మహబూబ్ నగర్ మండలం (రూరల్)
మహబూబ్‌నగర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబ్‌నగర్ జిల్లా, మహబూబ్‌నగర్ స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | మహబూబ్‌నగర్ జిల్లా |
మండల కేంద్రం | మహబూబ్‌నగర్ |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 144 km² (55.6 sq mi) |
జనాభా (2016) | |
- మొత్తం | 43,750 |
- పురుషులు | 21,933 |
- స్త్రీలు | 21,817 |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
మహబూబ్ నగర్ మండలం (గ్రామీణ),తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం మహబూబ్‌నగర్.
గణాంకాలు
[మార్చు]2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 144 చ.కి.మీ. కాగా, జనాభా 43,750. జనాభాలో పురుషులు 21,933 కాగా, స్త్రీల సంఖ్య 21,817. మండలంలో 8,839 గృహాలున్నాయి.[4]
2016 లో ఏర్పడిన మండలం
[మార్చు]2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా మహబూబ్ నగర్ (రూరల్) మండలాన్ని (0+15) గ్రామాలుతో కొత్త మండల కేంధ్రంగా మహబూబ్ నగర్ జిల్లా, అదే రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అల్లిపూర్
- ధర్మాపూర్
- వెంకటాపూర్
- జమిస్తాపూర్
- అప్పాయిపల్లి
- కోడూర్
- రామచంద్రపూర్
- మాచన్‌పల్లి
- ఓబులాయిపల్లి
- కోటకదిర
- గాజులపేట
- ఇప్పలపల్లి
- ఫతేపూర్
- జైనల్లిపూర్
- మణికొండ
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.