మరణ కాంక్ష
స్వరూపం
మరణకాంక్ష | |
![]() | |
కృతికర్త: | సలీం |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | నవల |
ప్రచురణ: | |
విడుదల: |
మరణ కాంక్ష అనే నవల ‘మెర్సీ కిల్లింగ్’ అనే ఒక సంక్లిష్టమైన అంశాన్ని కథావస్తువుగా తీసుకొని సలీం గారు రాసిన నవల. ఒక వారపత్రికలో సీరియల్‌గా వచ్చిన ఈ నవలను, తెలుగు సాహిత్యంలో మెర్సీకిల్లింగ్ అనే అంశంపై వచ్చిన తొలి తెలుగు నవలగా చెప్పుకోవచ్చు.
ఈ నవల కథను క్లుప్తంగా పరిశీలిస్తే, రచయిత ఇరువురి కథను ప్రధానంగా తీసుకున్నాడు. ముస్కులర్ డిస్ట్ఫో అనే వ్యాధితో బాధపడుతున్న ప్రసాద్ అనే కుర్రాడిది ఒక కథ అయితే, చిన్నవయసులోనే అదే వ్యాధికి గురైనా, తల్లిదండ్రులు అందించిన స్ఫూర్తితో న్యాయవాదిగా ఎదిగిన అక్షరది మరో కథ. వ్యాధి వల్ల కలిగే బాధను తట్టుకోలేక, ప్రసాద్ మెర్సీకిల్లింగ్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే, అదే కేసులో మెర్సీ కిల్లింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది అక్షర.
పాలపిట్ట సంస్థ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు