మల్లాది వెంకట రామమూర్తి
స్వరూపం
ఎం.వి.రామమూర్తిగా ప్రసిద్ధిచెందిన మల్లాది వెంకట రామమూర్తి ప్రముఖ న్యాయవాది, రాడికల్ హ్యూమనిస్ట్, హేతువాది.[1]
జననం
[మార్చు]ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడు. 1967లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గము[2] నుండి పార్టీ రహిత అభ్యర్థిగా పోటీ చేసి ఎం.ఎన్.రాయ్ భావాలను ప్రచారం చేశారు.[3] 1975 నుండి మరణించే వరకు 'వికాసం' పత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. రామమూర్తి అఖిల భారత రాడికల్ హ్యూమనిస్ట్ సంఘం ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా పనిచేశాడు. 1975-77ల మధ్య ఎమర్జెన్సీ కాలంలో జైలుశిక్ష అనుభవించాడు. ఈయన సతీమణి మల్లాది సుబ్బమ్మ తెలుగులో ప్రముఖ స్త్రీవాద రచయిత్ర.[4]
మరణం
[మార్చు]రామమూర్తి 1998, సెప్టెంబర్ 24న మరణించాడు.[5]
రచనలు
[మార్చు]- జిల్లెళ్ళమూడి అమ్మ - తస్మాత్ జాగ్రత్త 1976
- హేతువాదమంటే? 1979
- సర్వులకూ ఒకేరకపు వ్యవహార సంహిత 1983
- ఆలోచనా తరంగాలు 1984
- భావవీచికలు 1985
- మతం -మూఢవిశ్వాసాలు 1986
- వైవాహిక కుటుంబ సలహా 1990 (మల్లాది సుబ్బమ్మ, ఎం.రాధారమణయ్యలతో కలిసి) [6]
మూలాలు
[మార్చు]- ↑ 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2009-03-04. Retrieved 2009-01-02.
- ↑ "We Become Atheists By Gora". Archived from the original on 2009-02-01. Retrieved 2009-01-02.
- ↑ Hinduism and Women By Malladi Subbamma
- ↑ The Radical Humanist v.62 1998
- ↑ వైవాహిక కుటుంబ సలహా పూర్తి పుస్తకం