మరపురాని మనిషి
మరపురాని మనిషి (1973 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తాతినేని రామారావు |
---|---|
నిర్మాణం | ఎన్.ఎన్.భట్ |
కథ | పి. కేశవ దేవ్ |
చిత్రానువాదం | తాతినేని రామారావు |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, జయంతి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
సంభాషణలు | ఆచార్య ఆత్రేయ |
ఛాయాగ్రహణం | ఎస్.వెంకటరత్నం |
కూర్పు | జె. కృష్ణ స్వామి బాలు |
నిర్మాణ సంస్థ | ఉమా ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మరపురాని మనిషి, 1973 లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని శ్రీ ఉమా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఎన్ఎన్ భట్ నిర్మించాడు. తాతినేని రామారావు దర్శకత్వం వహించాడు.[1] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, మంజుల ప్రధాన పాత్రలలో నటించారు. కెవి మహదేవన్ సంగీతం అందించారు.[1] ఈ చిత్రం మలయాళ చిత్రం ఒడైల్ నిన్ను (1965) కు రీమేక్. ఇది అదే పేరుతో ఒక నవల ఆధారంగా నిర్మించారు. దీనిని తమిళంలో శివాజీ గణేషన్ తో బాబు (1971) గా పునర్నిర్మించారు. తరువాత హిందీ చిత్రం బాబు ( 1985), రాజేష్ ఖన్నా ప్రధాన పాత్రలో నిర్మించారు. ఈ చిత్రానికి అక్కినేని నాగేశ్వరరావు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు - తెలుగు [2] అవార్డును గెలుచుకున్నాడు.
కథ
[మార్చు]అబ్బి (అక్కినేని నాగేశ్వరరావు) ఓ అనాథ, ఆత్మగౌరవం గల వ్యక్తి. రిక్షావాడిగా పనిచేస్తూ తనకాళ్ళపై తాను నిలబడి జీవిస్తూంటాడు. అతను ఒక కాలనీలో నివసిస్తున్నాడు. అక్కడ ప్రతి ఒక్కరూ అతని స్నేహపూర్వక స్వభావం వలన అతనంటే ఆదరంగా ఉంటారు. ఒక హోటల్ యజమాని రంగయ్య (ఎస్.వి.రంగ రావు) అతన్ని తన కొడుకుగా చూస్తాడు. కాని అతను ఎప్పుడూ అతని సహాయం కోరడు. అబ్బి ఒక అందమైన అమ్మాయి లక్ష్మి (మంజుల) తో ప్రేమలో పడతాడు. ఒక రాత్రి, అతను భారీ వర్షలో ధనవంతుడు శంకర్ (జగ్గయ్య) కుటుంబానికి సహాయం చేస్తాడు. దానికి బదులుగా, అతను తన భార్య పార్వతి (జయంతి), వారి అందమైన చిన్న కుమార్తె అమ్ములు (బేబీ శ్రీదేవి) తో సహా అందరూ అతడికి తమ ఇంట్లో మంచి ఆతిథ్యం ఇస్తారు.. అక్కడ నుండి, అమ్ములు తన రిక్షాలో పాఠశాలకు తీసుకు వెళ్తూంటాడు. శంకర్ జీవితాశయం అమ్ములును గ్రాడ్యుయేట్ గా చూడటమేనని అతడికి తెలుస్తుంది. ఇంతలో, లక్ష్మిని ఒక గూండా రంగా (ఆనంద మోహన్) మానభంగం చేసి చంపేస్తాడు. ఆ కోపంలో, అబ్బి అతన్ని చంపి, జైలుకు వెళ్తాడు. విడుదలైన తరువాత, అమ్ములును బిచ్చగత్తెగా, పార్వతిని వితంతువుగానూ చూసి షాక్ అవుతాడు. రంగయ్య అతనికి ఒక రిక్షా ఇప్పిస్తాడు. శంకర్ దివాళా తీసి చనిపోయాడని అతడు తెలుసుకుంటాడు. ఇప్పుడు అబ్బి వారి సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తాడు. అమ్ములును గ్రాడ్యుయేట్ గా చేయడమే అతని ఏకైక లక్ష్యమౌతుంది. సమయం గడిచిపోతుంది, అబ్బి తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచెయ్యకుండా తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కాని సంపన్న జీవనశైలికి అలవాటు పడిన అమ్ములు అతని పట్ల విరక్తి, ద్వేషం పెంచుకుంటుంది. అయినా, అబ్బి తన లక్ష్యాన్ని వదిలిపెట్టడు. సంవత్సరాలు గడిచేకొద్దీ, అబ్బి అనారోగ్యంతో మరణానికి దగ్గరవుతాడు. అమ్ములు (లత) ధనవంతుడైన శేఖర్ (చంద్ర మోహన్) తో ప్రేమలో పడుతుంది. అబ్బి అడ్డుచెప్పినపుడు ఆమె అతన్ని చాలా ఘోరంగా అవమానిస్తుంది. ఆ సమయంలో, పార్వతి అమ్ములును కొట్టి, అబ్బి గొప్పదనం గురించి చెప్పి, అమ్ములుకు కళ్ళు తెరిపిస్తుంది. ఆ తరువాత, అబ్బి శ్రమించి, అమ్ములు గ్రాడ్యుయేషన్ పూరత్య్యేలా చూస్తాడు. సమాంతరంగా, శేఖర్ తమ పెళ్ళికి తండ్రి ఆనంద రావు (గుమ్మడి) ను ఒప్పిస్తాడు. చివరగా, కొత్తగా పెళ్ళైన జంటను అబ్బి ఆశీర్వదించి మరణించడంతో సినిమా ముగుస్తుంది.
నటీనటులు
[మార్చు]- అబ్బిగా అక్కినేని నాగేశ్వరరావు
- లక్ష్మిగా మంజుల (నటి)
- రంగయ్యగా ఎస్.వి. రంగారావు
- ఆనందరావుగా గుమ్మడి వెంకటేశ్వరరావు
- శంకర్ గాజగ్గయ్య
- రాజబాబు
- నాగభూషణం
- చంద్రమోహన్
- మాడా వెంకటేశ్వరరావు
- పి.జె.శర్మ
- కాకరాల
- జయంతి
- లత
- రోజారమణి
- పుష్ప కుమారి
- శ్రీదేవి
సాంకేతిక సిబ్బంది
[మార్చు]- కళ: జి.వి.సుబ్బారావు
- నృత్యాలు: హీరలాల్, సుందరం, ఎన్. శ్రీనివాస్
- సంభాషణలు: ఆచార్య ఆత్రేయ
- సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, సి.నారాయణ రెడ్డి
- నేపథ్య గానం: ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
- సంగీతం: కె.వి.మహదేవన్
- కథ: పి. కేశవ దేవ్
- కూర్పు: జె. కృష్ణ స్వామి, బాలు
- ఛాయాగ్రహణం: ఎస్.వెంకటరత్నం
- నిర్మాత: ఎన్ఎన్ భట్
- స్క్రీన్ప్లే - దర్శకుడు: తాతినేని రామారావు
- బ్యానర్: శ్రీ ఉమా ప్రొడక్షన్స్
- విడుదల తేదీ: 1973 నవంబరు 23
పాటలు
[మార్చు]ఎస్. | పాట పేరు | సాహిత్యం | సింగర్స్ | పొడవు |
---|---|---|---|---|
1 | "వచ్చింధి వచ్చింధి" | సి.నారాయణ రెడ్డి | ఘంటసాల | 4:09 |
2 | "ఓ రామయ్య" | ఆచార్య ఆత్రేయ | ఘంటసాలా, పి. సుశీల | 4:22 |
3 | "ఏక్కడో లేడులే దేవుడు" | ఆచార్య ఆత్రేయ | ఘంటసాల | 4:01 |
4 | "ఎవడే ఈ పిల్లగాడు" | సి.నారాయణ రెడ్డి | ఎస్పీ బాలు, పి.సుశీల | 3:58 |
5 | "ఏం చెప్పను" | సి.నారాయణ రెడ్డి | ఘంటసాలా, పి. సుశీల | 4:19 |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;వెబ్ మూలము
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ The Times of India Directory and Year Book Including Who's who. Bennett, Coleman. 1980. p. 308.