ఫొటోలు చూసి మారు మాట్లాడకుండా ఆమెనే హీరోయిన్‌గా ఎంపిక చేశారు వంశీ.[2]

మూలాలు

[మార్చు]
  1. మహల్లో కోకిల(Mahallo Kokila) By Vamsy - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2020-08-15. Retrieved 2020-08-30.
  2. https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-651783[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]